ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.
ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు
దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.