రూ.30,425 కోట్ల నిధులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్:14వ ఆర్థికసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం 30,425 కోట్ల రూపాయల నిధులను కోరింది. జూబ్లీహాలులో ఈరోజు14వ ఆర్థిక రంగ నిపుణుల సమావేశం జరిగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఏడు కీలక అంశాలపై ఆర్థికసంఘానికి ప్రభుత్వం ప్రతిపాదనలు
సమర్పించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్, ఆరోగ్యం, నగదు బదిలీ పథకం, నీటిపారుదల శాఖలపై ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, వాటిపై చేస్తున్న ఖర్చు, అందుకు కావాల్సిన నిధులు వంటి అంశాలను వివరించారు.
రోడ్ల నిర్వహణకు రూ.3వేల కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.2500 కోట్లు, షెడ్యూల్ ప్రాంతాల అభివృద్ధికి రూ.11,153 కోట్లు, ఆరోగ్య సదుపాయాలకు రూ.1420 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 2635 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్వాహణకు రూ.3వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు సర్పించారు.