జాతీయస్థాయి రోప్స్కిప్పింగ్కు గిరిజన విద్యార్థి
రంపచోడవరం :
జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీలకు ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శారపు దుర్గా వెంకట గణేష్దొర అర్హత సాధించాడు. నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జరిగే రోప్స్కిప్పింగ్ పోటీల్లో ఏపీ జట్టు తరఫున పాల్గొంటాడని పీడీ కె.తిరుపతిరావు శుక్రవారం తెలిపారు. గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి రోప్స్కిప్పింగ్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న అతడు విశేష ప్రతిభ కనపరచి ఈ అవకాశం దక్కించుకున్నాడన్నారు. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు ఏపీ రోప్స్కిప్పింగ్ జట్టుకు నారాయణపురంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారని, అందులో గణేష్దొర పాల్గొంటాడన్నారు. గణేష్దొర జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల డీడీ ఎం. సరస్వతి, పాఠశాల హెచ్ఎం డి. శ్రీనువాస్, వార్డె¯ŒS చోడి సత్యనారాయణ, పీఈటీ డి. శశికాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.