1500 మంది రుత్వికులతో చండీయాగం | Chandi yagam to be observed by 1500 Ruthiviks | Sakshi
Sakshi News home page

1500 మంది రుత్వికులతో చండీయాగం

Published Sun, Dec 13 2015 11:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

మెదక్‌:  మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత మహా చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్‌ జిల్లాలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ యాగాన్ని 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో ఈ యాగం జరగనుంది.

ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు సిద్ధమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ రేపు(సోమవారం) విజయవాడ వెళ్లనున్నారు. చండీయాగానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement