Rs.100
-
రూ.100 కోసం ఎంతపని చేశాడు..!
ఇల్లెందు: వంద రూపాయల అప్పు.. ఓ నిండు ప్రాణం బలైపోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని సంజయ్నగర్లో ఉన్న ఓ బెల్టుషాపు నిర్వాహకుడికి హమీద్(45) అనే వ్యక్తి వంద రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ అప్పు గురించి ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం బెల్టు షాపు నిర్వాహకుడి స్నేహితుడు ఒకరు.. హమీద్పై దాడిచేశాడు. బలంగా కొట్టడంతో హమీద్ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. సీఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. -
'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'
న్యూఢిల్లీ: రూ.100, రూ.50 నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం కొట్టిపారేసింది. రూ.100, రూ.50 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మరలా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు చెప్పింది. బ్యాంకుల్లోని బంగారం లాకర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఈ సందర్భంగా పేర్కొంది. రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పుకొచ్చిన కేంద్రం.. రంగు కోల్పోయినా నోటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. రూ.2వేల నోటులో ఎలాంటి చిప్ ను అమర్చలేదని చెప్పింది. ప్రజలకు తప్పుడు సమాచారం అందించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.