బాబోయ్... మా బంధువుల్ని సాగనంపండి..
గుంటూరు: తన ఇంట్లో తిష్టవేసిన బంధువుల బెడద తీర్చాలంటూ ఓ వ్యక్తితన గోడును పోలీసుల ముందు వెళ్లబోసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంఎస్ కాలనీకి చెందిన మాజీ సైనికోద్యోగి ఒకరు సోమవారం పోలీసు స్టేషన్కు వచ్చారు.
కొన్ని రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన బంధువులు తిరిగి వెళ్లేలాలేరని, వారిని ఎలాగైనా పంపించాలని విజ్ఞప్తి చేశాడు. వారితో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం ఇదేం కేసురా బాబూ..అంటూ తలలు పట్టుకున్నారు.