ప్యారడైజ్లో టిఫిన్ తిని, ఛాయ్ తాగిన సచిన్
హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్లో ఆయన టిఫిన్ తిని, ఇరానీ ఛాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సచిన్ ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం. కాగా సచిన్ను చూసేందుకు ప్యారడైజ్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, సామాన్యులు బారులు తీరారు.
ఈ సందర్భంగా అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్ ఫోన్లలో సచిన్ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఇక గతంలో రాహుల్ గాంధీ కూడా హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితరులు ఈ బిర్యానీని రుచి చూసినవారే.