ఆసరా పింఛన్లకు రూ. 38.75 కోట్లు
హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు అయ్యే వ్యయం కోసం రూ.38.75 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చింది. బడ్జెట్ (2015-16) ప్రతిపాదనల్లో భాగంగా వివిధ పథకాల కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు గురువారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి.డి.అరుణ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.