RSS activists
-
దేశ ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం
పేరు ప్రఖ్యాతులు కావాలని ఆరెస్సెస్ పాటుపడదనీ, సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడానికి కావాల్సిన శక్తియుక్తులను అందించడానికి వీలుగా వ్యక్తులను కలిపి పనిచేయించడమే ఆరెస్సెస్ లక్ష్యమనీ ఆ సంస్థ ప్రచార్ ప్రముఖ్ (మీడియా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్) సునీల్ అంబేకర్ అన్నారు. ఆయన ఇంగ్లీషులో రాసిన ‘ద ఆరెస్సెస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ద 21 సెంచరీ’ పుస్తకానికి తెలుగు అనువాదం ‘అరెస్సెస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ ఆవిష్కరణకు ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దేశంలో చాలామంది ఆకాంక్ష. యువతలో అది ఇంకా బలీయంగా ఉంది. నేను విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తున్న సమ యంలో దేశాభివృద్ధి గురించి యువత ప్రశ్నించేది. కాలక్రమంలో ప్రశ్న అడిగే తీరులో మార్పును గమనించాను. దేశ ప్రగతికి సంబం ధించి యువత నుంచి ప్రతికూల ప్రశ్నలు కాకుండా సానుకూల ప్రశ్నలు రావడం మొదలైంది. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అని విభిన్న కోణాల నుంచి వస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ యజ్ఞంలో భాగమైన సంఘ కార్యంలో(ఆరెస్సెస్ కార్యక్రమాల్లో) అందరికీ భాగస్వామ్యం ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ఆరెస్సెస్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, సంఘ పరిచయం లేని వ్యక్తులు కూడా ఆరెస్సెస్ తీరును అవగతం చేసుకోవడానికీ పుస్తకం రాయాలన్న ప్రతిపాదన నా వద్దకు వచ్చింది. దానికి అంగీకరించాను. ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి? 1. దేశం అభివృద్ధి చెందాలని సామాన్యులు కూడా బలంగా ఆకాంక్షిస్తున్నారు. బాధ్యత తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంఘం(ఆరెస్సెస్) విస్తరణకు సామాన్యుల త్యాగాలు, వారి విజయ గాథలే మూలాధారం. ఈ విషయాన్ని ప్రధానంగా చెప్ప దలుచుకున్నాను. సంఘ కార్యంలో అందరి భాగస్వా మ్యాన్ని అభిలషిస్తున్నాం. 2. ఈ దేశ సంస్కృతి, వారసత్వం, హిందుత్వం... మనం గర్వించాల్సిన అంశాలే తప్ప, న్యూనత చెందాల్సిన అంశాలు కాదు. సర్వమానవ హితానికి అవి అత్యంత రమణీయమైన అంశాలు. అయితే ఈ విషయాల పట్ల కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చెయ్యాలి. 3. ప్రజలంతా దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వర్త మానంలో దేశానికి ఉన్న శక్తి ఆధారంగా భవిష్యత్‌ను నిర్మించుకోవాలి. 4. హిందుత్వం అంటే అందరినీ కలి పేది. అందరి బాగు కోరుకోవడమే హిందుత్వం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపి ఉంచే ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లకు సమాధానం బయటి నుంచి లభించదు. మనకు మనమే పరిష్కారాలను అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం కూడా కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టడం కోసమే కాకుండా, స్వపాలన, స్వదేశీ, స్వభాష.. ఇలా ‘స్వ’(సొంత) సాధన లక్ష్యంగా సాగింది. ఇప్పుడు కూడా ‘స్వ’ ఆధారంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రతి నిర్ణయం స్వావలంబన సాధించే దిశగా ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చేయాలి. సంఘం (ఆరెస్సెస్) చెప్పేది ఇదే. ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు? స్వయం సేవకులకా, స్వయం సేవకులు కావాలనుకుంటున్న వారికా? అందరికీనా? అందరికీ ఉద్దేశించింది. ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవాలనుకొనే వారికి ఉపయుక్తం. స్వయం సేవక్‌లే కాదు, అందరూ చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఎలాంటి ఫీల్ కలిగినా ఫర్వాలేదు. ఆరెస్సెస్‌ను వ్యతిరేకించేవారైనా పుస్తకం చదవాలి. 2025 నాటికి ఆరెస్సెస్ ఏర్పాటై వందేళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆరెస్సెస్ పనితీరు, అంతర్గత వ్యవహారాల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వందేళ్ల తర్వాత అయినా ఆరెస్సెస్ అంతర్గత వ్యవహారాలు సామాన్యులకు తెలిసేలా పారదర్శకంగా పనిచేస్తుందా? ఆరెస్సెస్ ఏర్పాటయిన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే. సంఘం యాజమాన్య హక్కులు ఎవరి(వ్యక్తుల) సొంతం కాదు. ఆరెస్సెస్ యాజమాన్యం ప్రజలదే. ప్రజల భాషలో చెప్పాలంటే పబ్లిక్ కంపెనీ. భారతమాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్ పనిచేస్తారు. సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే ‘సంఘ’ లక్ష్యం. ఆరెస్సెస్‌ను బలోపేతం చేయడం కాదు... సమాజాన్ని, దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తుంది. అందుకే ఎవరైనా ఆరెస్సెస్‌లో పనిచేయడానికి ‘ఫిట్’ అవుతారు. మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్. సమాజానికి ఉప యోగపడే ఏ పని చేద్దామన్న ఆసక్తి ఉన్నా, ఏ రంగంలో చేయాలనుకున్నా ఆరెస్సెస్ తోడుగా నిలుస్తుంది. అరెస్సెస్ ప్రయాణం తెరిచిన పుస్త కమే... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ! ఇక మీద ఆరెస్సెస్ విస్తరణ మీద దృష్టి పెడతారా? సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారా? పేరు, ప్రఖ్యాతుల కోసం ‘ఆరెస్సెస్’ పని చేయడం లేదు. సిద్ధాంతం ఆధారంగా పనిచేసుకుంటూ ముందడుగు వేస్తుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను ‘నెట్ వర్కింగ్’ చేయడమే సంఘం పని. సామాన్యులను సాధికారత దిశగా నడిపించడానికి నెట్వర్కింగ్ చేస్తుంది. మరింత ఎక్కువ మందిని కలిపి పనిచేయించడం ద్వారా సాధికారత సాధించడమే తప్ప... అది ఆరెస్సెస్ విస్తరణ కాదు. రెండో అంశం, సిద్ధాంతం గురించి అడి గారు... అరెస్సెస్ సిద్ధాంతం చాలా సింపుల్. అందరూ గర్వపడే విధంగా దేశాన్ని తయారు చేయడం, హిందుత్వాన్ని చూసి గర్వ పడటం, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కోరుకోవడం... ఇది కేవలం ఆరెస్సెస్ లైన్ మాత్రమే కాదు... వేల సంవత్సరాలుగా ఈ దేశ అంతరాత్మ ఇదే. దేశానికి సేవ సేయడమే ఆరెస్సెస్ సిద్ధాంతం. యాంటీ–నేషనల్స్ అని పదాన్ని ఆరెస్సెస్ ఈ మధ్య ఎక్కువగా ఉప యోగిస్తోంది. మీ దృష్టిలో దీని నిర్వచనం ఏమిటి? స్వయం సేవక్‌లు నడిపే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు ‘యాంటీ–నేషనల్స్’ అనా? ఎంతమాత్రం కాదు. ప్రభుత్వాలను విమర్శించడం, వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. పార్లమెంట్‌లోనే విమర్శిస్తున్నారు కదా! వారిని యాంటీ–నేషనల్స్ అని ఎవరూ అనడం లేదు. ఆ పదంలోనే దాని అర్థం ఉంది, దేశానికి వ్యతిరేకం అని. దేశ హితాన్ని కాంక్షించని వారంతా యాంటీ–నేషనల్స్. ఇది ఆరెస్సెస్ సృష్టించిన పదం కాదు. చరిత్రను చూసే దృష్టికోణం మారాలంటున్నారు కదా! ఎందుకు మారాలి? దేశాన్ని చాలా శతాబ్దాల పాటు విదేశీయులు పాలించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్ర తయారయింది. వారి ప్రయో జనాల పరిరక్షణకు వీలుగా చరిత్రను రూపొందించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మహాపురుషులు, రుషులు, సమర్థ పాల కుల చరిత్ర మరుగున పడిపోయింది. మన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేశారు. ఒక కుటుంబ చరిత్ర, ఒక వంశ పాలన చరిత్ర కాదు. ఈ దేశ నిర్మాణంలో గ్రామీణులు, కొండకోనల్లో నివసించేవారు, పేదలు, ధనికులు, పాలకులు... అందరి పాత్రా ఉంది. దాన్ని విస్మరించారు. ఆర్యులు వెలుపలి నుంచి వచ్చారనే సిద్ధాంతం తప్పని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా చెప్పారు. విదేశీ దృష్టి కోణం మారాలి. మన దేశం దృష్టి కోణం నుంచి చరిత్రను చూడాలి. సరికొత్త కోణంలో చరిత్రను ఆవిష్కరించి ప్రజల ముందు ఉంచాలి. – ఎం. విశ్వనాథ రెడ్డి -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్‌లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్‌రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
'ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలుబొమ్మ కాదు'
మొరాదాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దేశంలో నైతికత, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందకు మాత్రమే పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మొరాదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా మొరాదాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా తాము పరిగణలోకి తీసుకోమని, గత 60 సంవత్సరాలుగా దేశ అత్యున్నత విలువలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కన్నా 130 కోట్ల మంది భారతీయుల నైతిక విలువలే తమకు ముఖ్యమని, వారికోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ చేతిలో ఆర్ఎస్ఎస్ ఒక కీలు బొమ్మ అంటూ వచ్చిన ఆరోపణలను భగవత్ ఖండించారు. 1925 లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడు చాలా కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే ప్రారంభమయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కాలక్రమంలో మా సంస్థ దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావంతో ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితమే ప్రసుత్తం దేశవ్యాప్తంగా 1.3 లక్షల సభ్యత్వాన్ని ఆర్ఎస్ఎస్ కలిగి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భగవత్ వెల్లడించారు. దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి మేధావులు, సామాజిక సంస్కర్తలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమ భావజాలంలో పుణికిపుచ్చుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని అన్నారు. రష్యా, చైనా, అమెరికా దేశాలు అభివృద్ధి పరంగా శక్తివంతమైన దేశాలుగా ముందుకు సాగుతున్నప్పటికి వాటి వల్ల ఇతర దేశాలకు కలుగుతున్న సమస్యలను చూస్తుంటే వారు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని వివరించారు. గంటపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ భగవత్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. -
అర్ధరాత్రి అరెస్టులు
శబరిమల/కోజికోడ్: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్ సోమవారం కేరళ వ్యాప్తం గా ఆందోళనలు నిర్వహించాయి. అయితే వారంతా శబరిమలలో అలజడి సృష్టించేందుకు వచ్చారన్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామనీ, నిజమైన భక్తులను ఇబ్బంది పెట్టలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అయ్యప్ప భక్తులెవరూ లేరనీ, వారంతా శబరిమలలో నిరసనలకు దిగి పరిస్థితిని దిగజార్చేందుకు వచ్చినవారేనని సీఎం పినరయి విజయన్ చెప్పారు. కోజికోడ్‌లో సీఎం మాట్లాడుతూ ‘వారెవరూ అయ్యప్ప భక్తులు కారు. అంతా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే. సమస్యలు సృష్టించేందుకే సన్నిధానం వద్దకు చేరుకున్నారు’ అని చెప్పారు. ఆలయం మూసివేశాక రాత్రి 11 గంటల తర్వాత కూడా వారంతా గుంపుగా చేరి అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ నిరసనలకు దిగడంతోనే పరిస్థితి మరింత దిగజారకుండా ముందస్తుగా 69 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నెయ్యాభిషేకం చేయించడం కోసం వచ్చి, రాత్రి అక్కడే ఉన్న భక్తులను తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ పోలీసుల చర్యను ఖండించింది. కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ సోమవారం నిలక్కళ్, పంబ, సన్నిధానం వద్ద పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని యుద్ధక్షేత్రంగా మార్చింది. భక్తులేమీ తీవ్రవాదులు కారు. యాత్రికులను బందిపోటు దొంగల్లా ఈ ప్రభుత్వం చూస్తోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు శబరిమలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకొని సన్నిధానం నుంచి పంపించేశారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీఎం ఇంటి ముందు ధర్నా అరెస్ట్‌లకు నిరసనగా ఆరెస్సెస్, బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థ యువ మోర్చాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు కోజికోడ్‌లో సీఎం కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని తిరువనంతపురంలో కొందరు కార్యకర్తలు సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా, మరికొందరు సీఎం అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టులో టీడీబీ పిటిషన్ అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ గుడి నిర్వహణను చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా ఇప్పటికే ఆలయ పరసరాల్లో వసతులు దెబ్బతిన్నాయనీ, సరైన సౌకర్యాలు లేనందున ఇప్పుడు యాత్రకు వస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీబీ పిటిషన్లో పేర్కొంది. రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న ఎత్తివేయడం తెలిసిందే. -
ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ ఆపండి
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ముస్లింలకు ఇవ్వనున్న ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందుకు మరో దెబ్బ తగిలింది. ఆరెస్సెస్ నాయకులే ఈ విందును అడ్డుకునే యత్నం చేస్తున్నారు. మలబార్‌హిల్స్‌లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందు ఏర్పాటు చేయనున్నసంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని ఆరెస్సెస్ ముస్లిం విభాగం (ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2015 జూలై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్‌లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలనీ, ఆరెస్సెస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లింలకు దగ్గరవుదామని ఆరెస్సెస్ భావిస్తోందనీ, ముస్లిం వ్యతిరేక చర్యలు ఆపనంత వరకు ఎలాంటి విందుల్లో పాల్గొనబోమని వివిధ ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం నాటి గ్రాండ్ ఇఫ్తార్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కాగా, ఆరెస్సెస్ ఇవ్వనున్న ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. -
దళితులపై దాడులను అరికట్టాలి
గజ్వేల్‌రూరల్: గోరక్షణ పేరుతో ఆర్ఎస్ఎస్ మతోన్మాద దాడులకు పాల్పడుతుందని, బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేవీపీఎస్(కుల వివక్ష పోరాట సమితి) రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పేర్కొన్నారు. ఆగస్టు 23న సంగారెడ్డిలో ప్రారంభమై సెప్టెంబర్ 11 వ తేదీ వరకు రాష్ట్రంలోని 10 జిల్లాల మీదుగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఆత్మగౌరవ ఉద్యమ యాత్ర’ బస్సుయాత్ర బుధవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ గోరక్షణ ముసుగులో ఆర్ఎస్ఎస్ దళితులపై మతోన్మాద దాడులకు పాల్పడుతుందని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత కుటుంబాలకు 3ఎకరాల భూమి, డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే అందించాలని, సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం, డివిజన్ అధ్యక్షులు ఆర్. శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జంగం నాగరాజు, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు అరవింద్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏగొండస్వామి, టీఎంఆర్పీఎస్ నాయకులు పొన్నాల కుమార్, మాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీను, అంబేద్కర్ సంఘం నాయకులు పొన్నాల శ్రీనివాస్, వర్గల్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి, ఎస్ఎఫ్ఐ నాయకులు అశ్రఫ్, సాయి, వెంకటేష్, అతీఫ్, అనిల్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ రగడ.. పోలీసులకు గాయాలు
కొల్లాం: కేరళలో శివరాత్రి సందర్భంగా సోమవారం అర్థరాత్రి అల్లర్లు చెలరేగాయి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్థానిక పోలీసులపై రెచ్చిపోయారు. సీఐ, ఎస్సై సహా అయిదురుగు పోలీసులపై భౌతిక దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శివరాత్రి సందర్భంగా ఊరేగింపుగా వస్తున్న ఆర్ఎస్ ఎస్ ప్రచారక్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆర్ఎస్ఎస్ నేతకు పోలీసులకు అతనికి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సదరునేతను అదుపులోకి తీసుకుని కొట్టార్కర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ నేత అనుచరులు కొంతమంది తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ దగ్గర బైఠాయించారు. పోలీసులు ప్రతిఘటించడంతో వారు మరింత రెచ్చిపోయారు. తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో స్టేషన్ పై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై తిరగబడి భౌతికంగా దాడికి పాల్పడ్డారు. దీంతో సీఐ, ఎస్సై సహా అయిదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు . దీంతో పాటుగా మూడు వాహనాలను ద్వంసం చేశారు.