శతవృద్ధ సైకిలిస్ట్
తిక్క లెక్క
ఈ రోజుల్లో బైకులు మరిగిన కుర్రాళ్లు సైతం సైకిల్ తొక్కాలంటే ఆపసోపాలు పడిపోతారు. ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న ఫ్రెంచి తాతయ్య మాత్రం సైకిల్ రేసులకు ఇప్పటికీ సై అంటే సై అంటూ సిద్ధమైపోతాడు. ఈయన పేరు రాబర్ట్ మర్చంద్. వయసంటారా..? సెంచరీ పూర్తిచేసి రెండేళ్లు దాటింది.
స్విట్జర్లాండ్లో శతవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన సైకిల్ రేసులో ఈయన గంటలోనే ఏకంగా పదిహేను మైళ్లు ఆపకుండా సైకిల్ తొక్కి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టేశాడు.