
చండీయాగంలో చంద్రబాబు
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్నారు.మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబుతో పాటు మంత్రులు సుజనాచౌదరి, కేఈ కృష్ణ మూర్తి, గంటా శ్రీనివాస్లు ఎర్రవల్లికి చేరుకున్నారు. బెజవాడ దుర్గమ్మ చీర, కుంకుమ, ప్రసాదాలను చంద్రబాబు తన వెంట తీసుకొచ్చారు. చంద్రబాబును ఆయుత చండీయాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ విజయవాడకు వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆదివారం చివరిరోజు ఆయుత చండీయాగం కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఎర్రవల్లి చేరుకున్నారు.