సదావర్తి సత్రం భూ కుంభకోణాలపై పీసీసీ కమిటీ
హైదరాబాద్: అమరావతిలోని సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన భారీ కంభకోణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వాస్తవాలను సేకరించి అక్రమాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కాంగ్రెస్ పార్టీకి కమిటీ నివేదిక ఇవ్వనుంది. కమిటీలో రామచంద్రయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీ, పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ, ప్రధాన కార్యదర్శి పాకల సూరిబాబు ఉన్నారు.