rewari
-
‘కీ’ కోసం రైలు ఆగిపోయింది
రివారి : రాకపోకలు రద్దీగా ఉన్నాయనో, వాతావవరణం అనుకూలించడం లేదనో రైళ్లు నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ తాళం చెవి మిస్ కావడంతో, ఓ గూడ్స్ రైలు గంటల పాటు రైల్వే స్టేషన్లోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మథుర నుంచి రివారికి వెళ్తున్న బొగ్గుతో నిండిన ఓ రైలు గుర్గావ్కు దగ్గరిలో బవల్ స్టేషన్లో దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆగిపోయింది. ఈ గూడ్స్ రైలును నడుపుతున్న సిబ్బంది స్విఫ్ట్‌లు మారే క్రమంలో రైలుకు సంబంధించిన తాళం చెవి మిస్ కావడంతో ఇలా వేచిచూడాల్సి వచ్చింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్‌ఏర్పడి, వేరే మార్గాల్లో రైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. మథురలో ప్రారంభమైన ఈ రైలు, రివారికి చేరుకోవాల్సి ఉంది. మార్గం మధ్యలో డ్రైవర్, గార్డులు మారతారు. రైలును స్టేషన్లో ఆపిన తర్వాత కొత్త సిబ్బంది ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిబ్బంది స్విఫ్ట్‌ను తీసుకునే సమయంలో స్టేషన్ మాస్టర్ కీస్ అడిగాడు. ముందు స్విఫ్ట్‌లో ఉన్న సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావడంతో, తెలియక వారు తాళం చెవి ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతేకాక వారు మొబైల్ నెంబర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి, జైపూర్ నుంచి కొత్త తాళం చెవిని తెప్పించేంత వరకు రైలును కదలలేదు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలకు పైగా సమయం పట్టింది. -
పరుగుకు సిద్ధమైన 'ఫెయిరీ క్వీన్'
ప్రపంచంలోనే అత్యంత పురాతన స్టీమ్ ఇంజిన్ రైలు 'ఫెయిరీ క్వీన్' మరోసారి పట్టాలపై పరుగుపెట్టేందుకు సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానాలో గల రెవారీ స్టేషన్ల మధ్య ఫెయిరీ క్వీన్ పరుగు తీయనుంది. ప్రపంచంలో స్టీమ్ ఇంజిన్‌తో పనిచేస్తున్న రైళ్లలో ఫెయిరీ క్వీన్ ఆఖరిది. ప్రపంచవ్యాప్తంగా స్టీమ్ ఇంజిన్ రైలు ప్రేమికులు ఫెయిరీ క్వీన్‌ను ఎక్కేందుకు ఉవ్విళ్లూరేవారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఒక రోజు పరుగుకు(ఈ నెల 11న) ఫెయిరీ క్వీన్ సిద్ధమైంది. 1855లో కిట్సన్, థాంప్సన్, హ్వీవిట్సన్ అనే ముగ్గురు ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో ఫెయిరీ క్వీన్‌ను తయారు చేశారు. అదే ఏడాది ఫెయిరీ క్వీన్ ఇంగ్లాండ్ నుంచి అప్పటి కలకత్తాకు వచ్చింది. 1895 వరకూ హౌరా-రాణీగంజ్‌ల మధ్య నడిచిన ఫెయిరీ క్వీన్‌ను ఫ్లీట్ నంబర్ '22'గా పిలిచేవారు. ఆ తర్వాత బీహార్‌లో కూడా కొద్దికాలం పాటు పరుగులు తీసింది. దాదాపు 40 సంవత్సరాల పాటు చాణక్యపురిలో గల నేషనల్ రైల్ మ్యూజియంలో ఫెయిరీ క్వీన్‌ను ప్రదర్శనకు ఉంచారు. 1997లో మరోమారు మరమ్మత్తులు చేసి పట్టాలెక్కించారు. 1998లో వాడకంలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ ఇంజిన్ రైలుగా ఫెయిరీ క్వీన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. అదే ఏడాది అప్పటి ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ యూనిక్ టూరిజం ప్రాజెక్టు కింద ఫెయిరీ క్వీన్‌కు జాతీయ టూరిజం అవార్డును బహుకరించారు. -
అడ్డంగా బుక్కైన హర్యానా అధికారులు..!
గుర్గావ్ః విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగలాలు చిక్కాయి. ఓ కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లులను చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు లంచావతారాలు అధికారుల దాడుల్లో అడ్డంగా బుక్కయ్యారు. కాంట్రాక్టర్ వద్దనుంచీ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానాలోని రివారీలో విజిలెన్స్ బ్యూరో అధికారులకు అవినీతి చేపలు చిక్కాయి. ప్రజారోగ్య శాఖకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. కోస్లీలోని పబ్లిక్ హెల్గ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్డీవో రాజ్ కుమార్, జూనియర్ ఇంజనీర్ దల్బీర్ సింగ్ బురా, సీనియర్ గుమాస్తా గుల్షన్ కుమార్ లు, స్థానిక కాంట్రాక్టర్ ఆనంద్ ప్రకాశ్ వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.. లంచావతారాలను అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకున్న డబ్బు ఎస్డీవో నుంచి 9000, ఇంజనీర్ నుంచి 6000, క్లర్క్ నుంచి 2500 లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అకౌంటెంట్ అనిల్ కుమార్ సహా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటిండెంట్ ఇంజనీర్లకు సైతం ఒక్కోరికీ 9 వేలు చొప్పున లంచం చెల్లించేందుకు బురా సిద్ధంగా ఉండగా.. అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ డీఎప్పీ నరేష్ కుమార్ తెలిపారు. కాంట్రాక్టర్ ఆనంద్.. తనకు రావాల్సిన 6 లక్షల రూపాయల బిల్లును క్లియర్ చేసేందుకు సదరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళిక ప్రకారం దాడిచేసి లంచగొండి అధికారులను అరెస్ట్ చేశారు. -
భర్త ఎదుటే మహిళపై సామూహిక అత్యాచారం
రేవారి(హర్యానా): ఉన్మాదుల కామ దాహానికి మరో అతివ బలైంది. హర్యానాలో ఓ మహిళపై 10 మంది కామ పిశాచులు ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రేవారికి సమీపంలోని బలైర్ ఖుర్ద్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. భర్తను బందించి అతని భార్యపై సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకం అనంతరం రూ.7 వేల నగదు, గహోపకరణాలను దోచుకుని నిందితులు పరారయ్యారు. బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు తుపాకీతో బెదిరించి ఆమె భర్తను మంచానికి కట్టేసి ధాష్టీకానికి దిగారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని కూడా నిందితులు తరలించుకునిపోయినట్లు పోలీసులు తెలిపారు. -
భారతీయ జవాన్లు త్యాగధనులు: మోడీ
-
భారతీయ జవాన్లు త్యాగధనులు: మోడీ
మాతృదేశం కోసం సర్వం వదులుకున్న త్యాగధనులు భారతీయ జవాన్లు అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. ఆదివారం హర్యానాలోని రేవారిలో ఏర్పాటు చేసిన మాజీ సైనికుల ర్యాలీలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగిస్తూ.... దేశం కోసం అమరులైన జవాన్లకు ఆయన వందనాలు తెలిపారు. సైనిక స్కూల్లో చదువుకోవాలన్న తన లక్ష్యం నెరవేరలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికై మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో న్యూఢిల్లీ నుంచి నేరుగా హర్యానాలోని రేవారికి మోడీ చేరుకున్నారు. అనంతరం మోడీని ఆర్మీ మాజీ చీఫ్ వి.కే.సింగ్ సభవేదికపైకి తోడ్కుని వెళ్లారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ సభకు హాజరైన ప్రజలు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ర్యాలీకి వందలాది మంది మాజీ సైనికులతోపాటు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.