RTC labor union
-
ఆర్టీసీ కార్మిక నేతలతో మంత్రుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆదివారం మంత్రులు చర్చలకు శ్రీకారం చుట్టారు. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో చర్చించారు. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ యూనియన్ల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి యూనియన్ల మనుగడను పునరుద్ధరించాలని, గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక నేతలు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పరిశీలనకు కూడా సిద్ధం కాలేదు. చివరకు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దక్కలేదు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, డీఏ బకాయిలు, గత వేతన సవరణ బాండ్ల బకాయిలు, సకలజనుల సమ్మె కాలం బకాయిలు, ఇతర దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలన్న విషయంలోనూ నేరుగా మంత్రులు వారితో చర్చించలేదు. ఇంతకాలం తర్వాత ‘మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య’ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తున్న సమయంలో నేతలతో మంత్రుల చర్చించడం విశేషం. ముగ్గురు మంత్రులతో చర్చల్లో భాగంగా, కార్మిక నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వారికి సమర్పించారు. అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాక మూడు నాలుగు రోజుల్లో మరోసారి భేటీ అవుతామని కూడా వారు పేర్కొన్నట్టు చెబుతున్నారు. భేటీలో సమాఖ్య నేతలు రాజిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, కత్తులయాదయ్య, మోహన్‌రెడ్డి, కొవ్వూరు యాదయ్య, రామదాసు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలకైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఉన్నట్టు సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మంత్రులతో జరిగిన భేటీల్లో చర్చించిన విషయాలను నేతలు, ఆదివారం సాయంత్రం మునుగోడులో సమాఖ్య సభ్యులకు వివరించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో, ముందుగా ప్రకటించినట్టు సమాఖ్య పక్షాన ఉప ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని సభ్యులు స్పష్టం చేశారు. -
రేపే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు
- తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణకు సిద్ధం - ఓటుహక్కు వినియోగించుకోనున్న 49,600 మంది సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, కార్యాలయాలు, వర్క్‌షాపుల్లో పోలింగ్ జరగనుంది. 49,600 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. పది సంఘాలు పోటీలో నిలిచినా.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో టీఎంయూ -ఈయూ కలసి పోటీ చేసి సంయుక్త విజేతలుగా నిలిచాయి. ప్రస్తుతం అవి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కాగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య తాజా కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రతినెలా తమ వేతనం నుంచి కొంత మొత్తం కోత పెట్టుకుని పోగుచేసుకునే ‘కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ నిధులను, పదవీ విరమణ, కార్మికులు చనిపోతే అందే ఆర్థిక సాయం నిధులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో కార్మికులకు రుణా లు ఆగిపోయాయి. వాటిని తిరిగి జమకట్టేం దుకు ఆర్టీసీ వద్ద నిధుల్లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటంతో కార్మికుల కుటుంబా లు ప్రైవేటు అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయి. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం టీఎంయూ అధికార టీఆర్ఎస్తో సఖ్యతగా ఉంటోందన్న ప్రచారముంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ సమీక్షకు కేవలం ఆ సంఘం నేతలకే ప్రవేశం లభించటం గమనార్హం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ సంఘానికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ సంఘం గెలిస్తే కార్మికుల పక్షాన ప్రభుత్వంతో పోరాడలేదని మిగతా సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే... ఇతర సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు గెలుపు తమదేనని టీఎంయూ నేతలు విశ్వాసంతో ఉన్నారు. వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలలో బాండ్ల రద్దు, సర్వీసులో చనిపోయిన కార్మికులకు రికవరీ లేకుండా రూ.6 లక్షలు చెల్లింపు తదితర హామీలతో ఎన్ఎంయూ ధీమాగా ఉంది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, 44 శాతం ఫిట్మెంట్, గ్రేడ్ పే విధానం అమలు వంటివి తమ విజయాలేనని ఈయూ చెప్పుకొంటోంది. -
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల పోరు
* జూలై 19న ఎన్నికలు * ఆగస్ట్ 8న తుది ఫలితాలు * జిల్లాలో 4565 మంది ఓటర్లు హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల పోరు మొదలైంది. గురువారం హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మిక యూనియన్లతో కార్మిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. కార్మిక యూనియన్లకు గుర్తులు ఖరారు చేశా రు. జూలై 19న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 4,565 మంది ఓటర్లు ఉన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లు. గత గుర్తింపు సంఘం ఎన్నికల 2012 డిసెంబర్ 12న ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. కాలపరి మితి ముగిసిన రెండేళ్లకు జరగాల్సిన ఎన్నికలు పలు కా రణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన కావడం, ఏపీఎస్ ఆర్టీసీ విభజన సమస్య నెలకొనడం, ఉద్యోగులు, కార్మికుల విభజన వంటివి ఆటంకాలుగా మారాయి. ఆర్టీసీ విభజన స్పష్టం కావడంతో, కాల పరి మితి ముగిసిన 20 నెలల తర్వాత కార్మిక శాఖ తెలంగా ణలో తొలిసారి టీఎస్ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూలై 19న ఎన్నికలు జరగనున్నారుు. 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ స్వీకరిస్తారు. ఆగస్ట్ 8న కార్మిక శాఖ అధికారికంగా తుది ఫలితాలు ప్రకటిస్తుంది. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర గుర్తింపు కోసం క్లాస్-3కి, రీజియన్ గుర్తింపు కోసం క్లాస్-6కు ఓటు వేయాలి. ఊపందుకోనున్న ప్రచారం కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకోనుంది. ఇతర సంఘాల వైఫల్యాలు ఎత్తిచూపుతూ, సాధించిన విజయాలు వివరిస్తూ కార్మికులను ఆకట్టుకునే ఆలోచనలో సంఘాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అంతకుముందు గుర్తింపు సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ను ఓడించడానికి ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడిగా పోటీ చేశాయి. ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు సంఘం కోసం పోటీ పడగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజియన్ గుర్తింపు సంఘం కోసం పోటీ పడింది. 2012లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల కూటమి గుర్తింపు సంఘంగా విజయం సాధించాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న ఆ రోజుల్లో ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను బలంగా వినిపించాలని కార్మికులు ఈ యూనియన్ల కూటమికి నాడు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రెండు సంఘాల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ బలాన్ని విస్తరించుకుంది. ఈ యూనియన్‌కు ప్రత్యమ్నాయంగా ఇటీవల వామపక్ష కార్మిక సంఘాలైన ఎంప్లాయూస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌తోపాటు నేషనల్ మజ్దూర్ యూనియన్ మరికొన్ని సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇతర సంఘా లు జట్టు కట్టేందుకు ఆ సంఘాల నాయకులు చర్చిస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో, హన్మకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు. డిపోల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఆ డిపో కార్మికులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఆర్ఎం కార్యాలయం పోలింగ్ బూత్‌లో ఆ కార్యాలయ ఉద్యోగులతోపాటు, టైర్ రిట్రేడింగ్ సెంటర్ కార్మికులు ఓటు వేస్తారు.