ఆర్టీసీ బస్- మోపెడ్ ఢీ: ఒకరి మృతి
తిమ్మాపూర్: టవీఎస్ మోపెడ్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ముక్కెర వెంకటయ్యను సోమవారం మద్యాహ్నం కొత్తపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా కరీంనగర్ వైపునకు వేగంగా వెళుతోన్న బస్సు ఢీకొట్టిందని, గాయపడిన వెంటయ్యను ఆసుపత్రికి చేర్చేలోగా మృతిచెందాడని పోలీసులు చెప్పారు. వెంకటయ్య మరణంతో ఆయన స్వగ్రామం ముల్కనూర్ లో విషాదం నెలకొంది.