1500 మంది రుత్వికులతో చండీయాగం
మెదక్: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత మహా చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ యాగాన్ని 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో ఈ యాగం జరగనుంది.
ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు సిద్ధమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు(సోమవారం) విజయవాడ వెళ్లనున్నారు. చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్ ఆహ్వానించనున్నారు.