శత్రు దేశాలకు ఉత్తరకొరియా షాక్
ప్రపంచాన్ని భయపెట్టడానికి ఉత్తర కొరియా షాక్ ల మీద షాకులు ఇస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా వెన్నులో ఎలాగైనా వణుకు పుట్టించి, శత్రుదేశాల్లో తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే అణుబాంబును విజయవంతంగా ప్రయోగించామని ప్రకటించిన ఉత్తరకొరియా, తాజాగా ఖండాంతర బాలిస్టిక్ రాకెట్ పరీక్ష విజయవంతమైనట్టు శనివారం పేర్కొంది. అమెరికాపై అణుబాంబుల దాడికి ఇవి సామర్థ్యాన్ని చేకూర్చుతాయని వెల్లడించింది. అగ్రరాజ్యంపై అణు దాడి చేసే సత్తా ఆ కొత్త ఇంజిన్‌కు ఉందని ఉత్తర కొరియా అధికార వెబ్‌సైట్ పేర్కొంది.
ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ పరీక్షలు నిజంగా విజయవంతమైనవి అయితే ఈ ఏడాది ఉత్తరకొరియా నిర్వహించిన పరీక్షలో ఇది నాలుగవది. అణుఆయుధాల ప్రొగ్రామ్ ల్లో తన ఉనికిని చాటుకోవడానికి ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఉత్తరకొరియా ఈ పరీక్ష నిర్వహించదనడంలో తమకు ఏ మాత్రం నమ్మకం లేదని దక్షిణ కొరియా పేర్కొంది.
ఖండాంతర అణుపరీక్షలకు 2014 నుంచి ఐక్యరాజ్య సమితి అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా తొలి మధ్య శ్రేణి రాకెట్ ను పరీక్షించిందని ఈ దేశ కేంద్ర న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మధ్య అణు ఆయుధాల పరీక్షల్లో ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా దృష్టిపెడుతుండంతో ఉత్తర దేశాలకు అతడిని అత్యంత శత్రువుగా భావిస్తున్నారు.