RIL chairman Mukesh Ambani
-
మార్కెట్ విలువలో బీఎస్ఈ సరికొత్త రికార్డ్
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. సోమవారానికల్లా మార్కెట్లు వరుసగా 9 రోజులపాటు లాభపడుతూ వచ్చాయి. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,623 పాయింట్లు జంప్‌చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12,89,863 కోట్లకుపైగా జత కలిసింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ విలువ అంటే లిస్టెడ్ కంపెనీల విలువ తొలిసారి రూ. 191 లక్షల కోట్లను తాకింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్ల రూపేణా 2.6 ట్రిలియన్లకు సమానంకావడం విశేషం! (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) పలు అంశాల సపోర్ట్ కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రధానంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత రెండు నెలల్లోనే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీనికితోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెంటిమెంటు బలపడిందని తెలియజేశారు. డిసెంబర్లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవర్ అవుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా అభిప్రాయపడటం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించారు. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 2020లోనూ బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 191 ట్రిలియన్ మార్క్‌ను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ. 12,49,218 కోట్లను అధిగమించింది. ఈ వెనుకే సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 11,50,106 కోట్ల విలువతో రెండో ర్యాంకును సాధించింది. కాగా.. కోవిడ్-19 సంక్షోభంలోనూ 2020లో సెన్సెక్స్ దాదాపు 16 శాతం పురోగమించిన విషయం విదితమే. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 32.49 లక్షల కోట్లమేర వృద్ధి చెందింది! -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ రిటైల్!
బిగ్‌బజార్ రిటైల్ స్టోర్లను నిర్వహించే ఫ్యూచర్ రిటైల్‌లో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ వాటా కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో అంచనాలు పెరిగాయి. కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్.. బిగ్‌బజార్ బ్రాండ్ హైపర్ మార్కెట్లతోపాటు.. గ్రాసరీ చైన్ ఈజీడే క్లబ్‌ను సైతం నిర్వహిస్తోంది. బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా గత వారం యూఎస్ డాలర్ బాండ్లపై వడ్డీ చెల్లింపులను మిస్ అయినట్లు తెలుస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. కాగా.. జూన్ 30కల్లా ఫ్యూచర్ రిటైల్‌లో ప్రమోటర్లు తమ వాటాలో 75 శాతం వరకూ తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌లో వాటాను ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించే బాటలో చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఆర్ఐఎల్ వాటా కొనుగోలు అంశంపై మార్కెట్లో అంచనాలు పెరిగినట్లు ఈ సందర్భంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వాటా విక్రయం తదుపరి గ్రూప్‌లోని ఎఫ్ఎంసీజీ బిజినెస్సహా మిగిలిన వివిధ విభాగాలను బియానీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఫ్యూచర్ గ్రూప్, ఆర్ఐఎల్ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! షేర్ల జోరు ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలు చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మరోసారి జోరందుకుంది. గత కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఆర్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో రూ. 2199 వరకూ ఎగసింది. ప్రస్తుతం 1.6 శాతం బలపడి రూ. 2181 వద్ద ట్రేడవుతోంది. ఇక మరోపక్క ఫ్యూచర్ రిటైల్ కౌంటర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 100 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. రుణ భారం పెరగడంతో కిశోర్ బియానీ గ్రూప్.. గతంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు తదితర అంశాలు కంపెనీ లిక్విడిటీ సమస్యలను పెంచుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఏడాది కాలాన్ని పరిగణిస్తే.. ఫ్యూచర్ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 74 శాతం పతనమై రూ. 11,000 కోట్ల దిగువకు చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రూప్ రుణభారం రూ. 12,000 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. -
రిటైల్‌లో అమెజాన్‌కు వాటా!- ఆర్ఐఎల్ రికార్డ్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రిలయన్స్ రిటైల్(ఆర్ఆర్ఎల్)లో అమెజాన్ దాదాపు 10 వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్ కుదిరితే రిలయన్స్ రిటైల్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 3-4 లక్షల కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా అనధికార అన్‌లిస్టెడ్ షేర్ల మార్కెట్లో ఆర్ఆర్ఎల్ ఈక్విటీ షేరు విలువ 150 శాతం ప్రీమియంతో రూ. 1150-1200 వద్ద కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ ఆధారంగా ఆర్ఆర్ఎల్ విలువ రూ. 650-600 స్థాయికి దిగివచ్చే వీలున్నట్లు అభిషేక్ సెక్యూరిటీస్ నిపుణులు సందీప్ గినోడియా అంచనా వేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. రిటైల్ విభాగం ఆర్ఆర్ఎల్ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా 4:1 నిష్పత్తిలో అంటే 4 ఆర్ఆర్ఎల్ షేర్లకుగాను 1 ఆర్ఐఎల్ షేరుని జారీ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్ఐఎల్ విలువ రూ. 1600కాగా.. రిలయన్స్ రిటైల్ విలువను రూ. 400-450గా అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్ఐఎల్ రూ. 2000 మార్క్‌ను అధిగమించడంతో ఆర్ఆర్ఎల్ విలువ రూ. 500కు చేరవచ్చని జెన్నెక్ట్స్ నిపుణులు సునీల్ చందక్ పేర్కొన్నారు. 100 శాతం వాటా రిలయన్స్ రిటైల్‌లో ఆర్ఐఎల్కు 99.95 శాతం వాటా ఉంది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో 25 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ఆర్ఆర్ఎల్ మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు పలకవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లోనూ వాటా విక్రయ యోచనలో ఉన్నట్లు ముకేశ్ అంబానీ ఏజీఎంలో సంకేతాలిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జియో ప్లాట్‌ఫామ్స్‌కు లభించినంత ప్రీమియంను రిలయన్స్ రిటైల్ పొందలేకపోవచ్చని భావిస్తున్నారు. కాగా.. మరోవైపు కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్‌ను ఆర్ఐఎల్ సొంతం చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 2161 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా కొత్త చరిత్రను లిఖించడం విశేషం! -
ఆర్ఐఎల్ కన్ను!- ఫ్యూచర్ గ్రూప్ అదిరే
వినియోగ రంగంలో సేవలందిస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌పై డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్నేసినట్లు వెలువడిన వార్తలు ఒక్కసారిగా గ్రూప్‌లోని కౌంటర్లన్నిటికీ జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఫ్యూచర్ గ్రూప్‌లోని షేర్లన్నీ 5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఫ్యూచర్ గ్రూప్‌లోని కొన్ని యూనిట్లలో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ వాటా కొనుగోలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో డీల్ కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయని మీడియా పేర్కొంది. కాగా.. ఇటీవల నెల రోజులుగా ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జోరుగా హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరవుకావడంతో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ రూ. 170 సమీపంలో, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ రూ. 31 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ రూ. 16.55 వద్ద, ఈ కంపెనీ డీవీఆర్ రూ. 18.20 వద్ద, ఫ్యూచర్ రిటైల్ రూ. 142.4 వద్ద, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ రూ. 150 సమీపంలో, ఫ్యూచర్ కన్జూమర్ రూ. 18.4 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ షేర్లన్నీ 5 శాతం చొప్పున జంప్ చేయడం విశేషం! నెల రోజుల్లో గత నెల రోజుల్లో ఫ్యూచర్ కన్జూమర్ షేరు 141 శాతం దూసుకెళ్లగా.. ఫ్యూచర్ మార్కెట్ 104 శాతం, ఫ్యూచర్ రిటైల్ 94 శాతం, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 88 శాతం చొప్పున జంప్ చేశాయి. ఈ కాలంలో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ కౌంటర్ మాత్రం 7 శాతమే లాభపడింది. కాగా.. షేర్ల ర్యాలీకి మార్కెట్ శక్తులే కారణమని.. ఈ అంశంపై కంపెనీ తరఫున స్పందించబోమని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన జియో!
ఫ్రీ ఇంటర్నెట్ అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సిమ్ సర్వీస్ జియో. మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే జియో అంచనాలకు మించి యూజర్లను సంపాదించుకుంది. కేవలం నెలరోజుల్లోనే 16 మిలియన్ల(1.6 కోట్లు) మంది సబ్ స్క్రైబర్స్ (యూజర్లు)ను సొంతం చేసుకుని జియో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు. ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ కూడా ఈ స్థాయిలో యూజర్లను తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని ముఖేశ్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, కస్టమర్ల కోసం తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. (చదవండీ: జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!) జియో వెలకమ్ ఆఫర్ అంటూ మై జియో యాప్ ద్వారా ప్రోమోకోడ్ పొందిన కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో జియో సిమ్స్ తీసుకోవచ్చు. డిసెంబర్ 31వరకూ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్రీ ఇంటర్ నెట్ బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ సౌకర్యాలతో మార్కెట్లోకి వచ్చిన జియో సర్వీస్ కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వాయిస్ కాల్స్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా జియోకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆగస్టులోనే మార్కెట్లోకి ట్రయల్ వర్షన్ అంటూ జియో సిమ్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా లాంచ్ చేశారు. 50 మిలియన్ల కస్టమర్లు లక్ష్యంగా పెట్టుకున్న జియో ప్రాజెక్టులో ఇప్పటికే 16 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతుంది.