బొగ్గుస్కాంలో రాఠీ స్టీల్‌పై కేసులు
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపు కేసులో ఢిల్లీకి చెందిన ఆర్ఎస్పిఎల్ (రాఠి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ) పై , చీటింగ్ కుట్ర కేసులు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశించింది. స్పెషల్ జడ్జ్ భరత్ పరాశర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కంపెనీ, కంపెనీ సీఈవో ఉదిత్ రాఠి, ఎండీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తదితరుల మీద చీటింగ్, కుట్ర కేసు నమోదు అయ్యాయి. కేసు తదుపరి విచారణను జూన్ 2 కు వాయిదా పడింది.
కాగా బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో రాఠి స్టీల్ అండ్ పవర్ ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యూవత్మాల్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్, వికాస్ మెటల్స్, గ్రేస్ ఇండస్ట్రీస్, గగన్ స్పాంజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జార్ఖండ్ ఇస్పాత్, గ్రీన్ ఇన్ఫ్రా, కవుల్ స్పాంజ్, పుష్ప్ స్టీల్, హిందాల్కో, బీఎల్ఏ ఇండస్ట్రీస్, కాస్ట్రాన్ టెక్నాలజీస్, కాస్ట్రాన్ మైనింగ్ కంపెనీలపై సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.