ruppees notes
-
రూపాయి.. అధరహో
ముంబై: చాలా రోజుల తర్వాత డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడుల వరద పారడంతో రూపాయి క్రమంగా బలం పుంజుకుంది. డాలర్ మారకంతో పోల్చితే 17 పైసలు లాభపడింది. గత కొంత కాలంగా ఇండియన్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైం హైలను తాకినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 238 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు అమెరికా మార్కెట్లో డాలర్ ఒడిదుడులకు లోనవుతోంది. ఫలితంగా గురువారం మార్కెట్లో డాలర్లతో పోల్చితే రూపాయి గణనీయంగా బలపడింది. ఏకంగా 17 పైసల వరకు విలువను పెంచుకుని 74.27 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.44 దగ్గర కొనసాగింది. -
దొంగనోట్ల కలకలం
గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామం లో 1000 రూపాయల దొంగనోట్లు కలకలం సృష్టించా యి. భూపాలపల్లి మండలం మో రంచపల్లి గ్రామ∙శివారు దుబ్బపల్లికి చెందిన రైతు బొజ్జ లచ్చయ్య స్థానిక చెల్పూరు గ్రామీ ణ వికాస బ్యాంక్‌లో బుధవారం రూ.13 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకు క్యాషియర్ అన్ని వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చాడు. సదరు రైతు గురువారం ఆ నోట్లను చెలామణి చేయడానికి పలు షాపులు తిరిగా డు. తిరిగిన ప్రతిచోట నోట్లను పరిశీలిం చి ఇవి దొంగనోట్లని దుకాణదారులు అనడంతో రైతు ఆందోళన చెందాడు. శుక్రవారం మోరంచపల్లికి చెందిన కొంతమందిని తీసుకుని బ్యాంకుకు వెళ్లి మేనేజర్, క్యాషియర్‌ను నిల దీశారు. నాలుగు వెయ్యి రూపాయల నోట్లను క్యాషియర్ తీసుకొని వేరేనోట్లను రైతుకు అందజేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. కాగా ఆ నోట్లు దొంగనోట్లు కావని, గతంలో రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసిన నోట్లని బ్యాంక్ అధికారులు వెల్లడించారు.