roots
-
జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!
కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ, భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథలు సుఖాంత అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే..కొత్త మలుపుతో రసవత్తరంగా ఉంటుది. కానీ సుఖాంతమైతే బావుండనని మాత్రం అనిపిస్తుంది. అలాంటి తపించే కథే స్విస్ మహిళ గాధ. ఆమె పుట్టింది భారత్‌లో, పెరిగింది స్విస్ దంపతులు వద్ద. తన కన్నవాళ్లు వాళ్లు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మమూలలను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది. తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ!. విద్యా ఫిలిప్పన్ ఫిబ్రవరి 8, 1996న భారత్‌లో జన్మించింది. ఐతే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిప్పన్ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్లు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్ ప్రాంతామని తెలుసుకుంది. కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంతసాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రైస్ చేయడం సాధ్యం కాలేదు విద్యాకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిప్పన్ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు గురించి ఏమైన తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా ఫిలిప్పన్ మాట్లాడుతూ..నా తల్లికి 20 సంవత్సరాలు వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను పదేళ్లుగా వెతుకుతున్నానని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ అని ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుగొంటే గనుక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గానీ కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండను కదూ. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపనపడుతున్న ఆ విద్యా ఫిలిప్పన్కు నిరాశ ఎదరవ్వకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉంటే బావుండు. (చదవండి: కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!) -
రూట్స్ అఫ్ లైఫ్ ఫోటో గ్యాలరీ
-
మూలాలన్నీ ఆదిమ సమాజంలోనే!
ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఈ స్థితికి చేరడానికి కారణం తరతరాల పూర్వీకులు కూడబెట్టిన జ్ఞాన సంపదే. ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మాత్రమే జ్ఞానం కాదు. ఇప్పటికీ లిపి లేని ఎందరో ఆదిమ జాతుల వారు జీవనం సాగిస్తున్నారు. వారిది మౌఖిక విజ్ఞానం. ప్రకృతితో మమేకమవ్వటం, దాని పరిరక్షణ, దానిని ఉపయోగించుకోవడంలో వారు అగ్రగణ్యులు. సోకాల్డ్ ఆధునిక సమాజాలవారు ఈ జ్ఞానాన్ని గ్రహించి మరింతగా పురోగమించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్కృతి బహు ముఖంగా విస్తరిస్తోంది. ఈ విద్యా సంస్కృతీ వికాసానికి మూలమైన తాత్త్వికులు లిఖిత విద్యనే ప్రమాణంగా తీసుకోలేదు. భారతదేశంలో గిరిజనులు మౌఖిక జ్ఞాన సంపన్నులు. దేశీయ భాషల్లో జీవం ఉంటుంది. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, చెట్టూ, పుట్టా అన్నింటి విలువలు వీరి జ్ఞానంలో ఒదిగి ఉన్నాయి. అయితే వారి నుండి మనం పూర్తి జ్ఞానాన్ని పొంద లేదు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని సుసంపన్నం చేయాలంటే మౌఖిక జ్ఞాన సంపద లోతుల్లోకి మనం వెళ్ళాలి. ప్రపంచ విజ్ఞానమంతా ప్రకృతిలో దాగి ఉంది. వృక్ష, జంతు, భూగర్భ శాస్త్రముల వంటి వన్నీ విస్తృతి చెందాలంటే మానవ సమాజ జీవన వ్యవస్థల లోతుల్లోకి ఇంకా పరిశోధనలు వెళ్ళాలి. మనం మన కళ్ళముందు ఉన్నదాన్ని గ్రహించ లేక మన జీవన వ్యవస్థల్లో భాగంగా ఉన్న భాష మీద ఆధిపత్యం లేక ఉపరితల అంశాల మీదే దృష్టి పెడు తున్నాం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? సమస్త జ్ఞానం ఇంద్రి యానుభవం ద్వారానే సిద్ధిస్తుందా? ఈ తాత్త్విక, భౌతిక దృష్టి లోపించి ప్రయోజనవాద దృష్టి పెరిగింది. ఇది మానవులకు ఉప యుక్తం కాదు. మనిషి తప్పక వాస్త వాన్ని అంగీకరించే ధోరణి లోకి రావాలి. వాస్తవం ప్రకృతిలోనూ, ప్రాకృతిక జీవుల్లోనూ ఎక్కువ ఉంటుంది. తాత్త్విక దృక్పథం లేని వాళ్ళే భూమి పొరలను చీల్చి భూగర్భ ఖనిజాలను అమ్ముకుంటున్నారు. ప్రపంచం అంతా ఈ రోజు అస్తవ్యస్తం కావ డానికి ప్రపంచం మీద, దేశం మీదా అవగాహన లేని అవిద్యాపరుల భావనలే. మనిషి స్వార్థపరుడు కావడానికి కారణం జ్ఞాన శూన్యతే. ప్లేటో చెప్పినట్టు వృక్షత్వం భావన నుంచి చెట్టు మూలం తెలుస్తుంది. చెట్టు మూలం తెలియని వాడు దాని వేర్లు నరుకుతాడు. చెట్టు మూలం తెలియని వాడు చెట్టు పెంచడు. కాగా, చెట్టు మూలం తెలిసిన వాడు దాని ఆకులోని ఔషధ గుణాన్ని స్వీకరిస్తాడు. చెట్టుకి మానవ సమా జానికి ఉన్న అంత స్సంబంధం తెలియని వాడు జ్ఞాని కాదు. నిజమైన జ్ఞానం వస్తువుకు మనకు ఉండే అంతస్సంబంధం నుండే జనిస్తుంది. చాలామంది తన చుట్టూ ఉన్న పరిసరాల మీద అవగాహనను పెంచు కోలేదు. తాము చూడని, కనని, వినని అజ్ఞాత దైవాల మీద, తమకు అనుభవం కాని కులం మీద, తాము అనుభవించని సంపద మీదా ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మూఢ విశ్వాసు లుగా మారతారు. జ్ఞానానికి వారు అవరోధులు. మౌఖిక జాతుల జీవన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మనం భారతదేశాన్ని సుసంపన్నం చేయగలం. అనేక జాతులలో నిక్షిప్తమైయున్న జ్ఞానాన్నీ, విద్యనీ, సంస్కృతినీ మనం అర్థం చేసుకొనే క్రమం నుండే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ఎంతో విలువైన ఖనిజ సంపద వుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి. గిరిజనులు ఈ ప్రకృతి సంపద పట్ల ఎంతో అవగాహన కలిగి సంరక్షించుకుంటూ ఉంటారు. ఈనాడు భారతదేశం సంక్షోభంలో వుండటానికి కారణం గిరిజనుల జ్ఞాన సంపదను అర్థం చేసుకోలేకపోవడమే. గిరిజనులు రక్షిస్తున్న అటవీ సంపదను బట్టి వారి నీతినీ, నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ, రక్షణ స్వభావాన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. గిరిజనులే నిజమైన మాన వులు. వారు ప్రతి ఆకునూ ప్రేమిస్తారు. ప్రతి జంతువు స్వభావాన్నీ అధ్యయనం చేస్తారు. మాతృస్వామిక స్వభావం గలవారు. అందుకే శాస్త్రవేత్తలు లిఖిత భాషలోనే కాదు, అలిఖిత జాతులలో కూడా జ్ఞానం వుందని చెబుతున్నారు. అరిస్టాటిల్ ప్రకృతి గురించి చెప్తూ... శుద్ధద్రవ్యం మొదటగా నాలుగు మూల పదార్థాలు – మట్టి, నీరు, గాలి, అగ్నిగా మారుతుం దన్నాడు. ఇంతవరకు అరిస్టాటిల్‌కు పూర్వులైన గ్రీకులు కనిపెట్టినవే. కాని, అతడు అయిదవ మూల పదార్థం ఈథర్ కూడా ఉంటుందని ఊహించాడు. భారతీయ భౌతికవాదులు సాంఖ్యులు భూమి, నీరు గాలి, అగ్ని, శూన్యాలను కనిపెట్టారు. ఈ శూన్యంలో కూడా ఈథర్ అనే పదార్థం ఉంటుందని నేటి భౌతికవాదులు చెప్తున్నారు. అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. అన్ని వస్తువులు పంచ భూతాల నుండే ఏర్పడతాయి. పదార్థ జ్ఞానాన్ని ఆదిమ వాసులు విస్తృతంగా అర్థం చేసుకొన్నారు. దేన్నైనా జీవితావసరం మేర మాత్రమే వాడుకుంటారు. కాని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ స్వభావం వున్న వాళ్ళే వాటిని వ్యాపార దృక్పథంతో స్వార్థం కోసం ఉపయోగించు కొంటారు. భౌతిక తత్వశాస్త్రం మొత్తం ఆదిమ జాతుల నుండే వచ్చింది. సాంఖ్య దర్శన రూపకర్త కపిలుడు దళితుడే. దళితజాతులు ఆదిమ జాతులకి దగ్గరగా వుంటాయి. గిరిజనుల్లో చాలాకాలం ప్రజలకు లిపి తెలియదు కాని, వారికి మనకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా వుండేది. వారు పాతకాలపు అద్భుత గాథలను చెప్పేవారు. వారు పోయినా ఆ గాథలు మాత్రం పోలేదు. ఆనోటా ఆనోటా ఆ గాథలు మారుతూ వుంటాయి. వాటిలో కొత్త సంగతులు చేరుతుంటాయి. నీరు పారి పారి రాళ్ళు నునుపు దేరినట్టు ఆ గాథలు రాను రాను నయం గానూ, నాజూకు గానూ అవుతూ ఉంటాయి. పరాక్రమ వంతుడైన ఒకానొక కులపెద్ద కథ కాలక్రమాన నీటికీ, నిప్పుకూ, బాణానికీ, బళ్లేనికీ భయపడని వాడూ; సింహంలాగా అడవంతా పెత్తనం చెలాయించి డేగలాగ ఆకాశంలో ఎగిరిపోయేవాడూ అయిన ఏమాయా మానవుని వీరగాథ గానో మారుతుంది. గిరిజనులు, దళితులు ఇంకా ఇతర మౌఖిక ఉత్పత్తికారులు మన సంస్కృతీ వికాసానికి, తత్వానికీ మూల ప్రకృతులు. మన కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలే కాక, మన విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు, జ్ఞానులు, విద్యావంతులు మన మూల ప్రకృతులైన ఆదిమవాసులు, దళితులను అధ్యయనం చేయాలి. ఈ నేల పుత్రుల జీవన గాథలనూ, సాంస్కృతిక వికాసాన్నీ పునర్నిర్మించుకోవడానికి దళిత గిరిజన విశ్వ విద్యాలయాలను నిర్మించుకోవలసి వుంది. లిఖితేతర సమాజం వైపు నడపడమే నిజమైన శాస్త్ర దృష్టికి మూలం. ఆ వైపు నడుద్దాం. డా.కత్తి పద్మారావు, వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు ‘ 9849741695 -
కిడ్నాప్ చేసి వెబ్ సిరీస్ చూపించాడు
న్యూయార్క్ : అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న వర్ణ వివక్షపై అలెక్స్ హేలీ అనే రచయిత 'రూట్స్' అనే నవల రాశారు. ఆ నవలలో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించడాన్ని రచయిత వివరించారు. ఆ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేసే తీరు.. అమెరికాకు తీసుకొచ్చాక వారిపై సాగించే దురాగతాలను కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ అమెరికాలో ఎక్కడో ఒక చోట వర్ణ వివక్ష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో మాత్రం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రో అమెరికన్ రాబర్ట్ నోయెస్ (52) తనకు పరిచయం ఉన్న ఒక తెల్లజాతి మహిళను కిడ్నాప్ చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లిన రాబర్ట్.. విచిత్రమైన శిక్షను అమలు చేశాడు. అదేంటంటే.. ఏకధాటిగా 9 గంటలు 'రూట్స్' మినీ వెబ్ సిరీస్‌ను చూడాలని బలవంతం చేశాడు. అయితే సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను పట్టుకొని టీవీ ముందు నుంచి కదిలావంటే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తానని బెదిరించాడు. వర్ణ వివక్ష అనేది ఎంతలా ఉందనేది ఆమెకు అర్థమయ్యేందుకే రాబర్ట్ 'రూట్స్' సిరీస్ చూపించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాగా రాబర్ట్ నోయెస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ద 'రూట్స్' నవల 1977లో టీవీ సిరీస్‌గానూ రూపుదిద్దుకొంది. తన మూలాలను వెతుక్కుంటూ ఏడు తరాల బానిస గోసను హేలీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన రూట్స్ నవలను ఏడు తరాల ప్రస్థానంగా అభివర్ణించవచ్చు. -
హవాలాపై సీబీ‘ఐ’
నరసాపురం : విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం గురువారం నరసాపురంలో దాడులు జరిపింది. పట్టణంలో పేరుమోసిన బంగారం వ్యాపారి దుకాణం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చింది. వేకువజాము నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. దాడుల విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సీబీఐ డీఎస్పీ, మరో 9మంది సిబ్బంది వేకువజామునే నరసాపురం చేరుకుని, వాహనాలను గోదావరి గట్టు సమీపంలో పార్కింగ్ చేశారు. ఉదయం 5 గంటల సమయంలో కాలినడకన అతని ఇంటికి చేరుకున్నారు. కొందరు ఇంట్లో, మరికొందరు అతడి జ్యూయలరీ షాపులో సోదాలు చేశారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తర్వాత గాని ఇక్కడకు వచ్చింది సీబీఐ అధికారులన్న విషయం తెలియలేదు. హవాలా కేసులో భాగంగానే.. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన రూ.1,300 కోట్ల హవాలా కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగానే సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు తెలిసింది. హవాలా కేసుకు సంబంధించి వడ్డి మహేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను ఇటీవల విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్న సందర్భంగా వారిచి్చన సమాచారంతో నరసాపురంలో కూడా దాడులు చేసినట్టు సమాచారం. ఈ కేసులో రూ.650 కోట్ల మేర హవాలా లావాదేవీలు సాగి నట్టు ముందుగా విశాఖ పోలీసులు తేల్చారు. అయితే ఈ మొత్తం రూ.1,300 కోట్ల మేర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీబీసీఐడీ పర్యవేక్షిస్తున్న ఈ కుంభకోణం కేసు వ్యవహారం రూ.వందల కోట్లలో ఉండటంతో సీబీఐ అధి కారులు రంగప్రవేశం చేసినట్టు భావిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక వివరాలు సేకరించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారు, ఎవరెవరిని విచారించారనే విషయాలు వెల్లడించ లేదు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయల హవాలా కేసు వ్యవహారం విశాఖ నుంచి నరసాపురం చేరింది. సీబీఐ దాడులు పట్టణంలో సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా బులియన్ వ్యాపారులు హడలిపోయారు. -
సకాలంలో వైద్యం అందక
వేర్వేరు చోట్ల ఇద్దరు బాలింతలు, ఓ శిశువు మృతి ఆదోని టౌన్/ ఎమ్మిగనూరు రూరల్: మాతా, శిశు సంక్షేమం కోసం రూ. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాని ప్రభుత్వాలు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందక మహిళలు మృత్యువాత పడుతున్నారు. గురువారం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలింతలు, ఓ శిశువు మృత్యువాత పడ్డారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన శేఖర్, సావిత్రి దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో వరుసగా ఇద్దరు కుమార్తెలు. సావిత్రి మళ్లీ గర్భిణి కావడంతో ప్రసవం కోసం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ పండంటి మగ బిడ్డకు జన్మనించింది. కాన్పు సమయంలో ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఆదోనికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. శిశువు కూడా అపస్మారక స్థితికి చేరుకోవడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకనే తన భార్య, కుమారుడు మృతి చెందాడని శేఖర్ కన్నీరుమున్నీరుగా రోదించాడు. -
సరికొత్త బాటలు
ప్రజా, వాణిజ్య రవాణాకు తిరుగులేని దారులు మారుమూల నుంచి కీలక స్థాయికి ‘గూడెం’ జిల్లా కొత్తగా మరో రెండు జాతీయ రహదారులు కొత్తగూడెం–కొవ్వూరు రైల్వేలైన్ వస్తే వేగంగా అభివృద్ధి జలరవాణాతో భద్రాచలానికి డ్రైపోర్టు అవకాశం మణుగూరు : కొత్తగూడెం.. ఇప్పటివరకు సింగరేణి ప్రధాన కేంద్రంగానే సుపరిచితం. జిల్లాల పునర్విభజనతో కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మొత్తానికే కొత్త హంగులు సమకూరనున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా ముందంజలో ఉన్న కొత్తగూడెం, ఈ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు మరింత ముందుకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేనివిధంగా కొత్తగూడెం జిల్లాకు వాయు, జల, రోడ్డు, రైల్వే రవాణా వసతులు సమకూరనున్నాయి. –హైదరాబాద్ తరువాత వాయురవాణాకు కీలకం రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కేంద్రప్రభుత్వం కొత్తగూడేనికి విమానాశ్రయం మంజూరు చేయడం విశేషం. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి నగరాలు శంషాబాద్ విమానాశ్రయానికి 200 కిలోమీటర్ల లోపు ఉండడంతో జీఎంఎఆర్తో ఒప్పందం ప్రకారం వాటికి అనుమతులు ఇవ్వలేదు. 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంకు మాత్రమే షరతులు లేకుండా పౌరవిమానయానశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. సారపాక ఐటీసీ, అశ్వాç³#రం భారజల కర్మాగారం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి, పాల్వంచ కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ ఐరన్, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల, దక్షిణ అయోధ్య భద్రాచలం గుడికి రాకపోకలు సాగించేందుకు వాయుమార్గం ద్వారా మరింత సులువు కానుంది. మారుమూల జిల్లా కాస్తా కీలకంగా మారనుంది. కొత్తగూడెం విమానాశ్రయానికి గోదావరి దగ్గరలో ఉండటంతో ఈ ప్రాంతంలో జలరవాణాతో అనుసంధానం చేసి డ్రైపోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. –గోదావరి నదిపై జలరవాణా మార్గం ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జలరవాణాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండటంతో ఈ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 750 కి.మీ గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతమంతా బొగ్గునిల్వలు ఉండటం, మారుమూల గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడం, అక్కడ విమానాశ్రయం వస్తుండటంతో జలరవాణాతో అనుసంధానించి డ్రైపోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ జలరవాణా ఆలోచన నేపథ్యంలోనే మణుగూరు–పర్ణశాల మధ్య ప్రతిపాదించిన వంతెనను నావిగేషన్‌కు అనుకూలంగా డిజైన్ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. –జలరవాణాతో చౌకగా ఏటా 100 మిలియన్ టన్నుల రవాణా జలరవాణా అందుబాటులోకి వస్తే గోదావరి ద్వారా సంవత్సరానికి సుమారు 100 మిలియన్ టన్నుల సరుకును చౌకగా రవాణా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు రవాణాతో పోలిస్తే జలరవాణా చౌకగా ఉంటుందని.. దీన్ని ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వం యత్నిస్తోంది. రాష్ట్రంలో గోదావరి పొడవునా శ్రీరాంసాగర్ దిగువన ‘సోన్’ నుంచి భద్రాచలం వరకు 30 వరకు చిన్న చిన్న బ్యారేజీలు ‘స్టెప్‌లేడర్ టెక్నాలజీ’ ద్వారా నిర్మిస్తే రాష్ట్రంలో నది పొడవునా ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉంటాయని రిటైర్డ్ ఇంజినీర్ టి.హనుమంతరావు ప్రత్యేక ప్లాన్ రూపొందించారు. ఈ విధానం అమలు చేసి బ్యారేజీలు నిర్మిస్తే 450 టీఎంసీల నీటిని వినియోగించుకుని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, 300 టీఎంసీల లైవ్ స్టోరేజీకి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నివేదికలో తెలిపారు. బ్యారేజీల నుంచి నావిగేషన్ కెనాల్స్ నిర్మించుకుంటే సులువైన రవాణాకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే దుమ్ముగూడెం వద్ద 170 ఏళ్ల కిందట కాటన్ దొర నిర్మించిన నావిగేషన్ కెనాల్ ఉంది. ఆ రోజుల్లోనే గోదావరి ద్వారా జలరవాణా చేయడం విశేషం. –జిల్లాలో డ్రైపోర్టులకు అవకాశం తెలంగాణలో సముద్రం తీరం లేనందున రాష్ట్రంలో తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బంకింగ్‌హామ్ కాలువను అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. చైన్నై వరకు జలరవాణాకు అవకాశం ఉంటుంది. దీనివల్ల బొగ్గు, ఐటీసీ పేపర్, అటవీ ఉత్పత్తులు, ముగిసరుకులు తేలికగా రవాణా చేయవచ్చు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, సారపాక ప్రాంతాల్లో సింగరేణి, కేటీపీఎస్, భారజల ప్లాంట్, నవభారత్, స్పాంజ్ఐరన్, భద్రాద్రి మినరల్స్, ఐటీసీతో పాటు మణుగూరులో కొత్తగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మిస్తుండటంతో పాటు కొత్తగూడెంలో విమానాశ్రయం రానుండటంతో మరిన్ని ఉపయోగాలు కలుగుతాయి. –రైలు రవాణా మరింత పెరిగే అవకాశం కొత్తగూడెంతో పాటు మణుగూరు వరకు రైల్వే లైను ఉండడంతో ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు ప్రజారవాణాతో పాటు సింగరేణి బొగ్గు రవాణా అవుతోంది. ఒక్క మణుగూరు నుంచే బొగ్గు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు సంవత్సరానికి రూ.100కోట్ల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో రైల్వే సేవలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వాయురవాణా, జలరవాణా అందుబాటులోకి వస్తే గూడ్స్ రవాణా కోసం అనేక ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న కొత్తగూడెం–కొవ్వూరు, మణుగూరు–రామగుండం, పాండురంగాపురం–సారపాక రైల్వే లైన్లు సాకారం అయ్యే అవకాశం ఉంది. –పెరగనున్న జాతీయ రహదారులు కొత్తగూడెం జిల్లాలో జాతీయ రహదారులు మరింత విస్తరించనున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట, ఖమ్మం మీదుగా భద్రాచలం వరకు ఉన్న 320 కి.మీ జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ను కలుపనుంది. దీనికి అనుసంధానంగా హైదరాబాద్ నుంచి మరో కొత్త జిల్లా మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు 264 కి.మీ రహదారికి అవకాశం ఏర్పడింది. ఇక వరంగల్, హన్మకొండ మీదుగా భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మీదుగా జిల్లాలోని వాజేడు ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు రహదారి కలుపనుంది. ఇక కొత్తగా బూర్గంపాడు మండలం సారపాక నుంచి ఏటూరునాగారం వరకు 107 కి.మీ జాతీయ రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో పాటు సర్వే కూడా ప్రారంభించింది. –ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇప్పటికే మరిన్ని జాతీయ రహదారులు, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో కొత్త ఊపు వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటు అవుతుండటంతో జలరవాణా అందుబాటులోకి వస్తే అనేక కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. కొత్తగూడెం–కొవ్వూరు రైల్వేలైన్, మణుగూరు–రామగుండం రైల్వేలైన్ ఏర్పాటు చేస్తే జిల్లా మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. –పర్యాటకానికి కొత్త వెలుగులు విమానాశ్రయంతో పాటు గోదావరిపై జలరవాణా ప్రారంభమైతే రాష్ట్రంలో పర్యాటకం మరింత ఊపందుకుంటుంది. భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు గోదావరి సమీపంలోని పర్ణశాల, వరంగల్ జిల్లా మల్లూరు, మేడారం, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ధర్మపురి, ఆదిలాబాద్ జిల్లా బాసరతో పాటు పారిశ్రామిక, అటవీ టూరిజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -
యంగ్ ‘రూట్స్’..
-
ప్లీజ్.. నాపై సానుభూతి వద్దు..
తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది. రెస్య్యూ హోమ్ నుంచి విడుదలైన తర్వాత తాను మానసికంగా మరింత బలపడ్డానని తెలిపింది. కాగా వివాదాల్లో చిక్కుకున్న శ్వేత... ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 'రూట్స్' అనే ఓ క్లాసికల్ మ్యూజిక్కు సంబంధించిన డాక్యుమెంటరిపై పని చేస్తున్నానని చెబుతున్న శ్వేతబసును ఓ ప్రయివేట్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. *నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది. ఏం జరిగింది ... ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్ని అయినా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. *ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ... అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే... ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను. *ప్రతీ ఒక్కరు నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి. నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిది కాదని... అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కాని నాకు అదో ఎక్స్పీరియన్స్... నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు. *సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు. *ఇప్పుడు హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్ కాలేదు. హన్సిల్ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా... నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను. *నసీరుద్దిన్ షా నాకు ఓ సారి మెసేజ్ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్ పని చేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట. నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను. *రూట్స్ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు. *స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నాపై ఏడిచే వారిపై జాలిపడతాను.