RTC union elections
-
‘ఆర్టీసీ’ ఎన్నికల పోరు నేడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆర్టీసీ యూనియన్ల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 5 గంటల నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోరుగా సాగిన ప్రచారంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు డిపోల స్థాయిలో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించి భారీగా హామీలను ఇచ్చారు. ఆర్టీసీలో ఐదు యూనియన్లకు కార్మిక శాఖ గుర్తింపు ఉంది. ఎన్నికల్లో తమ ప్యానల్‌ను గెలిపించేందుకు ఏ యూనియన్ సొంతగా ప్రయత్నాలు చేయలేదు. రాజకీయ పార్టీల అండతో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కాగడా గుర్తుపై నేషనల్ మజ్దూర్ యూనియన్, బస్సు గుర్తుపై ఎంప్లాయీస్ యూనియన్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. రీజియన్ స్థాయిలో ఎన్నికల కమిటీ ప్రధాన అధికారిగా డిప్యూటీ కమిషనర్ బి.ఏసుదాసును కార్మిక శాఖ నియమించింది. ఎన్నికల సహాయ అ«ధికారిగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకటనారాయణ వ్యవహరిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 12 పోలింగ్ బూత్‌లు జిల్లాలోని పది డిపోల్లో ఒక్కొక్కటి చొప్పున, నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో, పడుగుపాడు వర్క్‌షాపులో ఒకటి వంతున మొత్తం 12 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో 48 ఓట్లు, ఈడీ ఆఫీసులో (వెంకటాచలం ట్రైనింగ్ ఆఫీసు) 52 ఓట్లు, నెల్లూరు డిపో–1లో 638 ఓట్లు, నెల్లూరు డిపో–2లో 532, సూళ్లూరుపేటలో 318, గూడూరు 337, వాకాడు 279 , రాపూరు 311, వెంకటగిరి 319, ఆత్మకూరు 339, ఉదయగిరి 287, కావలి 400, పడుగుపాడు వర్క్‌షాపులో 134, మొత్తం 3,994 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం ఆర్టీసీ గుర్తింపు యూనియన్ల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశాం. పోలింగ్ అయిన అర్ధగంట తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రికల్లా ఫలితాలు వెలువడుతాయి. – బి.ఏసుదాసు, ఎన్నికల ప్రధాన అధికారి -
జులై 19న టీఎస్ఆర్టీసీ ఎన్నికలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికలు జులై 19న జరగనున్నాయి. జులై 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 6న తుది ఫలితాలు వెలువడతాయి. -
ఆర్టీసీ ఎన్నికలకు రెడీ!
4946 మంది ఓటర్లు 11 చోట్ల పోలింగ్ కేంద్రాలు బరిలో 8 యూనియన్లు సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న జరిగే ఈ ఎన్నికలకు ఎనిమిది యూనియన్లు పోటీ పడుతున్నాయి. విశాఖ రీజియన్ పరిధిలో పది డిపోల్లోనూ, విశాఖ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మరొకటి వెరసి 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రీజియన్ వ్యాప్తంగా 4946 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు ఒకటి రీజియన్‌కు, మరొకటి రాష్ట్ర యూనియన్‌కు ఓటేయాల్సి ఉంటుంది. రాష్ట్ర యూనియన్‌కు తెలుపు, రీజియన్ యూనియన్‌కు గులాబీ రంగు బ్యాలెట్లు ఇస్తారు. పోలింగ్ ముగిసాక అదే రోజు ఓట్ల లెక్కింపు ఉన్నా ఫలితాన్ని ఆ రోజు వెల్లడించరు. ఎందుకంటే ఈ నెల 24న పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే 18వ తేదీన ఫలితాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా అనధికారికంగా ఏ యూనియన్ విజయం సాధించిందో తెలిసిపోతుంది. ఒకవేళ స్వల్ప ఓట్ల తేడా వస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలను డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో ఎన్ఎంయూ, రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్లు గుర్తింపు యూనియన్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం యూనియన్లకు కేటాయించిన గుర్తులకే ఓటేస్తారు. గెలిచిన అనంతరం ఆయా యూనియన్లు రీజియన్, డిపోల వారీగా కార్యవర్గాన్ని నియమిస్తాయి. ముగిసిన ప్రచారం: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. కొద్దిరోజులుగా బరిలో నిలిచిన వివిధ యూనియన్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. పలు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాయి. తమ యూనియన్ను గెలిపిస్తే చేయబోయే మేళ్లను, ప్రత్యర్థి యూనియన్ల వైఫల్యాలను వివరించాయి. గత ంకంటే తగ్గిన ఓట్లు: వాస్తవానికి ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పదవీకాలం రెండేళ్లుంటుంది. గత ఏడాదితో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గత సంవత్సరం ఈ ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లు గడిచిపోయింది. ఈసారి ఎన్నికల్లో గతంకంటే దాదాపు వెయ్యి ఓట్లు తగ్గాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో దాదాపు ఆరు వేల ఓట్లుండేవి. ఈ రీజియన్‌లో 108 బస్సుల (సిటీలో 76, జిల్లాలో 32) ను తొలగించారు. ఒక్కో బస్సుకు సగటున 7.6 మంది సిబ్బంది ఉంటారు. దీంతో ఈ బస్సుల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదించేయడం ఓట్ల సంఖ్య తగ్గడానికి కారణమని కార్మిక నాయకులు చెబుతున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 95 శాతానికి పైగానే ఓట్లు పోలవుతాయని వీరు అంచనా వేస్తున్నారు. మరోవైపు రీజియన్‌లో అత్యధికంగా వాల్తేరులో 776 ఓట్లు, పాడేరులో అత్యల్పంగా 183 ఓట్లు ఉన్నాయి. ఏ యూనియన్‌కు ఏ గుర్తు? గుర్తింపు యూనియన్ ఎన్నికల బరిలో నిలిచిన యూనియన్లకు గుర్తులను కేటాయించారు. అవి బ్యాలెట్ పత్రంలో వరస క్రమంలో ఇలా ఉన్నాయి. 1) ఏపీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎగిరే పావురం 2) ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్సు 3) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ బస్సు టైరు 4) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ కార్మికుని పిడికిలి 5) ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కాగడా 6) ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నక్షత్రం 7) ఏపీఎస్ఆర్టీసీ యునెటైడ్ వర్కర్స్ యూనియన్ స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ 8) వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాన్