
అనంతపురం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడుతూ యువత పెడదోవ పడుతోందన్నారు. బెట్టింగులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్ధుల కదలికలపై జాగ్రత్త వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక అంతర్జాతీయ రాకెట్ ప్రమేయం ఉందని ఇప్పటివరకు 151 మంది అరెస్ట్ చేసి 8,34,320 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టును రట్టుచేశారు. ఈ కేసులో ఇద్దరు దుండగులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment