* జూలై 19న ఎన్నికలు
* ఆగస్ట్ 8న తుది ఫలితాలు
* జిల్లాలో 4565 మంది ఓటర్లు
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల పోరు మొదలైంది. గురువారం హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మిక యూనియన్‌లతో కార్మిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. కార్మిక యూనియన్‌లకు గుర్తులు ఖరారు చేశా రు. జూలై 19న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 4,565 మంది ఓటర్లు ఉన్నారు.
గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లు. గత గుర్తింపు సంఘం ఎన్నికల 2012 డిసెంబర్ 12న ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. కాలపరి మితి ముగిసిన రెండేళ్లకు జరగాల్సిన ఎన్నికలు పలు కా రణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన కావడం, ఏపీఎస్ ఆర్టీసీ విభజన సమస్య నెలకొనడం, ఉద్యోగులు, కార్మికుల విభజన వంటివి ఆటంకాలుగా మారాయి. ఆర్టీసీ విభజన స్పష్టం కావడంతో, కాల పరి మితి ముగిసిన 20 నెలల తర్వాత కార్మిక శాఖ తెలంగా ణలో తొలిసారి టీఎస్‌ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది.
జూలై 19న ఎన్నికలు జరగనున్నారుు. 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ స్వీకరిస్తారు. ఆగస్ట్ 8న కార్మిక శాఖ అధికారికంగా తుది ఫలితాలు ప్రకటిస్తుంది. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర గుర్తింపు కోసం క్లాస్-3కి, రీజియన్ గుర్తింపు కోసం క్లాస్-6కు ఓటు వేయాలి.
ఊపందుకోనున్న ప్రచారం
కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకోనుంది. ఇతర సంఘాల వైఫల్యాలు ఎత్తిచూపుతూ, సాధించిన విజయాలు వివరిస్తూ కార్మికులను ఆకట్టుకునే ఆలోచనలో సంఘాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అంతకుముందు గుర్తింపు సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌ను ఓడించడానికి ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడిగా పోటీ చేశాయి.
ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు సంఘం కోసం పోటీ పడగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజియన్ గుర్తింపు సంఘం కోసం పోటీ పడింది. 2012లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ల కూటమి గుర్తింపు సంఘంగా విజయం సాధించాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న ఆ రోజుల్లో ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి.
రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను బలంగా వినిపించాలని కార్మికులు ఈ యూనియన్‌ల కూటమికి నాడు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రెండు సంఘాల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ బలాన్ని విస్తరించుకుంది. ఈ యూనియన్‌కు ప్రత్యమ్నాయంగా ఇటీవల వామపక్ష కార్మిక సంఘాలైన ఎంప్లాయూస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌తోపాటు నేషనల్ మజ్దూర్ యూనియన్ మరికొన్ని సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి.
ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇతర సంఘా లు జట్టు కట్టేందుకు ఆ సంఘాల నాయకులు చర్చిస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో, హన్మకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు. డిపోల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఆ డిపో కార్మికులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఆర్‌ఎం కార్యాలయం పోలింగ్ బూత్‌లో ఆ కార్యాలయ ఉద్యోగులతోపాటు, టైర్ రిట్రేడింగ్ సెంటర్ కార్మికులు ఓటు వేస్తారు.
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల పోరు
Published Fri, Jul 1 2016 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement
Advertisement