S P Balasubrahmanyam
-
SP బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటి పాట ఇదే
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం
-
నీ పాట మిగిలే ఉంది!
-
సినీ మ్యుజిషియన్స్ స్వరసంగమం
-
స్క్రీన్ ప్లే 8th August 2018
-
రాయల్టీపై గళమెత్తిన తెలుగు సినీ గాయని గాయకులు
-
ఎప్పుడో రిటైర్ అయ్యేవాడిని: ఎస్పీ బాలు
సాక్షి, హైదరాబాద్ : రాయల్టీ చట్టంపై గాయనీ గాయకులంతా అవగాహన కలిగివుండాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోరారు. పాటలపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్ మాత్రమే ఒప్పందంలో రాయల్టీ కుదుర్చుకునేవారని వివరించారు. కానీ, 2012లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులు అందరికీ పాటలపై హక్కులు కల్పిస్తోందని వెల్లడించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. అనంతరం ఎస్పీ బాలు మీడియాతో మాట్లాడారు. గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. సినిమా పాటలకు సంబంధించి నాకు ఒక్క రూపాయి రాయల్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ట్ అయ్యేవాడినని అన్నారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకుల నాణ్యమైన వాటా చెల్లించాలని చెప్పారు. రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని వివరించారు. దాదాపు 410 మంది సింగర్లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందని వెల్లడించారు. ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకోని చేయాలని తెలిపారు. లేకపోతే దానిపై లీగల్గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని తెలిపారు. అయితే, ఇందుకు సదరు సింగర్ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు. -
గాన గంధర్వుడు రిటైర్ అవుతున్నారా?
హైదరాబాద్: గానగంధర్వుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయిదు దశాబ్దాల సుదీర్ఘ కరియర్కు ముగింపు పలకబోతున్నారా? పాటల పల్లకీలో ఊరేగుతూ 49 సం.రాల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాన్ని రేకిత్తిస్తోంది. పాటలకు న్యాయం చేయలేను అని అనిపించినపుడు పాటలు పాడటం నిలివేయాలని భావిస్తున్నానంటూ బాలూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పాటలు పాడేందుకు భౌతికంగా,మానసికంగా తన బలం సరిపోదన్నారు. సామర్ధ్యం లేనపుడు.. పరిశ్రమను ఇంకా పట్టుకొని వేలాడం సముచితం కాదని పేర్కొన్నారు. జీవితంలో అన్ని అవకాశాలు అడగక్కుండానే వచ్చి వరించాయన్నారు. సుదీర్ఘ కాలం సినీ కళామతల్లికి సేవ చేసే అదృష్టం కలిగడం చాలా సంతోషంగా ఉందని ఇక తనకు ఎలాంటి కోరికలు లేవని తెలిపారు. రోజుకు 11గంటలకు పనిచేస్తూ.. ప్రతీరోజు ఒక సవాల్గా స్వీకరించానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తెలుగు సినీ నేపథ్యగాయకుడిగా తెరపైకి వచ్చిన ఆయన ప్రస్థానంలో ఎక్కడా వెనకడుగులేదు. హీరోలకు, నటులకు అనుగుణంగా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టు కోవడం ఆయన ప్రత్యేకత. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు వారి మదిలో బాలుగా మిగిలిన లెజెండ్ ఆయన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,తులు, హిందీ, ఇంగ్లీషు, లాంటి దాదాపు 15 భాషల్లోగానస్వరాలను ప్రేక్షకులకు అందించి, ఎన్నో అభినందనలను, అవార్డు, రివార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగానూ, సంగీత దర్శకుడిగాను పనిచేసి ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు. బాలుకి 29 సార్లు నంది అవార్డులు, కలైమామణి, విశ్వగానయోగి, నాదనిధి, గానగంధర్వ వంటి బిరుదులను పొందారు. 2001వ సంవత్సరంలో పద్మశ్రీ, 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు ఆయను వరించాయి. ప్రముఖ హిందీ గాయకుడు మహ్మద్ రఫీ తన అభిమాన గాయకుడనీ, ఆ లెజండ్రీ గాయకుడినుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువుగారు కోదండిపాణికి ఆజన్మాంతం రుణపడి వుంటానన్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించకపోవడం తన జీవితంలో తీరని లోటని బాలు పేర్కొన్నారు. -
దక్షిణాఫ్రికాలో అస్వస్థతకు గురైన ఎస్పీ బాల సుబ్రమణ్యం
దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దక్షిణాఫ్రికాలోని జోహనెస్ బర్గ్ లో జరిగిన ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న బాలు వెంటనే ఆనారోగ్యానికి గురయ్యారు. బాలు అనారోగ్యానికి సంబంధించిన విషయాలను నిర్వహకులు వెల్లడించడానికి నిరాకరించారు. అయితే ఆయనను హైదరాబాద్ కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన పాల్గొనాల్సిన డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేశారు.భారత, దక్షిణాఫ్రికాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచాడనికి తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.