rocket engine
-
మరో రాకెట్‌ను ప్రయోగించనున్న స్కైరూట్.. తేదీ ఎప్పుడంటే..
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. అంతర్జాతీయంగా స్పేస్ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు రాకెట్లును పంపుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ గతేడాది విక్రమ్-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంతో విక్రమ్-1ను లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతుంది. స్కైరూట్ సంస్థ రూపొందించిన ‘విక్రమ్-1’ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధానకార్యాలయం(మ్యాక్స్-క్యూ)ను మంత్రి సందర్శించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న స్పేస్, బయోటెక్, అగ్రికల్చర్ రంగాల్లో యువతకు అపారఅవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో స్టార్టప్ సంస్థల సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ప్రధాని మోదీ కాంక్షిస్తున్నారని చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన మాట్లాడుతూ అసాధారణమైన వాటిని సాధించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. సంస్థ సీఓఓ భరత్ డాకా మాట్లాడుతూ విక్రమ్-1 డిజైన్ దేశీయంగా తయారుచేసినట్లు చెప్పారు. విక్రమ్-1 దాదాపు 300కిలోల పేలోడ్‌ను భూదిగువ కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్. ఈ ప్రయోగం వివిధ దశల్లో జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. విక్రమ్-1ను 2024లో ప్రయోగించనున్నారు. స్కైరూట్ క్యార్యాలయం అయిన మ్యాక్స్-క్యూలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్‌తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 300 మంది పనిచేసేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. -
అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చిన రష్యా!
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వన్‌వెబ్ వెల్లడించింది. కజికిస్తాన్ నుంచి ప్రయోగించే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా బ్రిటన్ శాటిలైట్ కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు రష్యా తమ దేశ అంతరిక్ష రాకెట్ సూయజ్ నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను తొలగించింది. భారత్ జెండాను మాత్రం అలాగే ఉంచింది. రష్యా అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ దీనికి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కొన్ని దేశాల జెండాలు లేకపోతే తమ నౌక మరింత అందంగా కనిపిస్తోందని అన్నారు. మరోవైపు అమెరికాకు రాకెట్ ఇంజన్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టుగా రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు అగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో రాకెట్ ఇంజిన్లను అమెరికాకు పంపిణీ చేయలేమని ఆ దేశ అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ చెప్పారు. అమెరికా తాను తయారు చేసే చీపురు కట్టలపై ఎగరాలంటూ ఎగతాళి చేశారు. 1990 నుంచి ఇప్పటివరకు రష్యా 122ఆర్డీ–180 ఇంజన్లను అగ్రరాజ్యానికి పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ ఇంజన్ల సర్వీసును కూడా నిలిపివేస్తున్నట్టుగా రోగోజిన్ స్పష్టం చేశారు. (చదవండి: తట్టుకుని నిలబడతాం!... ఉక్రెయిన్‌ని పునర్నిర్మిస్తాం) -
శత్రు దేశాలకు ఉత్తరకొరియా షాక్
ప్రపంచాన్ని భయపెట్టడానికి ఉత్తర కొరియా షాక్ ల మీద షాకులు ఇస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా వెన్నులో ఎలాగైనా వణుకు పుట్టించి, శత్రుదేశాల్లో తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే అణుబాంబును విజయవంతంగా ప్రయోగించామని ప్రకటించిన ఉత్తరకొరియా, తాజాగా ఖండాంతర బాలిస్టిక్ రాకెట్ పరీక్ష విజయవంతమైనట్టు శనివారం పేర్కొంది. అమెరికాపై అణుబాంబుల దాడికి ఇవి సామర్థ్యాన్ని చేకూర్చుతాయని వెల్లడించింది. అగ్రరాజ్యంపై అణు దాడి చేసే సత్తా ఆ కొత్త ఇంజిన్‌కు ఉందని ఉత్తర కొరియా అధికార వెబ్సైట్ పేర్కొంది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ పరీక్షలు నిజంగా విజయవంతమైనవి అయితే ఈ ఏడాది ఉత్తరకొరియా నిర్వహించిన పరీక్షలో ఇది నాలుగవది. అణుఆయుధాల ప్రొగ్రామ్ ల్లో తన ఉనికిని చాటుకోవడానికి ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఉత్తరకొరియా ఈ పరీక్ష నిర్వహించదనడంలో తమకు ఏ మాత్రం నమ్మకం లేదని దక్షిణ కొరియా పేర్కొంది. ఖండాంతర అణుపరీక్షలకు 2014 నుంచి ఐక్యరాజ్య సమితి అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా తొలి మధ్య శ్రేణి రాకెట్ ను పరీక్షించిందని ఈ దేశ కేంద్ర న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మధ్య అణు ఆయుధాల పరీక్షల్లో ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా దృష్టిపెడుతుండంతో ఉత్తర దేశాలకు అతడిని అత్యంత శత్రువుగా భావిస్తున్నారు. -
3డీ ప్రింట్‌తో రాకెట్ ఇంజన్ విడిభాగాలు
విజయవంతంగా పరీక్షించిన నాసా వాషింగ్టన్: 3డీ ప్రింట్ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజన్ విడిభాగాలను రూపొందించడమే కాక వాటిని విజయవంతంగా పరీక్షించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉష్ణోగ్రత, తీవ్రతను రాగి మిశ్రమంతో రూపొం దించిన ఈ 3డీ విడిభాగాలు తట్టుకుంటాయని ఈ పరీక్షల్లో వెల్లడైంది. నాసాలోని గ్లెన్ రిసెర్చ్ సెంటర్లోని ఎయిరోజెట్ రాకెట్‌డైన్(ఏఆర్)తో నాసా సంయుక్తంగా ఈ 3డీ రాకెట్ విడిభాగాలను తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. 3డీ పరిజ్ఞానం ఉపయోగించి రూపొందించిన రాకెట్ ఇంజన్ విడిభాగాలపై అత్యంత కఠినమైన పరీక్షలు జరపడం ఇదే మొదటిసారి. నాసా, ఏఆర్ కలిపి నాలుగు ఇంజెక్టర్లపై మొత్తం 19 రకాల హాట్ ఫైర్ టెస్ట్‌లను పరిశోధకులు నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహించిన ఈ పరీక్షలన్నీ విజయవంతమైనట్టు నాసా తెలిపింది.