rudrampeta
-
అమ్మోరు తల్లికి భక్తనీరాజనం
అమ్మోరు తల్లి నామస్మరణతో ఆదివారం జిల్లా కేంద్రం అనంతపురంలోని రాంనగర్ వీధులు మార్మోగాయి. వేలాది మంది రుద్రంపేట వాసులు బోనాలు సమర్పించేందుకు కదిలి రావడంతో జాతర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాంనగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కొలువైన పెద్దమ్మ ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉరుములు, డప్పుల హోరు నడుమ నృత్యం చేస్తూ అమ్మోరు తల్లికి భక్తి నీరాజనాలర్పించారు. ఈ సందర్భగా నిర్వాహకులు యోగీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ మహిమాన్వితమైన పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలన్న కోరికతో మొత్తం కాలనీ వాసులందరూ తరలి వచ్చి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. మధ్యాహ్నం రుద్రంపేటలో పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. కార్యక్రమంలో రుద్రంపేట వాసులు కుళ్లాయప్ప, విష్ణుకుమార్, గోవిందరెడ్డి, వెంకటేశులు, మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. - అనంతపురం కల్చరల్ -
యువకుడి అనుమానాస్పద మృతి
– మతిస్థిమితం కోల్పోయి గొంతుకోసుకున్నట్లు అనుమానం – పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు అనంతపురం : అనంతపురం నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుద్రంపేటలో అనిల్‌కుమార్(23) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని స్థానికులు, పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... రవి, అనిల్‌కుమార్ ఇద్దరూ సోదరులు. వారికి తల్లిదండ్రులు లేరు. రవి బేల్దారి పని చేస్తుండగా, అనిల్‌కుమార్ అవివాహితుడు. రవి ముందు భాగంలో నివాసం ఉండగా, అనిల్‌కుమార్ ఒక్కడే అదే ఇంటికి వెనుక భాగంలో ఉంటున్నాడు. వారం రోజుల కిందట అనిల్ మిద్దెపై నుంచి కిందకు పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు మంచంపై పడుకున్న అనిల్ గొంతు కోసుకున్నాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకుని గొంతుతో పాటు శరీరంపై అక్కడకక్కడా గాట్లు పెట్టుకున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. సోదరుడు రవి, అనిల్ ఇంటివైపు చూశాడు. మంచంపై రక్తం పడి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చి తమ్ముడిని పిలిచాడు. ఎంతసేపటికీ గడి తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో వాకిలి తొలగించి చూడగా.. తమ్ముడు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ శివశంకర్ తమ సిబ్బందితో వెళ్లి అనిల్మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ వెల్లడించారు. కాగా స్థల విషయమై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉంది. -
మృతదేహంతో ధర్నా
అనంతపురం సెంట్రల్ : రుద్రంపేటలో శనివారం సాయంత్రం మృతదేహంతో ఓ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించా రు. రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన లక్ష్మి(50) కూలి పనులకు వెళ్లి చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామ సమీపం లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. ధ ర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు తిరు గు ప్రయాణమయ్యారు. అయితే కూలి ప నులకు పిలుచుకుపోయిన వ్యక్తి మహిళ మృతి చెందినా పట్టించుకోలేదు. దీంతో తోటికూలీలు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చె ల్లించాలని డిమాండ్ చేస్తూ రుద్రంపేట కూడలిలో ఆ వాహన యజమాని దుకా ణం ఎదుట ధర్నా నిర్వహించారు. విష యం తెలుసుకున్న నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ ఘటనస్థలికి చేరుకున్నారు. మృ తదేహంతో ధర్నా చేయడం పద్ధతి కాదన్నారు. వెంటనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని, తర్వాత మీకు న్యాయం జరిగేలా నేను చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్వహించారు. అనంతరం వాహన యజమానిని స్టేషన్‌కు పిలిపించుకుని మందలించారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: జంటహత్యల కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని లంబాడ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీరాములు నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే హత్యలు జరిగాయన్నారు. అంతేకాకుండా సంఘటన జరిగి 10 రోజులవుతున్నా, పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారన్నారు. సమావేశంలో అఖిల భారత బంజారాల జాతీయ అధ్యక్షుడు ఎస్కే కేశవ నాయక్, బంజారా క్రాంతిద⌠రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మహేష్ నాయక్, జీవీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర నాయక్, కృష్ణనాయక్, శ్రీరాములు నాయక్, మల్లేష్ నాయక్, వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్ పాల్గొన్నారు. -
జంట హత్యల కేసులో నిందితుల లొంగుబాటు?
అనంతపురం సెంట్రల్ : రుద్రంపేటలో జరిగిన గోపినాయక్–వెంకటేష్‌నాయక్‌ల జంట హత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఉదయం నుంచే హత్య కేసులో నిందితులు లొంగిపోతారని హైడ్రామా నడిచింది. మధ్యాహ్నంలోగా పోలీసులు మీడియా ఎదుట హాజరుపరుస్తారని చర్చ నడిచింది. చివరకు మీడియా ప్రతినిధులెవరూ లేని సమయంలో నిందితులు లొంగిపోయినట్లు సమాచారం. నగరంలో ఓ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ఈ తతంగం నడిచింది. హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిలో అమర్, చంద్ర, పోతులయ్య, రాములు లొంగిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. మిగతా నిందితులు దొరికిన తర్వాత ఒకేసారి అరెస్ట్ చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం. నాల్గవ పట్టణ స్టేషన్‌కు సీఐ ఎవరు..? జంట హత్యలకు పోలీసుల వైఫల్యం కూడా కారణమని భావించిన అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ హేమంత్‌కుమార్‌లను గత శనివారం సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఖాళీ ఏర్పడిన ఎస్ఐ స్థానానికి ఇదే స్టేషన్లో ఎస్ఐగా ఉన్న జీటీ నాయుడుకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. సీఐ స్థానం మాత్రం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఇన్‌చార్జ్‌లను నియమిస్తారా? లేక ఒకేసారి రెగ్యులర్ సీఐని అపాయింట్ చేస్తారా అన్నది తెలియడం లేదు. -
రుద్రంపేట హత్య కేసులో పురోగతి
అనంతపురం : అనంతపురం జిల్లా రుద్రంపేట జంట హత్యల కేసులో పోలీసులు శనివారం పురోగతి సాధించారు. పుట్టపర్తి మండలం చండ్రాయినిపల్లె వద్ద నిందితులు వదిలి వెళ్లిన వాహనాన్ని పోలీసులు ఈ రోజు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రుద్రంపేట కూడలిలోని చంద్రబాబు కొట్టాల సమీపంలో గురువారం ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. మృతులను గోపీ నాయక్, వెంకటేశ్ నాయక్‌గా గుర్తించారు. వీరి హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గోపీనాయక్, వెంకటేశ్ నాయక్‌లపై గతంలో నాలుగుసార్లు హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు చెబుతున్న విషయం తెలిసిందే. -
రుద్రంపేటలో పోలీసుల భద్రత కట్టుదిట్టం
అనంతపురం సెంట్రల్ : జంట హత్యలతో ఉలిక్కిపడిన రుద్రంపేటలో మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మృతులు, నిందుతుల నివాస ప్రాంతాలు ఒకే ప్రాంతం కావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. మొబైల్ వాహనాల్లో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. స్పెషల్‌పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. నగరంలో ఉండే ఎస్ఐలు, సీఐలు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు గుంపులగా కనిపిస్తే వెంటనే అక్కడ నుంచి పంపించేస్తూ గట్టి చర్యలు తీసుకుంటున్నారు.