కారులో గంజాయి స్వాధీనం
బైక్ను ఢీకొనడంతో వెలుగుచూసిన వైనం l
రూ.15 లక్షల విలువైన 200 కిలోల సరుకు స్వాధీనం
రావులపాలెం :
జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు.. ఓ మోటార్ బైక్ను ఢీకొనడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సుమారు రూ.15 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సోమవారం రావులపాలెం పోలీసు స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్ ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి ప్యాకెట్లతో కారు రాజమహేంద్రవరం వైపు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపు జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తోంది. ఈతకోట సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ బైక్ను ఢీకొనగా, అదే గ్రామానికి చెందిన వెలిగట్ల రామకృష్ణ గాయపడ్డాడు. కారు ముందు చక్రం ఊడిపోవడంతో, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చక్రం బిగించుకునే పనిలో పడ్డారు. అక్కడ గుమిగూడిన స్థానికులను చూసి వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రావులపాలెం ఎస్సై త్రినాథ్ అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు. కారును పరిశీలించగా, డిక్కీలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. కారును పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. సోమవారం ఉదయం తహసీల్దార్ సీహెచ్ ఉదయభాస్కర్ సమక్షంలో కారు డిక్కీ, వెనుక సీటులో ఉన్న గంజాయి ప్యాకెట్లను వెలికితీశారు. రెండు కిలోల వంతున మొత్తం 104 బ్యాగులున్నట్టు గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలుంటుందని అంచనా వేశారు. గంజాయితో పాటు రూ.70 వేల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం గుడికి వెళ్లినట్టు రసీదు, మెడికల్ బిల్లు ఉన్నాయి. కారులో ఏపీ రిజిస్ట్రేష¯ŒS, తమిళనాడు రిజిస్ట్రేష¯ŒSతో రెండు వైపులా ముద్రించిన నంబరు ప్లేటు దొరికింది. కారు రికార్డు ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సతీష్, ఇతర సిబ్బందిని అభినందించారు.