అనంతపురం : అనంతపురం జిల్లా రుద్రంపేట జంట హత్యల కేసులో పోలీసులు శనివారం పురోగతి సాధించారు. పుట్టపర్తి మండలం చండ్రాయినిపల్లె వద్ద నిందితులు వదిలి వెళ్లిన వాహనాన్ని పోలీసులు ఈ రోజు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
రుద్రంపేట కూడలిలోని చంద్రబాబు కొట్టాల సమీపంలో గురువారం ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. మృతులను గోపీ నాయక్, వెంకటేశ్ నాయక్‌గా గుర్తించారు. వీరి హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గోపీనాయక్, వెంకటేశ్ నాయక్‌లపై గతంలో నాలుగుసార్లు హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు చెబుతున్న విషయం తెలిసిందే.