ఆర్టీసి ఈయు నాయకుడు కె.పద్మాకర్(ఫైల్)
సాక్షి, అమరావతి : ఆర్టీసీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్న జోనల్ చైర్మన్‌ల వ్యవస్థను రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయు) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రవేశ్ ఆర్టీసీలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థను ప్రవేశ పెడితే ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టాలని, నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈయు నాయకులు కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment