Duplicate card
-
నగదు డ్రా చేసి ఇస్తానని..
భువనగిరిఅర్బన్ : ఏటీఎంలకు నగదు డ్రా చేయడానికి వచ్చే వ్యక్తులను మోసగిస్తున్న వ్యక్తిని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. భువనగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ వెంకన్నగౌడ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సంపేట్లోని ప్రకాష్‌నగర్‌కు చెందిన తుమ్మల ఉదయ్‌కుమార్(మాజీ హోంగార్డు) కూలీ పని చేస్తున్నాడు. ఉదయ్‌కుమార్ ఏటీఎంల వద్ద కాపుకాస్తూ నగదు కోసం వచ్చేవారిని గమనిస్తుంటాడు. ఏటీఎంలపై అవగాహన లేనివారుంటే వారికి సహాయం చేస్తానని చెప్పి నగదు తీసి ఇస్తాడు. అనంతరం వారి ఒరిజినల్ ఏటీఎంను కాకుండా తన వద్ద అప్పటికే ఉన్న మరో డూప్లికేట్ కార్డు ఇస్తాడు. తాను తీసుకున్న ఒరిజినల్ ఏటీఎం కార్డులతో పెట్రోల్ బంకులు, నగదు ఇచ్చే చోటుకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. జనవరి 7న భువనగిరిలో కొమ్మిడి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నెల 4న భువనగిరి పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం వద్ద చోరీలకు పాల్పడుతున్నట్లు ఒపుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు, 2 ఏటీఎం కార్డులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు 2012 నుంచి ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో 11 కేసులు నమోదు నిందితుడిపై పలు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణంలో రూ. 2.65లక్షలు, వరంగల్ జిల్లాలోని దేవరుప్పలలో రూ.76,650లు, కాజీపేటలో రూ. 1.27 లక్షలు, వర్దన్నపేటలో రూ.50,000, మెదక్ జిల్లాలోని నర్సపూర్‌లో రెండు ఏటీఎంలలో రూ. 1,09,300, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్లో రూ.40,000, దుబ్బాకలో రూ. 74,500, మహబూబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో రూ.1,07,000, సిరిసిల్లలో రూ. 53000, కరీంనగర్ జిల్లా టౌన్–1లో రూ. 30,000, మొత్తం రూ. 9,32,450 నగదును అపహరించినట్లు సీఐ తెలిపాడు. ఏటీఎంల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వొద్దని సూచించారు. దొంగను పట్టుకున్న ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్‌ను సీఐ వెంకన్నగౌడ్ అభినందించారు. వీరికి రివార్డు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రూ.30 వేలు కొట్టేశాడు..
ప్రకాశం: గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు తీసుకుని రూ.30 వేలు డ్రా చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఓ ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళకు ఒరిజినల్ ఏటీఎం కార్డుకు బదులు నకిలీ కార్డు ఇచ్చి పంపించాడు. ఇంటికి వెళ్లాక గమనించిన ఆ మహిళ తనకు న్యాయం చేయాలని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ దుండగుని కోసం గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
‘స్మార్ట్’గా దోచేస్తారు!
క్లోనింగ్ బారిన పడితే మన ఖాతా ఖాళీ.. టెక్నాలజీ వినియోగంలో పైచేయి సాధిస్తున్న అక్రమార్కులు డూప్లికేట్ కార్డులతో డబ్బులు స్వాహా ఏటీఎం కేంద్రాల్లో పొంచి ఉన్న ముప్పు అప్రమత్తంగా ఉంటేనే అన్ని విధాలా మేలు డబ్బులు ఇంట్లో ఉంటే భద్రత ఉండదని ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాల్లో వేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాయి. ఖాతాలో డబ్బులు ఉండడంతో అవసరమైనప్పుడు ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే వెలుసుబాటుంది. అలా ఏటీఎం మనిషి నిత్య జీవితంలో ఓ భాగమైంది. ఇలా అందరు సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళ్తుంటే దొంగలు సైతం తామేమీ తక్కువా? అన్నట్టుగా మనకంటే ఓ అడుగు ముందుకేసి టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. మన ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తూ డబ్బులను ఎంచక్కా దోచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. - పంజగుట్ట ముంబైకి చెందిన ఏడుగురు స్నేహితులు. వీరిలో చదువు రాని వారితోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులూ ఉన్నారు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే కోరిక వీరిలో బలంగా నాటుకుంది. చోరీలే ఇందుకు సరైన మార్గమని భావించారు. ఎవరికీ అనుమానం రాకుండా ‘స్మార్ట్’గా దోచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నకిలీ డెబిట్ కార్డులను సృష్టించి ఏటీఎంల ద్వారా డబ్బులు కాజేసేందుకు పథకం రచించారు. గత ఆదివారం సాయంత్రం నగరంలోని రాజ్‌భవన్ రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సదరు నిందితులపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 32 కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డుల క్లోనింగ్ విధానం... ఇందుకోసం మ్యాగ్నటిక్ రిఫ్లికా ఆఫ్ ఏటీఎం కార్డ్ స్లాట్ అనే యంత్రాన్ని తయారు చేశారు. రిఫ్లికా అనేది తొడుగు. దీన్ని ఏటీఎం సెంటర్లో ఏటీఎం కార్డు లోనికి వెళ్లే చోట గమ్‌తో అతికిస్తారు. రిఫ్లికా అతికించే ముందే అందులో ఓ సాఫ్ట్వేర్ చిప్, అది పనిచేసేందుకు బ్యాటరీని అమరుస్తారు. సరిగ్గా మన ఏటీఎం పిన్ నంబర్ ఎంటర్‌చేసే కీ ప్యాడ్‌కు పైన ఓ పెన్‌డ్రైవ్, దానికి 16 జీబీ మెమోరి కార్డు, 8 మెగా పిక్సల్ సెల్ఫోన్లో వినియోగించే చిన్న కెమెరా ఏర్పాటు చేసి దాన్ని గమ్ స్టిక్‌తో అతికిస్తారు. రిఫ్లికాలో ఉన్న బ్యాటరీ సుమారు 6 గంటలు పనిచేస్తుంది. ఖాతాదారుడు వచ్చి తన కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టగానే రిఫ్లికాలో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా కార్డుపై ఉండే 18 అంకెలు అందులో ఫీడ్ అవుతాయి. ఖాతాదారుడు పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో పైన అమర్చిన కెమెరా షూట్ చేస్తుంది. ఆరు గంటల్లో ఆ ఏటీఎం సెంటర్‌కు ఎంతమంది వస్తే అంతమందికి చెందిన పూర్తి డేటా కెమెరా, రిఫ్లికాలో ఫీడ్ అవుతుంది. గోవాలో నకిలీ కార్డుల తయారీ.. రిఫ్లికా, కెమెరా ద్వారా సేకరించిన డేటాను గోవాకు తీసుకెళ్తారు. క్లోనింగ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి వాటిపై అవే నంబర్లు ముద్రిస్తారు. సదరు నంబర్‌కు ఉన్న పిన్ నంబర్‌ను కూడా ఓ పేపర్‌పై రాసి నకిలీ ఏటీఎంకు అంటిస్తారు. అలా ఒక్కోసారి సుమారు 70 నుంచి 100 వరకు నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేయిస్తారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తారు. ముంబై ముఠా నేరాల చిట్టా... 2012లో మొదటిసారి గోవాలో ఓ బ్యాంక్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి 70 నకి లీ ఏటీఎంలు తయారు చేయించారు. వాటిని గోవాతోపాటు హైదరాబాద్‌కు తీసుకొచ్చి నగరంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షలు డ్రా చేశారు. 2014 జనవరిలో నగరంలోని లైఫ్‌స్టైల్ భవనంలో ఉన్న ఓ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 60 నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి హైదరాబాద్‌లో సుమారు రూ.7 లక్షలు డ్రా చేశారు. 2014 మార్చిలో రాజ్‌భవన్ రోడ్డులోని ఎస్బీహెచ్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 100 కార్డులు తయారు చేసి ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.10 లక్షలు డ్రా చేశారు. తాజాగా గత ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పై వివరాలను వెల్లడించారు. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సూచనలు పాటించండి మరి... ఏటీఎం సెంటర్లలో అప్రమత్తంగా ఉండాలి. మిషన్ కీబోర్డుపైన ఏవైనా కెమెరాలు ఉన్నాయేమో ఓ సారి చూసుకోవాలి. ఠీపిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో జాగ్రత్త అవసరం. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలకు వెళ్లడమే కొంతవరకు బెటర్. ఠీసెక్యూరిటీ గార్డు ఉన్న సెంటర్‌కే వెళ్లాలి.