ప్రకాశం: గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు తీసుకుని రూ.30 వేలు డ్రా చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఓ ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళకు ఒరిజినల్ ఏటీఎం కార్డుకు బదులు నకిలీ కార్డు ఇచ్చి పంపించాడు. ఇంటికి వెళ్లాక గమనించిన ఆ మహిళ తనకు న్యాయం చేయాలని సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ దుండగుని కోసం గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.