రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేల కోట్లు
ముంబై: భారతీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేలకోట్లకు పైగా సమకూర్చుకోనుంది. మూలధన సమీకరణకు నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈమేరకు సమ్మతించిందని ఎస్బీఐ బీఎస్సీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ఆధారంగా రుణ సెక్యూరిటీలను సమీకరించుకోనుంది. ఎడిషనల్ టైర్ 1(ఏటీ1) మూలధనం కోసం బాసెల్-III కంప్లైంట్ డెట్ ఇన్ స్ట్రుమెంట్స్ పెంచనున్నట్టు పేర్కొంది.
బుధవారం జరిగిన డైరెక్టర్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. విదేశీ లేదా భారతీయ పెట్టుబడిదారులను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అంగీకరించినట్టు పేర్కొంది. దీంతో ఎస్ బీఐ షేర్ ధర 0.08 శాతం లాభపడి రూ 254,80 వద్ద ఉంది.