Royal Enfield Himalayan bike
-
పాపులర్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?
అతి తక్కువ కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5,000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం, శీతాకాలంలో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు బైక్ బ్రేక్ పనితీరు తగ్గిస్తుంది, లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని నివేదించింది. కంపెనీ 2017 - 2021 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైకులు దీనికి ప్రభావయుతమయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్లను రీప్లేస్ చేస్తారు. 2021 తర్వాత విడుదలైన బైకులు ఈ సమస్యకు ప్రభవితమయ్యే అవకాశం లేదు. గతంలో కూడా హిమాలయన్కు రీకాల్ ప్రకటించారు. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో రీకాల్ ప్రకటించారు. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో రీకాల్ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటివరకు భారతదేశంలోని బైకులలో ఎటువంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం. -
2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ : ధర ఎంత?
సాక్షి, ముంబై: కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 2021 బైక్ వచ్చేసింది. కొత్తరంగులు, కొత్త డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేలా 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిమాతయన్ బైక్‌ను అప్డేట్ చేసింది. ఈ అడ్వెంచర్ బైక్ ధరలు 2.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫాంపై ఆధారి ట్రిప్పర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా అనేక అప్డేట్స్ను జోడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు దీన్ని జత చేయవచ్చు. ఈ బైక్‌లో అప్డేటెడ్ సీట్, రియర్ క్యారియర్, ఫ్రంట్ ర్యాక్ కొత్త విండ్‌స్క్రీన్ కూడా అమర్చింది. అయితే ఈ బైక్ మునుపటిలాగే అదే సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 24.3 బిహెచ్పి, 32 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్, ముందు వెనుక భాగంలో వరుసగా 300 మిమీ 240 మిమీ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అమర్చింది. లేదంటే వెనుక చక్రం కోసం ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేయవచ్చు. అలాగే లగేజ్ కోసం ఈసారి ఎక్కువ స్థలం ఉండేలా జాగ్రత్త పడింది. కావాలంటే దీన్ని నచ్చిన విధంగా డిజైన్ కస్టమైజ్ చేయించు కోవచ్చు. గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ పైన్ గ్రీన్ అనే మూడు కొత్త రంగుల్లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ లభిస్తుంది. 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధరలు మిరాజ్ సిల్వర్: రూ. 236286 గ్రావెల్ గ్రే: రూ. 236286 లేక్ బ్లూ: రూ. 240285 రాక్ రెడ్: రూ. 240285 గ్రానైట్ బ్లాక్: రూ. 240285 పైన్ గ్రీన్: రూ. 244284 -
మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్
ప్రత్యేకతలు... 5 గేర్లు ఉండే ఈ బైక్‌లో 24.5 బీహెచ్పీ పవర్‌ను ఇచ్చే ఇంజిన్, 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 21 అంగుశాల ముందు, 17 అంగుళాల వెనక టైర్లు, ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, సెమీ డిజిటల్, సెమి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కంపాస్, గేర్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ హిమాలయన్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 411 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న ఈ బైక్ ధర రూ.1.55 లక్షలు(ఎక్స్ షోరూమ్, మహారాష్ట్ర) గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. ఐషర్ మోటార్స్ టూవీలర్ల విభాగమైన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, కాంటినెంటల్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ హిమాలయన్ బైక్‌తో అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌ను సృష్టించామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ సిద్ధార్థ లాల్ చెప్పారు. భారత్‌లో అడ్వెంచర్ టూరింగ్‌ను ఈ హిమాలయన్ బైక్ తిరగరాస్తుందన్నారు. తాము అభివృద్ధి చేస్తున్న రెండు కొత్త ఇంజిన్ ప్లాట్‌ఫార్మ్‌లపై రూపొందించిన తొలి మోడల్ ఇదని వివరించారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లపై భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను తెస్తామని చెప్పారు. వీటి ఇంజిన్ కెపాసిటీ 250-750 సీసీ రేంజ్లో ఉంటుందని తెలిపారు.