Rudyard kipling
-
వందేళ్లనాటి అడవి కథ.. ఇప్పటికీ చూడాల్సిందే!
అదో దట్టమైన అడవి, అందులో.. మోగ్లీ అనే కుర్రాడి సాహసాలు చూసి ‘శెభాష్’ అనుకుంటాం షేర్ ఖాన్ క్రూరత్వం చూసి ‘కోపం’తో రగిలిపోతాం. తోడేలు తల్లి బాధకి గుండె కరిగిపోతుంది. భగీర గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. భల్లూ అల్లరి వేషాలకు నవ్వకుండా ఉండలేం. చివరికి అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం అదుర్స్ అనిపించకమానదు. పిల్లల నుంచి పెద్దల దాకా.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి అదొక ఫేవరెట్ సబ్జెక్ట్.. అదే జంగిల్ బుక్. ఆదివారం వచ్చిందంటే దిగ్గజ రచయిత గుల్జార్ రాసిన ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై..’ లౌడ్ సౌండ్‌తో మారుమోగేది. అంతలా ఆదరించబట్టే.. ఈ కల్పిత గాథకి రూపం ఏదైనా ఆదరణ మాత్రం తగ్గట్లేదు. సాక్షి, వెబ్‌డెస్క్: చిన్నతనంలో పెద్దపులి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు ఓ చిన్నారి. ఆ పెద్దపులి బారినపడకుండా తోడేళ్లు ఆ పిల్లాడిని కాపాడుతుంటాయి. చివరికి ఆ పిల్లాడే పులిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. సింపుల్‌గా ఇది రుడ్యార్డ్ కిప్లింగ్ కథ. ఈ కథ మొత్తం జంతువుల ప్రవర్తన నేపథ్యంలో సాగుతుంది. అయితే, అంతర్లీనంగా ఉన్న థీమ్ వేరు. డార్విన్ ‘మనుగడ’ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ.. మనిషి–జంతువుల మధ్య సంబంధాలను చూపించాడు. అదే విధంగా చట్టం–న్యాయం, అధికారానికి గౌరవం ఇవ్వడం, విధేయత, శాంతి స్థాపన, అడవుల నరికివేత, అడవి– ఊరు అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సంఘర్షణ... ఇలాంటి విషయాలెన్నో చర్చించాడు. ప్రకృతిపై మనిషి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అనే పాయింట్ విమర్శకులకు సైతం బాగా నచ్చింది. అసలు కథ... షేర్ ఖాన్ అనే పెద్దపులి ఆ అడవికి రాజు. ఒకరోజు ఫారెస్ట్ అధికారుల క్యాంపెయిన్‌పై దాడిచేసి అధికారిని, అతని భార్యను చంపేస్తుంది. ఆపై అధికారి కొడుకుని చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ, తోడేళ్ల రాజు ఆ పిల్లాడిని రక్షిస్తుంది. మోగ్లీ అని పేరు పెట్టి తోడేళ్ల మందలో కలిపేస్తుంది. అంతే కాకుండా తమ సరిహద్దుల్లో ఉన్నప్పుడు మోగ్లీపై దాడి చేయకూడదని షేర్ ఖాన్‌కి నిబంధన పెడతాయి. చిన్నతనంలో ఓ రోజు ఆడుకుంటూ మోగ్లీ సరిహద్దు దాటుతాడు. షేర్ ఖాన్ మోగ్లీని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, తోడేలు రాజు తన ప్రాణాలు పణంగా పెట్టి మోగ్లీని కాపాడుతుంది. తర్వాత రక్ష(ఆడ తోడేలు) మోగ్లీ తల్లిగా తన పిల్లలతో పెంచుకుంటుంది. భగీర(నల్ల చిరుత) మోగ్లీకి చెట్లు ఎక్కడం, వేటాడటంపై శిక్షణ ఇస్తుంది. భల్లు(ఎలుగు బంటి) తోడేళ్లకు విద్యాబుద్ధులు, అడవి చట్టాల్ని బోధిస్తుంటుంది. ఈ ఇద్దరి శిక్షణలో మోగ్లీ రాటు దేలతాడు. తర్వాత కొన్నేళ్లకు అనివార్య పరిస్థితుల్లో మోగ్లీ అడవి దాటాల్సి వస్తుంది. అప్పుడు షేర్ ఖాన్ మోగ్లీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, నిప్పుని ఆయుధంగా చేసుకుని మోగ్లీ తప్పించుకుంటాడు. పొరుగున ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఓ జంట మోగ్లీని దత్తత తీసుకుంటుంది. చిన్నతనంలో ఆ జంట బిడ్డని కూడా పులి ఎత్తుకుపోతుంది. మోగ్లీ పశువుల్ని కాస్తుంటాడు. అయితే, ఈ విషయం షేర్ ఖాన్‌కి తెలుస్తుంది. తోడేళ్ల మందలోని వేగుల సాయంతో మోగ్లీ చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మోగ్లీ అగ్గి సాయంతో షేర్ ఖాన్ని చంపేస్తాడు. అయితే ఊళ్లోవాళ్లు మాత్రం మోగ్లీని మంత్రగాడిగా అనుమానించి.. వెళ్లగొడతారు. దీంతో మోగ్లీ తిరిగి అడవికి చేరి తన తోడేలు కుటుంబంతో హాయిగా నివసిస్తుంటాడు. ఇది మొదటి పుస్తకం కథ. రెండో పుస్తకంలో జంగిల్ బుక్ సీక్వెల్. అప్పటికే ఆ ఊరి గ్రామస్తులు అడవిని నాశనం చేస్తుంటారు. అదే సమయంలో కరువుతో గ్రామస్తులు చనిపోతుంటారు. అయితే, మోగ్లీ చేతబడి చేయటంతోనే తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలంతా నమ్ముతారు. మోగ్లీ్కి ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆ జంటను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం స్నేహితురాలి ద్వారా మోగ్లీ తెలుసుకుంటాడు. వెంటనే మోగ్లీ జంతువులతో ఊరిపై దాడి చేయించి వారిని రక్షిస్తాడు. ఇది ఆసరాగా చేసుకుని ఎర్ర తోడేళ్లు మనుషులపై దాడి చేయాలనుకుంటాయి. కానీ, మోగ్లీ తన తోడేలు కుటుంబం సాయంతో ప్రజల్ని రక్షిస్తాడు. మోగ్లీ మానవత్వానికి కరిగిపోయిన అతని తల్లి.. మనుషులతో ఉండాలా? జంతువులతో అడవిలోనే నివసించాలా? అన్న నిర్ణయాన్ని మోగ్లీకే వదిలేస్తుంది. అలా మోగ్లీ ఆలోచిస్తుండగానే కథ ముగుస్తుంది. అయితే తర్వాత రుడ్ యార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది స్పింగ్ రన్నింగ్’ పుస్తకంలోనూ మోగ్లీ సంఘర్షణకు ముగింపు ఇవ్వకపోవటం విశేషం. జంగిల్ బుక్ పుట్టుక నిజానికి జంగిల్ బుక్ కథ కంటే ముందే కీలక పాత్ర మోగ్లీ పుట్టింది. ఇంగ్లండ్ ఆర్టిస్ట్ జాన్ లాక్వుడ్ కిప్లింగ్. భారత దేశ చరిత్రపై కొన్నాళ్ల పాటు అధ్యయనం చేశాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఆయన.. మోగ్లీ, మరికొన్ని పాత్రలను స్కెచ్ వేశాడు. మోగ్లీ అంటే కప్ప అని అర్థం. ఆ తర్వాత లాక్వుడ్ కొడుకు రుడ్యార్డ్ కిప్లింగ్ ఆ క్యారెక్టర్లతోనే జంగిల్ బుక్ రచన మొదలుపెట్టాడు. రుడ్యార్డ్ ముంబైలో పుట్టాడు. మధ్యప్రదేశ్(అప్పుడు మధ్యభారతం)లోని సియోని ప్రాంతంలోని ‘పెంచ్’ అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఓ ఇంగ్లిష్ ఫారెస్ట్ అధికారికి సహకరించే గిరిజన చిన్నారే మోగ్లీ. అలా చిన్న చిన్న కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ సంపుటిగా చేసి ‘ఇన్ ది రుఖ్’ పేరిట సంకలనం చేశాడు. ఆ మరుసటి ఏడాది అంటే 1894లో ది జంగిల్ బుక్‌గా పుస్తకం అచ్చయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ్లీ–షేర్ ఖాన్ కథ ఆ పుస్తకంలోనిదే. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంతో ముడిపెట్టి రెండో పుస్తకం రాశాడు రుడ్యార్డ్. ఈ రెండు పుస్తకాల్ని కలిపి 1907లో ఒకే పుస్తకంగా అచ్చేయించాడు. 1933లో అది కాస్త ‘ఆల్ ది మోగ్లీ స్టోరీస్’ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ వర్షన్లను జంగిల్ బుక్కి అన్వయించారు. ఎన్ని కథలోచ్చినా ఆ క్రెడిట్ మాత్రం కిప్లింగ్కే కట్టబెడుతుంటారు. తెరపై భారీ విజయాలు జంగిల్ బుక్ మీద యానిమేటెడ్ సిరీస్‌లు.. చిత్రాలు బోలెడన్ని వచ్చాయి. అవన్నీ బంపర్ హిట్లే. జపాన్‌కు చెందిన నిప్పోన్, డోరో టీవీ మర్చండైజింగ్ స్టూడియోలు సంయుక్తంగా జంగిల్ బుక్–షోనెన్ మోగ్లీని 52 ఎపిసోడ్లతో కార్టూన్‌గా తెరకెక్కించాయి. దానిని భారత్‌లో ది జంగిల్ బుక్: ది అడ్వెంచర్స్ ఆఫ్ మోగ్లీ గా అనువదించారు. భారత్‌లో 90వ దశకంలో ఊపు ఊపిన యానిమేటెడ్ సిరీస్ అదే. తర్వాత వీడియో గేమ్‌గా జంగిల్ బుక్ ఆదరణ పొందింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జాన్ ఫావ్రూ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ చిత్రం. వాల్ట్ డిస్నీ బ్యానర్లో 3డీ లైవ్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం యానిమేటెడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో ఒకే ఒక్క హ్యుమన్ క్యారెక్టర్. ‘మోగ్లీ’ పాత్రలో ఏషియన్–అమెరికన్ సంతతికి చెందిన నీల్ సేథి నటించాడు. సంకల్ప్ వాయుపుత్ర అనే కుర్రాడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో మోగ్లీ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. -
శ్రీశ్రీ అలభ్య అనువాద రచన (యక్షగానం) భాగ్యలక్ష్మి
మహాకవి శ్రీశ్రీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా, ఒక అదనపు కారణానికి కూడా ఈ పండుగ వేడుక హెచ్చింది. విరసం వారూ, తరువాత మనసు ఫౌండేషన్ వారూ వేసిన శ్రీశ్రీ సమగ్ర రచనలు లేదా సంపూర్ణ లభ్య రచనల సంకలనాల శ్రద్ధాపూర్వక కృషి తరువాత కూడా మరొక శ్రీశ్రీ రచన, లభ్యం అయ్యింది. అది రాసిన శ్రీశ్రీకి 34 ఏళ్ళు. ఒక ఏడాది ముందరే జరిగిన ఈ రచన, తన ప్రపంచ సాహిత్య అధ్యయన స్వభావానికి దీటుగానే ఉన్నది. ఈ రచన అచ్చు అయింది 26 మార్చ్ 1944 ఆనందవాణి పత్రికలో, భాగ్యలక్ష్మి (యక్షగానం) పేరిట. ఇది అనువాద కవిత కావడం మరొక విశేషం. ఇరవై మూడేళ్ళ రడ్యార్డ్ కిప్లింగ్ (1865 – 1936) రచన ‘ద మాస్క్ ఆఫ్ ప్లెంటీ’కి యేడాది క్రితం నేను చేసిన యధాశక్తి తర్జుమా) అని శ్రీశ్రీ పాదసూచి పెట్టారు. ఇంతకుముందు శ్రీశ్రీ అనువాదాలు ఎక్కువగా వచ్చిన ఖడ్గసృష్టిలో కానీ, శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరిట మనసు ఫౌండేషన్ వారి బృహత్ ప్రచురణలో కానీ ఈ రచన లేదు. శ్రీశ్రీ అనువాదాలను అధ్యయనం చేసే వారికి, వారి సాహిత్య ప్రియులకు, తెలుగు సాహిత్య చరిత్రకు ఇదొక కొత్తగా లభ్యమైన వనరు. శ్రీశ్రీ రచనల సేకరణలో అనితర సాధ్యమైన కృషి చేసిన చలసాని ప్రసాద్ గారిని స్మరించడం కూడా ఈ సందర్భానికి శోభను ఇస్తుంది. శ్రీశ్రీ సంపూర్ణ లభ్య రచనల కృషిలో రెండు మూడు తరాల సాహిత్యాసక్తులు, సాహిత్య వేత్తలు, సేకర్తలు కలిసి పని చేసి సాధించిన ఫలితంలో ఇదొక అదనపు అక్షర అక్షయ నిధి. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనానికి పుష్కలమైన అవకాశం.కిప్లింగ్ ఆంగ్ల కవిత లాహోర్ నుంచి నడిచే పత్రిక ‘ది పయనీర్’లో 26 అక్టోబర్ 1888 నాడు ప్రచురణ. బ్రిటిష్ రాణి పాలనలో భారత జన జీవనంపై ఇదొక విలువైన రచన. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ విచారణ కమిషన్ తీరు తెన్నులపై, కిప్లింగ్ అంటే ఫ్రెంచ్ భాషలో ఒక పల్లీయ వినోద ప్రదర్శన గానూ, అలాగే అసలు విషయం దాచిపెట్టే కుహనా నివేదికల ప్రహసనంపై ఆంగ్ల భాషలో ఝ్చటజు అన్న అర్థంతోనూ ఈ రచన, పాలకుల ధోరణిపై విమర్శగా చేశాడు. అలా చూస్తే, బ్రిటిష్ ఇండియా సాహిత్యంలో ఒక ప్రధాన రచన అయిన దీన్ని శ్రీశ్రీ 75 ఏళ్ల ముందర తెలుగులోకి తెచ్చారు. యధాశక్తి తర్జుమా అన్నారు కనుక 1888 మూలం, 1943 తెలుగు అనువాదం, నిశిత పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. రైతు జీవితాలు 1888 నాటికి ఎలా ఉన్నాయో, కిప్లింగ్ చెప్పగా, అంతకన్నా మరింత గడ్డుగా స్వాతంత్య్రానంతర భారతంలో ‘మార్చాము’ కనుక – దాదాపు శతాబ్దపున్నర కిందటి ఈ భారతీయ సమాజ రచన ఆనాడే అక్కడే ఉండిపోకుండా, 75 ఏళ్ల కిందట వెలుగులోకి తెలుగులోకి తెచ్చిన మహాకవి శ్రీశ్రీ సృజన దర్శనానికి వందనాలు. సేకరణ, లఘువ్యాఖ్య: రామతీర్థ (అవతారిక:– భారతీయ ప్రభుత్వం వారు దేశంలో యోగక్షేమాల భోగట్టా తియ్యడానికొక ప్రత్యేక సంఘాన్ని నియోగించారు. నిక్షేపం లాగ దేశం భాగ్యభోగాలతో తులతూగుతోందని ప్రభుత్వం వారు పసికట్టారు). రంగం:– భూలోకస్వర్గం – అనగా సిమ్లా శిఖరం. భారతీయ ప్రభుత్వం భాగ్యలక్ష్మి వేషంలో పాడుకుంటూ ప్రవేశం. టకోరా; సన్నాయి మేళాల నేప«థ్య గానం. రైతు బ్రతుకే మధురం! ఆహా రైతు బ్రతుకే మధురం పగలూ, రాత్రీ, పాడీ పంటా రాజ్యమేలే రాజులకన్నా రైతు బ్రదుకే సులభం! ఆహా రైతు బ్రదుకే సుభగం (తొహరా) సాక్షాత్తూ మనదేశం స్వర్గమే అని మా ఉద్దేశం పుణ్యభూమి కాదటండీ వేరే భూకైలాసం ఉన్నాదటండీ! జరూరుగా తమరొక నివేదిక తయారుచేసి పారేస్తే చాలిక! శతసహస్ర భారత నరనారీమణులు శక్రచాప శబలిత తేజోఘృణులు చిత్రచిత్ర వర్ణాలతో వీరి పరిస్థితి చిత్రించండి సముజ్వల సుందరాకృతి (హిమాలయ పర్వతాలు దిగి సమర్థులైన పరిశీలన సంఘంవారు దయచేస్తారు.) తురుష్క వేత్ర హస్తుడు – యోగక్షేమాల భోగట్టా తీశారా? దేశం నాడిపరీక్ష చేశారా? చక్కని భాషలో నివేదిక రాశారా? సమాచారమేదో మా నెత్తిని కొట్టండి. ఆవులూ గేదెలూ దూడలూ దున్నలూ అమాం బాపతు లెక్కలు కట్టండి ఫస్టు క్లాసులో యమ్మే ప్యాసయిన బాబూజీనొకడ్ని పట్టండి కట్టలు కట్టలుగా కాగితాల కుప్పలతో గెజెటీర్లకి గెజెటీర్లే నిండుతాయి: విష్కంభం అనంతాకాశం నించి అశరీరవాణి (జంత్ర వాద్యాల సంగీతంతో) బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను ఆకసము రక్తాగ్ని కుండము భూమి నల్లని బొగ్గుకుంపటి మండుగాడుపు టెండవేడికి మరిగి కాలం భగీల్మన్నది యముని కారెనుబోతు మెడలో ఇనుపగంటలు నవ్వినట్లుగ దిగుడుబావి దిగాలుమన్నది పైరు పంటలు బావు రన్నవి ఇంకిపోయిన ఏటి కడుపున ఇసుక దిబ్బలు గొల్లుమన్నవి పరమపద సోపాన పథమున పాము నోట్లో పడ్డ రైతూ! ఎవరికై చేయెత్తి ప్రార్థన? ఎవరి కర్మల కెవరు కర్తలు చూడు పడమట సూది బెజ్జపు మేర కూడా మేఘ మంటదు ఇంత వర్షపు చినుకు కోసం చూచి కన్నులు సున్న మైనవి ఏడుపెందుకు వెర్రి బిడ్డా ఎవరు నీ మొర లాలకింతురు చచ్చిపోయిన గొడ్డు నడుముకు చచ్చినట్టే నిద్రపోవోయ్! (విజయ గర్వంతో విర్రవీగుతూ సిమ్లా నగరానికి పరిశోధక సంఘంవారి పునరాగమనం. సింహ శాబకాన్ని వెంటబెట్టుకొని వస్తూన్న భరతపుత్రుని వేషంతో. అస్వస్థతగా వున్న భారతదేశం చికిత్స పొందుతున్న సూచనగా నుదుటికి పలాస్త్రీ, మోకాళ్లకి పట్టీలు) సంఘసభ్యుల సంగీతం:– తిరిగాము తిరిగాము గోవిందారామ దేశమంతా మేము గోవిందా రాజుల్ని చూశాము గోవిందారామ రైతుల్ని చూశాము గోవిందా చూశాము చూశాము గోవిందారామ దేశసౌభాగ్యాన్ని గోవిందా మాయ రోగాలేవి గోవిందారామ మచ్చుకైనా లేవు గోవిందా చావనే మాటైన గోవిందారామ స్మరియించగా రాదు గోవిందా శిస్తుగా ప్రజలెల్ల గోవిందారామ మస్తుగా బలిశారు గోవిందా సకల సంపదలతో గోవిందారామ తులతూగుతున్నారు గోవిందా. (నాట్యం) కాపులూ కరణాలు రాజులూ రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులూ మాల మాదిగలు పిండార్లు థగ్గులూ జైనులూ జాట్లు సర్కారు దయవల్ల గోవిందారామ చల్లగా వున్నారు గోవిందా తిని తిరిగి హాయిగా గోవిందారామ తెగ బలిసి పోయారు గోవిందా గో‘ఓ’వింద! (ఇండియా ప్రభుత్వం తెల్ల శాటిన్ రెక్కలతో ఎగిరివచ్చి అమెరికన్ రోడ్డు తంబురా మీటుతూ స్వస్తి వాచకం–) ప్రజ లేకగ్రీవమ్ముగ పంచభక్ష్య రసాన్నములు పర్వత శిఖరాగ్రమ్ముల ప్రశాంతముగ పవ్వళించి ఆరగించు దృశ్యమ్మును ఆక్షి పేయమగునట్లుగ చూచుచుంటకంటె వేరె సుఖమున్నదె శుభమున్నదె? పరిశోధక సంఘసభ్య పావనమూర్తులకు జయము ఫలియించెను మీరు పడిన పరిశ్రమము ధన్యులొహో కిరాయి మేళం – బాకాలూదుతూ:– గొప్ప గొప్ప కామందులపై వారి బంధుమిత్రాదులపై భగవంతుని కరుణారసామృతం ప్రవహించక తప్పదు మరి వానలూ వరదలూ వచ్చినా కరువూ కాటకం కలరా వచ్చినా పేదవాళ్ల సొమ్మేం బోయింది ఆదమరిచి నిద్రపోతే సరి పేదవాళ్లు సుఖంగానే వున్నారని భాగ్యవంతులు నిర్ణయించేశారు గొప్ప గొప్ప వారందరికీ జయం వారి చుట్టూ తిరిగే వారందరికీ జయం పేదవాళ్ల కెందుకూ భయం? ప్రాణమున్నన్నాళ్లు బతుకుతారు నయం! Rudyard Kipling రాసిన The Masque of Plenty కి ఏడాది క్రితం నేను చేసిన యథాశక్తి తర్జుమా. –శ్రీశ్రీ -
మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?
మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్‌బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్‌బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్‌లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు. -
నోబెల్ ఇండియా ఊహాప్రపంచ సృష్టికర్త `రడ్యార్డ్ కిప్లింగ్`
అత్యంత ప్రతిష్టాకరమైనది నోబెల్ పురస్కారం. రడ్ యార్డ్ కిప్లింగ్ సాహిత్య విభాగంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో జన్మించి ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఈయన రెండవవారు. రడ్ యార్డ్ కిప్లింగ్ రచనలలో కొన్ని: పాక్ ఆఫ్ పోక్స్ హిల్ (1906) రివార్డ్ అండ్ ఫెయిరీస్(1910) పద్య సంకలనం విత్ ది నైట్ మెయిల్’ (1905) యాజ్ ఈజీ యాజ్ ఎ బి సి (1912) రడ్యార్డ్ కిప్లింగ్... మహారాష్ట్రలోని ముంబాయి (బ్రిటిష్ పాలనకాలం నాటి బొంబాయి ప్రెసిడెన్సీ)లో 1865వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన జన్మించారు. తండ్రి జాన్లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. ఈ దంపతుల తొలిసంతానం రడ్యార్డ్ కిప్లింగ్. తొలి పరిచయానికి గుర్తుగా... రడ్ యార్డ్ తండ్రి జాన్ లాక్వుడ్ కిప్లింగ్ బొంబాయిలోని జంషెడ్జీ జిజీబాయి కళా విద్యాలయంలో ఆచార్యునిగా ఉద్యోగం చేసేవారు. ఆయన స్వయంగా శిల్పి. శిల్పకళా శాస్త్రం, మృత్తికతో కళాఖండాలు మలిచే విభాగంలో ఆచార్యులు. లాక్ఉడ్ 1863లో ఇంగ్లండులోని స్టాఫోర్డ్ షైర్లో ఉన్న రడ్ యార్డ్ సరస్సు వద్ద ఆలీస్ని తొలిసారిగా కలిసాడు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దంపదులు 1865లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తమ పరిచయానికి, ప్రేమకు నెలవైన రడ్యార్డ్ సరస్సు పేరును తొలిబిడ్డకు నామకరణం చేశారీ దంపతులు. ఆరేళ్లకే ఖండాంతరం! రడ్ యార్డ్ కిప్లింగ్‌ని ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు లాక్ఉడ్ దంపతులు. రడ్యార్డ్తోపాటు అతని మూడేళ్ల చెల్లెలు చిన్న అలీస్‌ను కూడా ఇంగ్లండ్‌కి పంపించారు. అన్నాచెల్లెళ్లిద్దరూ ఇంగ్లండ్‌లో మిసెస్ హాలోవే ఇంట్లో పేయింగ్ గెస్ట్లుగా ఉండేవారు. హాలోవే వీరిపట్ల కరకుగా వ్యవహరించేది. ఆమె ధోరణితో రడ్ యార్డ్, అతని సోదరి ఇంగ్లండులో ఎన్నో కష్టాలనుభవిస్తూ చదువుకున్నారు. ఇంతలో తండ్రి ఆరోగ్యంతోపాటు ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో రడ్యార్డ్ కిప్లింగ్, ఆయన సోదరి భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి అవిభక్త భారతదేశంలోని లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభించారు కిప్లింగ్. అక్కడ ప్రచురితమయ్యే సివిల్ మిలిటరీ గెజెట్ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తర్వాత కలకత్తా నుంచి వెలువడుతున్న ‘ది పయనీర్’ అనే బహుళ ప్రాచుర్యం గలిగిన పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. ఈ కాలంలోనే రడ్ యార్డ్ కిప్లింగ్లోని రచయిత ప్రకాశించటం మొదలుపెట్టాడు. 1889 మార్చి నెలలో రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు పయనమయ్యాడు. లండన్‌లో ఆయన తొలి నవల ‘ద లైట్ దట్ ఫెయిల్డ్’ ప్రచురితమైంది. సంపాదకుడి నుంచి... నోబెల్ వరకు! 1891లో రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్ ప్రచురణ కర్త వోల్కాట్తో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగాను, బాంధవ్యంగాను మారింది. వోల్కాట్ సోదరి కారొలీన్‌ను రడ్ యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకుని అమెరికాలో జీవించసాగారు. 1892లో రడ్ యార్డ్ కిప్లింగ్, కారొలీనా దంపతులకు ప్రథమ పుత్రిక జోసెఫీన్ జన్మించింది. ఈ కాలంలో రడ్ యార్డ్ కిప్లింగ్ ‘నౌలాహ్‌క’ మోగ్లీ కథలు రాశారు. అదే ఏడాది ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రడ్యార్డ్ ఆరోగ్యం కుదుటపడడానికి సముద్రయానం మంచిదని సలహా ఇచ్చారు వైద్యులు. మరొకపక్క ఇదే సమయంలో అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గుముఖం పట్టాయి కూడ. దాంతో కిప్లింగ్ దంపతులు ఇంగ్లండుకు చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో ‘ది సెవెన్ సీస్’ అనే పద్య సంపుటి, ‘కెప్టెన్స్ కరేజియస్’ అనే నవల ప్రధానమైనవి. 1896లో రడ్ యార్డ్ దంపతులకు రెండవ పుత్రిక ‘ఎల్సీ’ జన్మించింది. కిప్లింగ్ రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. మరెన్నో రచనలు చేస్తూండగానే హటాత్తుగా వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. వారి పెద్ద కుమార్తె నిమోనియాతో బాధపడుతూ 1899లో తుదిశ్వాస వదిలింది. మూడేళ్ల విరామం తర్వాత 1902లో రడ్ యార్డ్ రాసిన ‘జస్ట్ సో’ కథాసంపుటి ప్రచురితమైంది. రడ్యార్డ్ రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఆ సందర్భంగా ‘‘కిప్లింగ్లోని పరిశీలనాశక్తి, సహజత్వం, ఊహాశక్తి అద్భుతమైన కథాకథన శక్తికి గుర్తింపుగా ఈ నోబెల్ పురస్కారం అందచేయడమైనది’’ అని నోబెల్ కమిటీ పేర్కొన్నది. కిప్లింగ్ దంపతులకు జాన్ రడ్ యార్డ్ కిప్లింగ్ ఒక్కడే పుత్రుడు. అతనిని చిన్నవయసులోనే సైన్యంలో చేర్చారు రడ్యార్డ్. దురదృష్టవశాన జాన్ యుద్ధంలో మరణించాడు. జాన్ మరణానికి తానే కారణమని కిప్లింగ్ ఎంతగానో దుఃఖించారు. ఆ దుఃఖంలో రాసినదే ‘మై బాయ్ జాక్’.నోబెల్ బహుమతి గ్రహించిన తర్వాత ‘లార్డ్’ బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ (స్కాట్‌ల్యాండ్)లో 1922వ సంవత్సరం నుండి 1925 వరకూ ‘లార్డ్ రెక్టార్’ పదవిలో కొనసాగారు. ఇంతటి ప్రతిభాశాలి 1936వ సంవత్సరం, జనవరి 18వ తేదీన మెదడులో రక్తనాళాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) మరణించారు. కిప్లింగ్ తన రచనలలో చాలా వరకు సైనికులను, పిల్లలను ఉద్దేశించి రాశారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు 2013 నోబెల్ బహుమతులు - జీవకణాల రవాణా వ్యవస్థ వెసికిల్ ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. వారు ర్యాండీ డబ్ల్యు షీక్మన్, జేమ్స్ ఈ రాత్‌మన్, డాక్టర్ థామస్ సుఢోఫ్. ఈ ముగ్గురూ శరీరంలో వ్యాధిని నివారించే ఔషధం... ఆ వ్యాధిగల స్థానానికి ఎట్లా చేరుకుంటుందో తెలిపే వెసికిల్ రవాణా వ్యవస్థ పనితీరును వివరించారు. వీరి పరిశోధనలను గుర్తించిన నోబెల్ పురస్కార నిర్ణాయక కమిటీ స్వీడన్‌లోని కరోలిన్స్కా సంస్థలో, ‘‘మన శరీరంలో ప్రధానమైన వెసికిల్ రవాణావ్యవస్థను కనుగొనటం ద్వారా మానవ శరీర వ్యవస్థను అవగాహన చేసుకునే వీలు కలిగించారని’’ పేర్కొంది. ర్యాండీ డబ్ల్యూ షీక్మన్... 1948లో అమెరికాలో జన్మించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(బెర్కిలీ)లో కణ జీవ శాస్త్రవేత్త. వెసికిల్ వ్యవస్థను నియంత్రించే 3 రకాల జన్యువులను కనుగొన్నారు. జేమ్స్ ఈ రాత్‌మన్... 1950వ సంవత్సరంలో అమెరికాలో జన్మించారు. జీవకణాల రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను స్వీకరించి రవాణా చేసే ప్రొటీన్లను, వాటి చర్యవిధానాన్ని వివరించారు. రాత్‌మన్ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో న్యూహేవెన్లోని యేల్ విశ్వవిద్యాలయంలో జీవకణ శాస్త్రవేత్త. డాక్టర్ థామస్ సుఢోఫ్... 1955లో జర్మనీలో జన్మించారు. జీవకణ రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను నియంత్రించే ఆజ్ఞలు గమ్యం చేరటానికి, అవి మోసుకు వచ్చిన పదార్థాలను బట్వాడా చేయటానికి ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు. వెసికిల్ అంటే... మెంబ్రేన్ పొరతో నిర్మితమైన అతి సూక్ష్మమైన బుడగ వంటి ప్యాకింగ్.