రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాల పట్టివేత
గజపతినగరం, న్యూస్‌లైన్:నిషేధిత ఖైనీ,గుట్కాల వ్యాపారం చేస్తున్న గజ పతినగరంలోని అమృతస్వీట్ షాపు యజమాని సరుకును పోలీసులు గురువారం సీజ్ చేశారు. షాపు యజ మాని రాము విజయనగరంనుంచి సుమారు రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాలను తెస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో తమకు సంబంధంలేదని ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియపరచాలని పోలీసులు చెప్పడంతో విజయనగరానికి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావుకు స్థానికులు సమాచారం అందజేశారు. పట్టుబడిన గుట్కాలు, ఖైనీలను పోలీ సులు స్వాధీనం చేసుకుని పంచనామా జరిపిన తరువాతే తాము చర్యలు తీసుకోగలమని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఇలా ఈ రెండు శాఖల అధికారుల మధ్య సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నడించినప్పటికీ ఏ ఒక్క అధికారీ సంఘటనా స్థలానికి రాలేదు. వ్యాపారులకు అధికారుల మద్దతు ఉండడంతోనే ఈ అక్రమ వ్యాపారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోం దని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎస్ఐ టి.కామేశ్వరరావు అమృత షాపులో ఉన్న రెండు బస్తాల ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా తాను విజయనగరంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున గజపతినగరం రాలేనని స్థానిక పోలీసలు కేసు నమెదు చేసి పంచనామా జరిపిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోగలనన్నారు.