ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ: షాదారా బీజేపీ ఎమ్మెల్యే జితేంద్రసింగ్ షంటీపై గుర్తుతెలియని వ్యక్తి బుధవారం పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అరుుతే బుల్లెట్లు ఆయనకు చాలా సమీపం నుంచి మాత్రమే దూసుకుపోవడంతో షంటీ ఎలాంటి గాయూలూ కాకుండా తప్పించుకోగలిగారు. తూర్పు ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఇంటి బయట 5.30 సమయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సంఘటన సీసీ టీవీల్లో రికార్డయ్యిది. పోలీసుల కథనం ప్రకారం.. షంటీ నివాసానికి హెల్మెట్‌తో వచ్చిన ఓ వ్యక్తి.. అతి సమీపం నుంచి మూడు, నాలుగుసార్లు కాల్పులు జరిపి పరారయ్యూడు. అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేకు బుల్లెట్లు తగలకపోవటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హెల్మెట్ ధరిం చి ఉండటంతో ఆ వ్యక్తి ఎవరో తాను గుర్తుపట్టలేక పోయూనని పోలీసులకు ఎమ్మెల్యే చెప్పారు.