RTC EU leaders
-
ఆర్టీసిలో జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి : ఈయు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్న జోనల్ చైర్మన్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయు) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రవేశ్ ఆర్టీసీలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థను ప్రవేశ పెడితే ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టాలని, నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈయు నాయకులు కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. -
'జీతాలు క్యాష్ పేమెంట్ చేయాలి'
విజయవాడ : కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం వల్ల నవంబర్ నెల జీతాలు బ్యాంకుల ద్వారా కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపితే డబ్బు కోసం డ్యూటీలకు సెలవు పెట్టి ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్నారు. దీంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులకు క్యాష్ పేమెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఈయూ నాయకులు చెప్పారు. -
ఏపీలో ఫిట్మెంటు ఊసేలేదు
నేడు మరోసారి సమావేశం సాక్షి, హైదరాబాద్: ఐదురోజుల ఆర్టీసీ సమ్మెను కొలిక్కి తెచ్చేందుకు కార్మిక సంఘాలతో రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆదివారం సచివాలయంలో ఉపసంఘంలోని మంత్రులు యనమల రామకృష్ణుడు, శిద్దా రాఘవరావు, కె.అచ్చెన్నాయుడు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబు, ఆర్టీసీ ఎండీ ఎన్.సాం బశివరావులతో ఆర్టీసీ ఈయూ నేతలు పద్మాకర్, దామోదర్ సుమారు 2 గంటల పాటు చర్చలు జరి పారు. సమ్మెను తక్షణమే ఉపసంహరించి విధుల్లో చేరాలని, తమకు 3 వారాల గడువు కావాలని మంత్రివర్గం కోరింది. 43శాతం ఫిట్మెంటుపై ఇప్పుడే ప్రకటన చేసి, మరో 2 నెలల తర్వాత అమలు చేసినా వెంటనే సమ్మె విరమిస్తామని ఈయూ నేతలు తేల్చి చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ సమస్యల పరిష్కారం సాధ్యం కాదని మంత్రివర్గం పేర్కొంది. 2రోజుల తర్వాత నిర్ణయాన్ని చెబుతామని ఈయూ నేతలు తెలిపారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మరోసారి సమావేశమవుతామన్నారు. ఐదో రోజూ అదేస్థాయి సమ్మె! సాక్షి, గుంటూరు/అనంతపురం: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజు ఆదివారం భారీస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల వద్దా కార్మికులు స్వచ్ఛభారత్, రౌండ్ టేబుల్ వంటి కార్యక్రమాలు చేపట్టి వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. కార్మికుల సమ్మెకు ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలూ బాసటగా నిలిచాయి. అయితే, కార్మికులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పలు చోట్ల మద్దతిచ్చిన ప్రజా ప్రతినిధులను అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు గుంటూరులో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.