Rights of the Child
-
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్‌వర్క్‌లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్‌గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
బాలల హక్కుల చట్టాలపై పట్టు సాధించాలి
గుంటూరు క్రైం: బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, గుడ్ షఫర్డ్ కాన్వెంట్ అమరావతి ఆధ్వర్యంలో బుధవారం ‘పోలీసు భద్రత-మానవ హక్కుల పరిరక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ ఎఫెన్సెస్ ఆఫ్ చిల్డ్రన్ (పోక్సో), నిర్భయ చట్టాల్లోని పలు సెక్షన్లపై వివరించారు. ముఖ్యఅతిథి రాజేష్‌కుమార్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బాధితులకు నిజమైన న్యాయం చేయగలమన్నారు. బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలలపై అత్యాచారం జరిగిన సందర్భాల్లో పోక్సో, నిర్భయ చట్టాల ప్రకారం కేసులు పటిష్టంగా నమోదు చేయాలన్నారు. మహిళలపై హింసాత్మక చర్యలకు పాల్పడినవారిపైనా కఠినంగా వ్యవహరించి చట్టంలో ఉన్న సెక్షన్లను పటిష్టంగా నమోదుచేసి బాధితులకు న్యాయంచేయాలని సూచించారు. బాలలు, వారి హక్కులను కాపాడడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పారు. గుడ్ షఫర్డ్ కాన్వెంట్ సిస్టర్ అరుణాజార్జి మాట్లాడుతూ బాలలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం 73 దేశాల్లో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. సమాజంలో బాలలు అనేక రకాల హింసలకు గురవుతుండడం విచారకరమన్నారు. పాశ్చాత్య సంస్కృతి పేరుతో విష సంస్కృతికి కొందరు అలవాటుపడి బాలలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతుండడం విచాకరమన్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ పోక్సో, నిర్భయ చట్టాలపై పోలీసులు పూర్తిస్థాయిలో తెలుసుకుంటే బాధితులకు న్యాయంచేయవచ్చని వారిని చైతన్య పరిచేందుకు సదస్సునిర్వహించామని చెప్పారు. అనంతరం పలువురు సిబ్బంది చట్టాల్లో తమకు ఉన్న అనుమానాలపై వివరాలు తెలసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు, సిస్టర్లు దీప్తి, గ్రేసి, అరుల్దాస్, కోలా సమీర్, డీఎస్పీలు గంగాధరం, నరసింహ, మధుసూదనరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలల హక్కులను హరిస్తే కఠిన చర్యలు
ఘనంగా బాలల దినోత్సవం కర్నూలు(విద్య) : బాలల హక్కులను హరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. శుక్రవారం సునయన ఆడిటోరియంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ రవికృష్ణ, ఏజేసీ రామస్వామి, డీఈఓ కె.నాగేశ్వరరావు, ఎస్ఎస్ఎస్ పీఓ మురళీధర్ రావులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పలు కారణాలతో బడికి రాకుండా బడిబయట ఉన్న వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తిరిగి పాఠశాలలో చేరించాలన్నారు.ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కులను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి సహాయమైనా అందించేందుకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. బాలల దినోత్సవాన్ని పరుస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, డీఎంహెచ్ఓ నరసింహులు పాల్గొన్నారు. -
బాలలకు భరోసా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలల హక్కుల సమస్యలు రోజురోజు కూ పెరిగిపోతున్నాయి. బాలకా ర్మికులుగా మారుతున్న వారు కొందరైతే, అదృశ్యం అవుతున్న వారు మరికొందరు. బాలలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతుం డటం పరిపాటిగా మారటం విచా రకరం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండన్న మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దు ల్ కలామ్ పిలుపు ఫలించాలంటే బాలల భవిష్యత్‌కు హామీ లభిం చాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావులు పారదర్శకం గా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లని నియమించి బాలల భవితకు భరోసా ఇవ్వాలి. టి.సురేష్‌కుమార్ మందరాడ, శ్రీకాకుళం జిల్లా