కలర్‌ ప్రింటర్‌తో రూ.రెండు లక్షల కొత్త నోట్లు | Fake notes in new Rs 2000 denomination worth Rs 2 lakhs seized, two arrested in madya pradesh | Sakshi
Sakshi News home page

కలర్‌ ప్రింటర్‌తో రూ.రెండు లక్షల కొత్త నోట్లు

Published Thu, Dec 22 2016 11:56 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

కలర్‌ ప్రింటర్‌తో రూ.రెండు లక్షల కొత్త నోట్లు - Sakshi

కలర్‌ ప్రింటర్‌తో రూ.రెండు లక్షల కొత్త నోట్లు

మధ్యప్రదేశ్‌: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లు దేశంలో పెద్ద మొత్తంలోనే వెలుగు చూస్తున్నాయి. అది కూడా వెయ్యో రెండువేలో కాదు.. ఏకంగా లక్షల్లో. మధ్యప్రదేశ్‌లో పోలీసులు రూ.రెండు లక్షల దొంగనోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా రూ.2000 నోట్ల ఫేక్‌ కరెన్సీనే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ జిల్లా లవ్‌ కుశ్‌ నగర్‌లో ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, వారి వద్ద  నుంచి ఒక కలర్‌ ప్రింటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొంత సగం మేరకు ముద్రించిన డబ్బును కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. అంతకుముందు బెంగళూరులో కూడా దొంగనోట్లను ముద్రిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి 25 కొత్త నకిలీ రూ.2000 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement