royal enfield byke
-
క్లాసిక్ లుక్‌లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 650 (ఫొటోలు)
-
ఫ్లై ఓవర్ పై.. అదుపుతప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్ రెయిలింగ్‌ను ఢీ కొట్టి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్(24) శ్రీరాంనగర్‌లో ఉంటూ డ్రైవింగ్ యాప్‌లో రైడర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్‌కు తెలియకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్ ఎగిరి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి పల్లెలోనూ రాయల్ ఎన్ఫీల్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగ్గట్టే హుందా ఉట్టిపడే ఈ మిడ్ సెగ్మెంట్ బైక్స్‌కు ఇప్పుడు దేశంలో ప్రతీ పల్లెలోనూ కస్టమర్ ఉన్నారు. భారత్‌లో ఏటా కంపెనీ సుమారు 6,00,000 వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో 60 శాతం యూనిట్లు ప్రధాన నగరాల్లో అమ్ముడవుతుండగా మిగిలిన 40 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదార్లకు చేరుతున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా, సార్క్ బిజినెస్ హెడ్ వి.జయప్రదీప్ తెలిపారు. 75 శాతం విక్రయ కేంద్రాలు మెట్రోయేతర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతం ఉందని వివరించారు. హైదరాబాద్ మార్కెట్లో హంటర్ 350 బైక్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. స్టూడియో ఫార్మాట్లో.. సంస్థకు దేశంలో 2,150 విక్రయశాలలు ఉన్నాయని జయప్రదీప్ వెల్లడించారు. ‘ఇందులో పట్టణాలు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లను దృష్టిలో పెట్టుకుని స్టూడియో ఫార్మాట్లో సగం స్టోర్లను తెరిచాం. 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. మూడేళ్లలోనే స్టూడియోల సంఖ్య 1,075కు చేరుకుందంటే మెట్రోయేతర ప్రాంతాల్లో బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. అమ్మకాల వృద్ధి 50 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో ఇది ఏకంగా 60 శాతం ఉంది. ఎనిమిది మోడళ్లలో నాలుగు 350 సీసీ సామర్థ్యం గలవి. విక్రయాల్లో 350 సీసీ మోడళ్ల వాటా అత్యధికంగా 80 శాతం ఉంది. 250–750 సీసీ మిడ్ సెగ్మెంట్లో దేశంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు 60,000 బైక్స్ అమ్ముడవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్కు 85 శాతం వాటా ఉంది’ అని ఆయన వివరించారు. నెలకు రూ.4,999లతో.. హంటర్‌ను 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ జె-సిరీస్ ఇంజన్‌తో రూపొందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ప్రీమియం డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరిచారు. బరువు 181 కిలోలు. వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1,49,900 నుంచి ప్రారంభం. 8రంగుల్లో లభిస్తుంది. నెల వాయిదా రూ.4,999లతో హంటర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య 55% ఉంది. -
బంపర్ ఆఫర్.. కొత్త ఉద్యోగులకు బిఎమ్‌డబ్ల్యూ బైక్స్, ఆపిల్ ఐప్యాడ్స్
దేశంలోని కంపెనీలు వారి వ్యాపారాన్ని విస్తరించడం కోసం కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. అధిక జీతంతో పాటు ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు టెక్ కంపెనీలు మంచి ప్రతిభ కనబరిచిన పాత ఉద్యోగులకు బోనస్, స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తుంటాయి. కానీ, ఒక టెక్ కంపెనీ మాత్రం విచిత్రంగా కొత్తగా ఉద్యోగంలో చేరేబోయే వారికి కూడా విలువైన బహుమతులను అందిస్తుంది. భారత్ పే ఫిన్‌టెక్ సంస్థ "టెకీల"ను ఆకర్షించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. స్టార్టప్ ఉద్యోగాలు చేపట్టాలని చూస్తున్న ఉద్యోగులకు జాయినింగ్ అండ్ రిఫెరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. భారత్ పే "బైక్ ప్యాకేజీ" ప్రణాళికలో భాగంగా అనేక రకాల ప్రీమియం బైక్‌లను అందిస్తోంది. అంతేగాకుండా బైక్‌లను ఇష్టపడని వారికి టెక్నాలజి పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం "గాడ్జెట్ ప్యాకేజీ" పథకం కూడా ఉంది. ఉద్యోగంలో చేరిన ఉద్యోగి ఏదైనా ప్యాకేజీని ఎంచుకోవచ్చు. భారత్ పే వ్యవస్థాపకుడు సీఈఓ అష్నీర్ గ్రోవర్ లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. "ఇది నిజం, ఇక్కడ ఉంది, ఇది మీ కోసమే. టెక్ బృందంలో చేరిన మా కొత్త జాయినర్‌లకు మొదటి బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు బయలుదేరుతున్నాయి. అలాగే, మేము ఇప్పుడు బైక్ & గాడ్జెట్ ప్యాకేజీని ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం విస్తరించామని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది" అని పోస్టు చేశారు. భారత్ పే తన రెఫరల్ & జాయినింగ్ పాలసీలో భాగంగా ఈ ఆఫర్స్ ప్రకటించింది. వంద మంది కొత్త జాయినీల కోసం బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, ఎయిర్‌పాడ్స్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్, ఇతర అనేక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న ఉద్యోగులుసంతోషంగా ఉన్నారని కంపెనీ నిర్ధారించింది. టెక్ బృందంలో కొత్తగా చేరిన వారికి సంస్థ రెండు వేర్వేరు ప్యాకేజీలను అందిస్తోంది. అలాగే, ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రెండు బృందాలలో కొత్తగా చేరిన వారందరికీ బైక్ ప్యాకేజీ లేదా గాడ్జెట్ ప్యాకేజీలో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా ఐసీసీ టి20 మ్యాచ్ బైక్ ప్యాకేజీలో 5 సూపర్ బైక్‌లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, కెటిఎం ఆర్సి 390, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. గాడ్జెట్ ప్యాకేజీలో ఆపిల్ ఐప్యాడ్ ప్రో(పెన్సిల్‌తో), బోస్ హెడ్‌ఫోన్, హర్మాన్ కార్డాన్ స్పీకర్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్, డబ్ల్యూఎఫ్‌హెచ్ డెస్క్ & కుర్చీ, ఫైర్ఫాక్స్ టైఫూన్ 27.5 డీ సైకిల్ ఉన్నాయి. ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశ మొత్తం టెక్ టీంకి దుబాయ్‌లో అక్టోబర్ 17 నుండి 2021 నవంబర్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. టెక్ టీం సభ్యులకు ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది. -
చెక్క తుపాకీతో చక్కర్లు!
సాక్షి, శ్రీకాకుళం సిటీ : జిల్లా కేంద్రంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఫాజుల్‌బాగ్‌పేటకు చెందిన ఓ రౌడీషీటర్ రాయల్ ఎన్ఫీల్డ్ బండిపై చెక్కతుపాకీగా పేర్కొంటున్న గన్ను తగిలించుకుని చక్కర్లు కొట్టడం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సంఘటనను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. గతంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి హయాంలో కుక్కిన పేనులా ఉన్న వీరంతా ప్రస్తుతం పాత పద్ధతిలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో 300 మందికిపైగా రౌడీషీటర్లు జిల్లా వ్యాప్తంగా 300 పైబడి రౌడీషీటర్లు ఉన్నారు. వీరంతా వారానికోసారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేయాల్సి ఉంటుంది. జిల్లా దాటి ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. కానీ పోలీస్ రికార్డుల్లో నమోదైన రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడం వల్ల మూడు సెటిల్మెంట్లు, ఆరు దందాలు అన్న చందంగా మారింది. బ్రహ్మారెడ్డి ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషిచేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు లేకపోవడంతో రౌడీషీటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేపట్టాం ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన రౌడీషీటర్ చెక్కతుపాకీతో నగరంలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం అందడంతో అతనిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించాం. మందలించాం. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చేస్తాం. సంఘటనను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ఎం.తిరుపతి, రెండోపట్టణ సీఐ, శ్రీకాకుళం -
ఎన్ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి
వెంకటేష్ హీరోగా నటిస్తున్న గురు సినిమా షూటింగ్ విశాఖ జిల్లా భీమిలిలో జరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డు బైకు మీద వెంకటేష్ వెళ్తున్న దృశ్యాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని బోయివీధి సమీపంలో చిత్రీకరించారు. రుతికాసింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కొంగర సుధ, నిర్మాత యశ్వంత్. కాగా ఎవరికీ తెలియకుండా వచ్చి గంటలోపే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించుకుని వెళ్లి పోవడంతో షూటింగ్ జరిగిన విషయం ఈ ప్రాంత ప్రజలకు కూడా పెద్దగా తెలియలేదు.