Sachin Kumar
-
అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం
ముంబై : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బంధువు సచిన్ కుమార్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. బుధవారం(మే13)న ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న రెండు రోజులకే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సచిన్.. అక్షయ్ కుమార్‌కు బంధువు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా. సచిన్ మరణ వార్త వినడంతో అక్షయ్ కుమార్ కుటుంబం అక్కడికి చేరుకుంది. సచిన్ మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం ప్రకటించారు .ఆయన మరణాన్ని అతని స్నేహితుడు రాక్శ్ పాల్ ధ్రువీకరించాడు. సచిన్ మరణ వార్త వినగానే షాక్‌కు గురయినట్లు ఆయన తెలిపారు. ఆయన మరణం హృదయ విదారకమని, తమకు ఎంతో లోటును మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలిపారు. (ఈ బర్త్‌డే బాయ్‌ను గుర్తు పట్టారా ! ) ఏక్తా కపూర్ నటించిన 'కహానీ ఘర్ ఘర్ కీ' సినిమాలో సచిన్ కుమార్ హారోగా నటించారు. అనంతరం ఫోటో గ్రాఫర్‌గా మారి నటనకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం సచిన్ తలుపు తీయకపోవడంతో.. కుటుంబ సభ్యులు బయపడి తలుపు తీయడంతో అప్పటికే ఆయన కుప్పకూలిపోయి ఉన్నారు. అయితే వెంటనే ఆసుపత్రకి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. (ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా ) -
క్వార్టర్ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సచిన్ కుమార్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనీశ్ 5–0తో చు ఎన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో ఒమర్బెక్ బెక్జిగిట్ యులు (కిర్గిస్తాన్)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్ ఓడించాడు. -
సచిన్ కుమార్ సెంచరీ వృథా
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో పి.ఎన్.యంగ్‌స్టర్స్ 2 వికెట్ల తేడాతో ఆడమ్స్ ఎలెవన్‌పై గెలిచింది. ఆడమ్స్ బ్యాట్స్‌మెన్ సచిన్ కుమార్ (101), జయంత్ (80)లు వీరవిహారం చేసినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీలక్ష్యాన్ని నిర్దేశించలేకపోవడంతో ఓటమి ఎదురైంది. మొదట ఆడమ్స్ జట్టు 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. సచిన్ సెంచరీతో కదంతొక్కాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పి.ఎన్.యంగ్‌స్టర్స్ 35.3 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోరుు 252 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శ్రీకాంత్ (96) మెరుపు ఆరంభాన్నివ్వ గా, నరసింహ (51), హసీబ్ (41) రాణించారు. ఆడమ్స్ బౌలర్లలో దుర్గేశ్ 3, మాజిద్ 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో సీకే బ్లూస్ బౌలర్ అశ్వద్ రాజీవ్ (6/18) ధాటికి సఫిల్‌గూడ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. దీంతో సీకే బ్లూస్ జట్టు 254 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట సీకే బ్లూస్ 347 పరుగుల వద్ద ఆలౌటైంది. సుశాంత్ (110), సాయి సుశాంత్ (81), బాలకృష్ణ (56 నాటౌట్) చెలరేగారు. తర్వాత సఫిల్‌గూడ 93 పరుగులకే కుప్పకూలింది. అశ్వద్ రాజీవ్ 6, ప్రతీక్ 3 వికెట్లు తీశారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ స్కోర్లు క్లాసిక్ సీసీ: 36 (మహతాబ్ అలమ్ 6/20), డబ్ల్యూ ఎంసీసీ: 152/8 (అజయ్ సింగ్ 81 బ్యాటింగ్; నాగ నరసింహ 5/60). ఎంసీసీ: 82 (ఫాతిమా రెడ్డి 5/17), తెలంగాణ సీసీ: 356/2 (ఫాతిమా రెడ్డి 55, రాకేశ్ నాయక్ 159, రాహుల్ 119 బ్యాటింగ్). గ్రీన్‌టర్ఫ్: 265/9 డిక్లేర్డ్ (ఓవైస్ అబ్దుల్ వాహిద్ 37, సయ్యద్ షాబాజుద్దీన్ 51, అక్షయ్ కుమార్ 65; ఆశిష్ బాలాజీ 4/50), పీకేఎంసీసీ: 100/6 (వివేకానంద్ 44; త్రిశాంత్ గుప్తా 3/36). చీర్‌ఫుల్ చమ్స్: 256/9 డిక్లేర్డ్ (అభిషేక్ 31, సాయి ప్రఫుల్ 78, మోహన్ కుమార్ 50; అక్తర్ 3/34, నితీశ్ కుమార్ 4/102), ఎలిగెంట్ సీసీ: 58/3 (నిఖిల్ రెడ్డి 31). దక్కన్ బ్లూస్: 71 (సుమిత్ జోషి 3/10), నేషనల్ సీసీ:181/9 (సారుురాజ్ 78, వరుణ్ రెడ్డి 43 బ్యాటింగ్; సంపత్ కుమార్ 4/58). -
సచిన్ కుమార్ కు ఐదేళ్ల జైలు
న్యూయార్క్: అమెరికాలో ఆన్ లైన్ మోసానికి పాల్పడిన భారతీయ విద్యార్థి ఒకరు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. నిందితుడు సచిన్ కుమార్(22) స్టబ్ హబ్ వెబ్ సైట్ లో మారు పేర్లతో నకిలీ ఈవెంట్ టికెట్లు అమ్మి సొమ్ములు చేసుకున్నట్టు విచారణలో రుజువైంది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ తంపాలో ప్రీ-డెంటల్, బయాలజీ చదువుతున్న కుమార్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మడం ద్వారా అతడు 49,121 డాలర్లు దక్కించుకున్నాడు. బాధితులకు న్యాయం చేసేందుకు స్టబ్ హబ్ 172,047 డాలర్లు చేయాల్సివచ్చింది. ఈ కేసులో తెర వెనుక మరికొందరి హస్తం ఉందని, కుమార్ కేవలం పాత్రధారుడు మాత్రమేనని అతడి లాయర్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. కారు ప్రమాదంలో అతడు గాయపడడంతో అతడికి జైలు శిక్ష అమలు చేయలేదు. కోలుకున్న తర్వాత జైలు శిక్ష గురించి చెప్పనున్నారు.