Rusia
-
క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!
మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ఇన్వెస్టర్లు అందరూ విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు(జనవరి 21) భారీగా పతనం అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 5.97 శాతం తగ్గి రూ.28.44 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 7.71 శాతం తగ్గి రూ.205,958.68 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది. బైనాన్స్ కాయిన్ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్‌రింగ్, లైవ్‌పీర్, యార్న్ ఫైనాన్స్, హార్మొని, ఎన్‌కేఎన్, కీప్ నెట్వర్క్, అల్గొరాండ్ 13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తల వల్ల క్రిప్టో మైనింగ్ పరిశ్రమకు నిలయమైన రష్యా అన్ని క్రిప్టోకరెన్సీల వినియోగం, మైనింగ్ పై నిషేధాన్ని విధించాలని చూస్తుంది. రష్యాలోని సుమారు 17 మిలియన్ క్రిప్టో వాలెట్లలో 7 ట్రిలియన్ రూబుల్స్ (92 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ Crypto.com, తమ క్రిప్టో కరెన్సీ దొంగిలించినట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఈ వారం కొద్ది సేపు భద్రతల నేపథ్యంలో ట్రెండింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. (చదవండి: రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!) -
టెక్ దిగ్గజం మెటాపై భారీ జరిమానా విధించిన రష్యా!
ఫేస్బుక్ యజమాని మెటా ప్లాట్‌ఫామ్ మీద మాస్కో(రష్యా రాజధాని) కోర్టు 13 మిలియన్ రూబుల్స్(177,000 డాలర్లు) జరిమానా విధించింది. ప్రభుత్వ నియమాలకు, చట్టవిరుద్ధంగా భావించే కంటెంట్ తొలగించడంలో విఫలమైనందుకు జరిమానా విధించినట్లు పేర్కొంది. రష్యా దేశం ఈ సంవత్సరం బిగ్ టెక్ కంపెనీపై ఒత్తిడిని పెంచింది. ఇంటర్నెట్ విమర్శకులను దారిలో పెట్టడానికి నిబందనలను కొద్దిగా కఠినతరం చేసింది. ఇది వ్యక్తిగత, కార్పొరేట్ స్వేచ్ఛను అణచివేసే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈ జరిమానా విషయంలో ఫేస్బుక్ యజమాని మెటా ఇంకా స్పందించలేదు. (చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!) -
రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు
రష్యా తాజాగా యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ను పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా బాధ్యతారహితంగా, ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించినట్లు అమెరికా పేర్కొంది. ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా రష్యా తన స్వంత శాటిలైట్లలో ఒకదానిని పేల్చివేసింది. రష్యా ఈ పరీక్ష చేయడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని సిబ్బందికి ప్రమాదం ఏర్పడింది అని, ఆ సిబ్బంది రక్షణ కోసం(ఐఎస్ఎస్) క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు అమెరికా తెలిపింది. స్పేస్ స్టేషన్లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్, ఇద్దరు రష్యన్లు. ఈ రష్యన్ యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్షలో తన స్వంత శాటిలైట్లను పేల్చడంతో అంతరిక్షంలో 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు భూనిమ్న కక్ష్య(ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. ఈ ప్రత్యక్ష ఆరోహణ యాంటీ శాటిలైట్(డిఏ-ఏఎస్ఎటి) క్షిపణి పరీక్ష వల్ల వేలాది చిన్న ముక్కలను అంతరిక్షంలో తిరుగుతున్నాయి, వీటిని ట్రాక్ చేయడం కష్టం అని అంతరిక్ష నిపుణులు తెలుపుతున్నారు. నాసా, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఈ ఉపగ్రహ శకలాలు నుంచి అంతరిక్ష కేంద్రానికి ప్రస్తుతానికి ముప్పు లేదని పేర్కొన్నప్పటికి, ఉపగ్రహంను పేల్చడంతో వెలువడిన ఎగిరిన రాతి, ధూళి కణాలు లేదా పెయింట్ చిప్స్ వంటి ట్రాక్ చేయడానికి వీలు కానీ వాటి వల్ల అంతరిక్షంలో ప్రమాదం ఏర్పడే అవకాశమ ఉన్నట్లు తెలిపారు. ఉపగ్రహ శకలాలు ప్రతి 93 నిమిషాలకు ఒకసారి ఐఎస్ఎస్ను దాటుతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్త & శాటిలైట్ ట్రాకర్ జోనాథన్ మెక్ డోవెల్ తెలిపారు. (చదవండి: హైడ్రోజన్ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 కి.మీ) సైన్స్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ ఈ పరీక్షను తీవ్రంగా ఖండించింది. అన్ని దేశాల అంతరిక్ష భద్రతపట్ల రష్యా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నట్లు యుఎస్ స్పేస్ కమాండ్ కమాండర్ జనరల్ జేమ్స్ డికిన్సన్ అన్నారు. దీనివల్ల ప్రపంచానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని అన్నారు. 1982లో ప్రయోగించిన తన సొంత ఉపగ్రహం కాస్మోస్-1408ను రష్యా పేల్చినట్లు తెలుస్తోంది. ఈ పనిచేయని ఉపగ్రహం సుమారు 2,000 కిలోల బరువు ఉంది. చివరిసారిగా 485 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలో ట్రాక్ చేసినట్లు స్పేస్ న్యూస్ తెలిపింది. ఐఎస్ఎస్ భూమికి 402 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉంది. రష్యా చేసిన పని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష సంస్థకు ముప్పు ఉందని, చైనా స్పేస్ స్టేషన్‌కు చెందిన టైకోనాట్లకు కూడా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటన పట్ల రష్యా స్పేస్ ఏజెన్సీ స్పందించలేదు. చైనా, భారతదేశం, రష్యా, యుఎస్ వంటి నాలుగు దేశాలు మాత్రమే యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగాయి. -
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!
అప్పుడప్పుడు మనం సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చిత్రాల కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ రూపంలోనో వాటిని డైరెక్టర్లు చూపిస్తారు. ఆ చిత్రాలు కూడా నిజంగానే అంతరిక్షానికి వెళ్లి తీశారో ఏమో అన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా, అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కోసం రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లారు. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఐస్)కు బయల్దేరి వెళ్లారు. ‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్ఎస్ వెళ్లారు. మన దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్‌లోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం నాలుగు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతరిక్షంలో మూవీ షూటింగ్‌ను రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించినా లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించారు. అక్కడి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయితే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా స్పేస్‌లో షూటింగ్ చేయడం కోసం సిద్దమైన సంగతి తెలిసిందే. దానికోసం నాసా, స్పేస్-ఎక్స్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మధ్య కాలంలో అంతరిక్ష పర్యటన అనేది చాలా ఒక బస్ జర్నీ లాగా మారింది. The #SoyuzMS19 spacecraft successfully reaches orbit 🚀 Cosmonaut @Anton_Astrey and spaceflight participants Yulia Peresild and Klim Shipenko are on their way to the International Space Station! The docking will take place in 3 hours - at 12:12 UTC. pic.twitter.com/viEeHHVovH — РОСКОСМОС (@roscosmos) October 5, 2021 -
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
అంతరిక్షంలో వ్యామోగాముల నివాసమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు భారీ ప్రమాదం తప్పింది. రష్యా కొత్తగా పంపిన రష్యన్ రీసెర్చ్ "నౌకా మాడ్యూల్" అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) డాక్ చేసిన కొన్ని గంటల తర్వాత అనుకోకుండా మండటంతో కొద్దిసేపు ఐఎస్ఎస్ పై నియంత్రణ కోల్పోయినట్లు నాసా అధికారులు తెలిపారు. ఇలా మండటం వల్ల అది కక్ష్య నుంచి 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది. ఈ సంఘటన వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని నాసా, రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ ఆర్ఐఎ తెలిపింది. నాసా బోయింగ్ కొత్త సీఎస్ టి-100 స్టార్ లైనర్ క్యాప్సూల్ నేడు(జూలై 30) ఐఎస్ఎస్ తో కనెక్ట్ కావాల్సి ఉండేది. కానీ, ఈ సమస్య వల్ల ఆ ప్రయోగాన్ని ఆగస్టు 3 వరకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 25 టన్నుల "నౌకా" అనే కొత్త మాడ్యూల్ ను రష్యా కజకిస్తాన్ లోని బైకనూర్ నుంచి లాంచ్ చేసింది. అది నిన్న(జూలై 29)న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానితో అనుసంధానం అయ్యే సమయంలో అందులో స్వయం చాలక వ్యవస్థ పనిచేయక పోవడంతో రష్యాకు చెందిన ఒలేగ్ నోవిట్స్కీ వ్యోమగామి ఆ ప్రక్రియను మాన్యూవల్ గా చేపట్టారు. మొత్తం ఈ ప్రక్రియ పూర్తయిన 3 గంటల తర్వాత నౌకా మాడ్యూల్ జెట్ థ్రస్టర్లు ఒక్కసారిగా మండటంతో అది అదుపు తప్పింది. కొద్ది సేపటి వరకు భూమితో ఐఎస్ఎస్ కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఐఎస్ఎస్ భ్రమణం సెకనుకు అర డిగ్రీ చొప్పున మారింది. అలాగే, మరో 12 నిమిషాలు కనుక జరిగి ఉంటే పూర్తి వ్యతిరేక దిశలో వచ్చేది అని శాస్త్రవేత్తలు చెప్పారు. టగ్ ఆఫ్ వార్ అయితే, కక్ష్యలో ఉన్న ప్లాట్ ఫామ్ లోని మరో మాడ్యూల్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయడం ద్వారా నాసా బృందాలు స్పేస్ స్టేషన్ ఓరియెంటేషన్ ను పునరుద్ధరించగలిగినట్లు అధికారులు తెలిపారు. అంతరిక్ష కేంద్రంపై నియంత్రణను తిరిగి పొందడానికి రెండు మాడ్యూల్స్ మధ్య జరిగిన పోరాటాన్ని "టగ్ ఆఫ్ వార్"గా నాసా అభివర్ణించింది. అంతరాయం సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు అనేక నిమిషాలపాటు కోల్పోయినట్లు, "సిబ్బందికి ఏ సమయంలోనూ ప్రమాదం జరగలేదు" అని మోంటాల్బానో తెలిపారు. వ్యోమగాములకు అక్కడి నుంచి రక్షించాల్సిన అవసరం వచ్చి ఉంటే, ఐఎస్ఎస్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సూల్ ను "లైఫ్ బోట్"గా రూపొందించినట్లు నాసా వాణిజ్య సిబ్బంది కార్యక్రమం మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు -
రష్యాలో మరో ఆత్మాహుతి దాడి
మాస్కో: రష్యాలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం నాటి ఆత్మాహుతి దాడి నుంచి తేరుకోకముందే.. అదే వోల్గోగ్రాడ్ నగరంలో సోమవారం బస్సులో ఓ ఆగంతకుడు తనను తాను పేల్చేసుకున్నాడు. తాజా దాడిలో 14 మంది మృత్యువాత పడగా.. మరో 28 మంది గాయపడ్డారు. ఉదయం పూట కావడంతో ట్రాలీ బస్సు కిక్కిరిసిపోయి ఉన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందుభాగం, రూఫ్ మాత్రమే మిగిలాయంటే పేలుడు తీవ్రంత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. డీఎన్ఏ నమునాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. పేలుడు కోసం నాలుగు కేజీల టీఎన్టీని ఉపయోగించారని చెప్పారు. ఆదివారం నాటి బాంబు దాడిలో వినియోగించిన పేలుడు పదార్థాల వంటివే తాజా పేలుడులో కూడా ఉపయోగించినట్టు గుర్తించామన్నారు. ఆదివారం వోల్గోగ్రాడ్లోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 17 మంది మృతి చెందడం తెలిసిందే. -
రష్యా రైల్వే స్టేషన్లో ఆత్మాహుతి దాడి
మాస్కో: 2014-ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న రష్యాలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. ఉత్తర కౌకాసస్ ప్రాంతంలోని వోల్గోగ్రాడ్ నగరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద ఓ మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆదివారం మధ్యాహ్నం తనను తాను పేల్చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా దాదాపు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్టు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ అధికారులు వెల్లడించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పేలుడు జరిగిన స్టేషన్‌కి వింటర్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న సోచి నగరం సమీపంలో ఉండడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కాగా, ఈ పేలుడు వెనుక ఉగ్రవాద చర్య ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.