Rs. 8 crores
-
తగ్గిన నయా జోష్..!
కడప కల్చరల్ : నయా జోష్ కాస్త తగ్గినట్లే కనిపించింది. పెద్దనోట్ల రద్దుతో మిగతా వ్యాపారాలపై కనిపించిన ప్రభావమే నూతన సంవత్సర వేడుకలపై కూడా పడింది. అయినా ప్రజలు మిగతా అన్ని అవసరాలను పక్కకు నెట్టి దాదాపు రూ. 8 కోట్ల ఖర్చుతో నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలికారు. విందులు, వినోదాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఈ ఒక్కరోజు ఆనందంగా గడిపితే ఈ సంవత్సరమంతా అలాగే గడిస్తుందన్న సెంటిమెంటుతో వీలైనంత వరకు ఆనందంగా గడిపేందుకే ప్రాధాన్యతనిచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం డిసెంబరు 31, జనవరి 1 తేదీలలో దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. గత సంవత్సరంలో రూ. 11 కోట్లకు పైగా వ్యాపారాలు జరగ్గా, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది. విందులు, వినోదాలలో యువత పాత్రే ఎక్కువగా ఉంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు విందులు, వినోదాలు జరిగాయి. ముఖ్యంగా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. ఈ సంవత్సరం రూ. 3.50 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని సమాచారం. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ప్యాకేజీలతో పార్టీలు ఏర్పాటు చేయడంతో సీటు కోసం వేచి ఉండాల్సిన స్థితి ఏర్పడింది. మాంసాహార పదార్థాల ధరలు 10 నుంచి 30 శాతం పెరిగినా డిమాండ్ బాగానే ఉండింది. విందులు, వినోదాల కోసమే రూ. 2 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు ప్యాకేజీ ఫుడ్ కోసం వచ్చిన వారితో కిటకిటలాడాయి. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ధరలు దాదాపు రెట్టింపు అయినా కేకులకు కూడా డిమాండ్ ఏర్పడింది. 99 శాతం కేకులు ఆదివారం మధ్యాహ్యానికి ఖర్చయ్యాయి. ఇక పూల బొకేలు, పండ్ల వ్యాపారాలు కూడా జోరుగానే సాగాయి. మొత్తంపై శని, ఆది వారాల్లో జిల్లాలో నూతన సంవత్సర వేడుకల కోసం దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. -
జిల్లాలో రూ. 8కోట్ల ఆస్తిపన్ను బకాయి
నిడమనూరు : జిల్లాలోని 31మండలాల్లో ఆస్తిపన్ను బకాయిలు 8 కోట్లు పేరుకుపోయాయని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయ న నిడమనూరుకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన పంచాయతీ సిబ్బం ది, గ్రామస్తులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయన్నారు. సిబ్బంది జీతభత్యాలకే పన్నుల వసూలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన నోట్లతో ఆస్తిపన్ను చెల్లించవచ్చని తెలి పారు. నిడమనూరులో డీపీఓ ప్రభాకరరెడ్డి స్వయం గా ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరోజే 45వేల రూపాయల ఆస్తిపన్ను వసూలైంది. ఆయన వెంట ఎంపీడీఓ ఇందిర, సర్పంచ్ ముత్తయ్య, కార్యదర్శి పద్మ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం
ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్ తుని : రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఆర్ఎం సి.రవికుమార్ తెలిపారు. తుని డిపోలో వివిధ విభాగాలను మంగళవారం పరిశీలించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) తగ్గడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకూ అన్ని డిపోలూ కలిపి రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం ఓఆర్ 65 శాతం ఉందన్నారు. కిలోమీటరుకు రూ.32 ఖర్చవుతుండగా, రూ.26 ఆదాయం వస్తోందన్నారు. నష్టాల భర్తీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాలకు రీజియన్ నుంచి రోజుకు 70 నుంచి వంద ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆయన వివరించారు. అలాగే పార్సిల్ సర్వీసు ద్వారా రూ.కోటి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టరు వై.చెల్లారావు ఉన్నారు.