Safe Zone
-
Hyderabad: సిటీకేమీ ప్రమాదం లేదు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఎవరిని కదిపినా భూకంపం గురించే చర్చించుకున్నారు. అయితే.. హైదరాబాద్ ఉన్న లొకేషన్‌ను బట్టి ఈ ప్రాంతంలో అసలు భూకంపం వచ్చే పరిస్థితి ఉండదని కొందరు అంటున్నారు. కాగా.. మరి బుధవారం భూకంపం కొద్దిసేపు ఎందుకు వచి్చందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మన దగ్గర చాలా అరుదుగా మాత్రమే సంభవించే భూకంపం వెనుక కారణాలేమిటి? అనే అన్వేషణలో పడ్డారు జియోలజిస్టులు.మనం రక్షణ వలయంలోనే ఉన్నామా? భూకంపాల ఫ్రీక్వెన్సీని బట్టి దేశంలో జోన్ 2 నుంచి 5 వరకు నాలుగు సెస్మిక్ జోన్లుగా విభజించారు. చాలా తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాలను జోన్–2గా పేర్కొంటారు. ప్రమాదకరమైన ప్రాంతాలను జోన్–5 కింద చేర్చారు. తెలంగాణ మొత్తం జోన్– 2 కిందకు వస్తుంది. అంటే మన దగ్గర భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. పైగా ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ సముద్ర మట్టానికి దాదాపు 542 మీటర్ల ఎత్తులో ఉంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు.ఆ ప్రాంతాలపై ప్రభావం.. మేడారం సమీపంలో వచ్చిన భూకంపం ఎపిసెంటర్ 40 కిలోమీటర్ల లోతు వద్ద ఏర్పడటంతో.. దాని ప్రభావం కాస్త హైదరాబాద్ చుట్టుపక్కల పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. బంజారాహిల్స్ వంటి ప్రదేశాలు 640 మీటర్ల ఎత్తులో ఉండగా, సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న ఉప్పల్, మేడ్చల్, దిల్సుఖ్నగర్, ఓల్డ్ సిటీ (456 మీటర్లు), మూసీ పరీవాహక ప్రాంతాల్లో భూకంపం వచి్చనట్టు విశ్లేషిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ తీవ్రతతో కంపించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.శిలల సిరి.. భాగ్య నగరి.. భాగ్యనగరానికి గొప్ప అది్వతీయమైన లక్షణం ఉంది. అదేమిటంటే నగరం మొత్తం శిలలలో నిర్మితమైంది. దాదాపు 2,500 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడిన ఈ రాళ్లు ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన, అతి బలమైనవిగా పేరుగాంచాయి. సెస్మిక్ జోన్–2 కింద ఉండటంతో భూకంపాల విషయానికొస్తే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా చెబుతుంటారు. దీంతో తాజాగా వచ్చిన భూకంపంతో భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మేడ్చల్‌లో 2 సెకన్ల పాటు.. మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7.25 నిమిషాలకు వివిధ కాలనీల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. పలు కాలనీల్లో భూ కంపం తీవ్రత సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అధికారులు మాత్రం అధికారికంగా భూకంపంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు.తార్నాకలోనూ.. లాలాపేట: తార్నాక సండే మార్కెట్, గోకుల్‌నగర్ తదితర కాలనీలో కొందరి ఇళ్లలో వస్తువులు కొన్ని సెకన్ల కదిలాయి. భూకంపం సంభవించినట్లు గ్రహించి కొంత ఆందోళన చెందామని ప్రజలు తెలిపారు. రాజేంద్రనగర్‌లో.. రాజేంద్రనగర్: స్వల్ప భూకంపంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఉలిక్కి పడ్డారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్ల పాటు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపాన్ని కిస్మత్పూర్, కాటేదాన్, రాజేంద్రనగర్‌లోని పలు ప్రాంతాల ప్రజలు ప్రత్యక్షంగా చూసి అయోమయానికి గురయ్యారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ లేకపోవడంతో భయాందోళన చెందారు.ఉలిక్కిపడి.. పరుగులు తీసి.. ఎల్బీనగర్: నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాలలో బుధవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. పలు కాలనీల్లో ప్రజలు భయపడి ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సూర్యోదయ కాలనీ, బంజారా కాలనీల్లో భూమి సుమారు 5 సెకన్ల పాటు కంపించిందని స్థానికులు చెప్పారు. హయత్‌నగర్‌తో పాటు హస్తినాపురం జెడ్పీ రోడ్డులో, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కుర్చీ ఊగింది.. హయత్‌నగర్ సూర్యోదయ కాలనీకి చెందిన వీరస్వామి బుధవారం తన క్లినిక్‌లో కురీ్చలో కూర్చుని ఉండగా ఉదయం 7.28 గంటల సమయంలో 5 సెకన్ల పాటు భూమి కంపించిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే క్లినిక్ నుంచి బయటికి వచ్చానని వీరస్వామి పేర్కొన్నారు. వంటింట్లో కదలిన వస్తువులు.. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో మంచం ఊగింది. వంటింట్లో వస్తువులు కదులుతున్నాయని మా ఆవిడ తెలపడంతో వెంటనే బయటికి వచ్చేశా. సీసీ కెమెరాలను పరిశీలించగా భూకంపం అని తెలిసింది. – బాలు నాయక్, బంజారా కాలనీ, హయత్‌నగర్ -
Israel-Hamas war: ఆగని దారుణ దాడులు
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం. దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. -
వైజాగ్ @ సేఫ్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. రాత్రంతా కురిసిన భారీ వర్షంతో భారంగా నిద్రలేస్తున్న వేళ.. ఒక్కసారిగా అలజడి... సరిగ్గా ఉదయం 7.13 గంటలకు భారీ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడిన ప్రజలు.. 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో బయటికి వచ్చారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలి కంటే వేగంగా.. వైజాగ్‌లో భూకంపం అనే వార్త దావానలంలా వ్యాపించింది. అయితే.. విశాఖలో భూకంపాల వచ్చే తీవ్రత అత్యంత స్వల్పమని.. ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు! రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుంది. భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో సమస్యలు ఏర్పటంతో ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడతాయి. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం అధికంగా ఉంటుంది. జోన్–2లో విశాఖ జిల్లా.. భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలను జోన్లలో విభజిస్తారు. జోన్–1 అంటే చిన్న స్థాయి ప్రకంపనలు కూడా వచ్చే శాతం అతి స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–2లో స్వల్ప ప్రకంపనలు వస్తాయని.. జోన్–3లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–4లో భారీగా ప్రమాదం ఉంటుందని విభజించారు. విశాఖ జిల్లా భూకంపాల విషయంలో జోన్–2 (లో రిస్క్ ఏరియా)లో ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 1967 మార్చి 27న ఒంగోలులో నమోదైన 5.4 తీవ్రత ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. అది కూడా రిక్టర్ స్కేలుపై 6 దాటలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. 200 ఏళ్లలో ఐదు సార్లు మాత్రమే.. విశాఖలో ప్రకంపనలు రావడం అత్యంత అరుదుగా చరిత్ర చెబుతోంది. గత 200 ఏళ్ల కాలంలో కేవలం 7 సార్లు మాత్రమే భూ ప్రకంపనలు విశాఖలో వచ్చాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో అత్యధికం 4.3 కాగా.. అత్యల్పం ఆదివారం వచ్చిన 1.8 కావడం గమనార్హం. భూ ప్రకంపనలు చివరిసారిగా 1984లో వచ్చినట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో ప్రకంపనలు ఎందుకు..? విశాఖపట్నం ప్రాంతంలో ప్రీ కేంబ్రియన్ అనే కాలానికి చెందిన రాళ్లు ఉన్నాయి. ఇవి 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. భూ అంతర్భాగంలో ఉన్న రాళ్లు చోర్నకైట్ అనే శిలలు ఒక పగులు ద్వారా వ్యాపించాయి. మధురవాడ, మద్దిలపాలెం, సిరిపురం, గవర్నరు బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్, నీలమ్మ వేపచెట్టు, జ్ఞానాపురం, ఎన్ఏడీ, ఎయిర్‌పోర్టు, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి వరకు ఈ శిలలు వ్యాపించాయి. సముద్రంలోకి కొంత భాగం కూడా చోర్నకైట్ శిలలున్నాయి. ఈ శిలలు అప్పటికే ఉన్న ఖోండలైట్ శిలల్లోకి చొచ్చుకొని వచ్చి రూపాంతరం చెందాయి. ఈ విధంగా చొచ్చుకొని రావడం వల్ల టెక్టానికల్లీ వీక్ జోన్(సున్నితమైన ప్రాంతం)గా భౌగోళికంగా చెబుతారు. ఈ చోర్నకైట్ శిలలకు, దాన్ని ఆనుకొని ఉన్న ఖోండలైట్ శిలలకు మధ్య జరిగిన సర్దుబాటు వల్ల ఈ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాల గురించి భయపడొద్దు.. విశాఖ జిల్లా చాలా సురక్షిత ప్రాంతం. జోన్–2 పరిధిలో ఉన్నందువల్ల ఇక్కడ భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ భూ అంతర్భాగంలో అతి పెద్ద రాక్ బ్యారియర్ ఉంది. చోర్నకైట్, ఖోండలైట్ శిలల మధ్య జరిగిన పునఃసర్దుబాటు కారణంగా భారీ శబ్దం ఏర్పడి ప్రకంపనలు వచ్చాయి. పురాతన కాలంలో ఏర్పడడడం వల్ల ప్రస్తుతం ఈ రాక్ జోన్ అంత యాక్టివ్ జోన్ కాదు. విశాఖపట్నంలో ప్రకంపనల వరకే పరిమితం తప్ప భారీగా ఇళ్లు కూలిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి భారీ నష్టం వంటి పరిస్థితులు దాదాపు శూన్యం. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. – ప్రొ.ఎం.జనార్దనరావు, ఏయూ జియాలజీ విభాగం గౌరవ ప్రొఫెసర్, నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి -
ఆడపిల్లకు ‘సేఫ్ జోన్’ లేదు
ధీర దత్ పదేళ్లప్పుడు తనతో తను యుద్ధం. పీజీలో ప్రేమలోంచి బయట పడేందుకు యుద్ధం. జర్నలిస్ట్‌గా అవినీతి, అక్రమాలతో యుద్ధం. వ్యక్తిగతంగా విసుర్లు, విమర్శలతో యుద్ధం. ప్రస్తుతం ఆర్ణబ్ గోస్వామితో మాటల యుద్ధం! వార్ కరస్పాండెంట్ బర్ఖాదత్.. ఎప్పుడూ... ఏదో ఒక వార్ జోన్లో ఉంటూనే ఉంటారు. ఆ మాటే అని చూడండి... ‘అసలు వార్ జోన్లో లేని ఆడపిల్ల ఎవరో చెప్పండి’ అని అడుగుతారు బర్ఖా. బర్ఖాదత్.. ధీర వనిత! ధీర దత్!! ఆడపిల్లకు అమ్మ ఒడి తప్ప ప్రపంచంలో వేరే ‘సేఫ్ జోన్’ లేదు. ఒడిలో ఉన్నంత వరకే అభయం. ఒడి దిగితే అరణ్యం. ఇల్లు, కాలేజ్, కెరియర్... చెడు చూపు ఏ వైపు నుంచి మెల్లిగా చెట్టు దిగి వస్తుందో చెప్పలేం. ఏ పుట్టలోంచి చల్లగా పాక్కుంటూ వస్తుందో కనిపెట్టలేం. ఏ పాతాళంలోంచి పువ్వులా పరిమళమై విరుస్తుందో, ఏ గగనంలోంచి నవ్వులా పరవశమై కురుస్తుందో అస్సలు ఊహించలేం. ప్రభాదత్కి ఇలాంటి భయాలేం లేవు. పిల్లని ఒడిలోంచి తోసేసింది! చెట్టు పుట్టా ఎక్కడం నేర్చుకో. కొండల్నీ గుట్టల్నీ తొలుచుకుంటూ వెళ్లిపో. నింగిలోకి విహంగమై ఎగిరిపో. ఎక్కడా.. నిలవకు, తడవకు, జడవకు. ఇదీ ఆ ఇంట్లో ఫస్ట్ చైల్డ్‌కి ఫస్ట్ లెసన్. ప్రభాదత్ జర్నలిస్ట్. బర్ఖాదత్ కూడా జర్నలిస్టే అయింది. తండ్రిలా ఆమె ఎయిర్ ఫోర్స్‌ని ఎంచుకోలేదు. అన్ని ఫోర్సులను రాత్రీపగలు మునివేళ్లపై నిలిపి ఉంచే మీడియా ఫోర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మీడియాలోనే.. ఒక శక్తిమంతమైన క్షిపణి.. బర్ఘాదత్. ఆ క్షిపణి ఇప్పుడు.. సాటి జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామిపై నిప్పులు కురిపిస్తూ విరుచుకు పడడం దాదాపుగా ఒక యుద్ధవార్తే అయింది. ‘గ్రౌండ్ జీరో’ జర్నలిస్ట్! కేట్ ఆడీ, లిండ్సే హిల్సమ్, అలెక్స్ క్రాఫోర్డ్, ఆర్లా గ్యూరిన్, జీనా కోడర్, మార్తా గెల్హార్న్, బర్ఖాదత్... అంతా ఒకే బెంచ్ స్టూడెంట్స్. ఒకే కాలంలో కాకపోవచ్చు. యుద్ధ కాలాల్లో.. ‘గ్రౌండ్ జీరో’ (విస్ఫోటస్థలి) లోకి వెళ్లి పోయి అక్కడి నుంచి వార్తల్ని ప్రత్యక్షంగా అందించిన మహిళా జర్నలిస్టులు. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ దేశాల మధ్యలోకి వెళ్లి యుద్ధాన్ని కవర్ చెయ్యడానికి గట్స్‌తో పని లేదు. జర్నలిజం మీద భక్తి ఉంటే చాలు. భక్తితో పాటు బర్ఖాకు జర్నలిజంపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. వాటిని శంకిస్తే మాత్రం ఆమె అపరకాళే అవుతుంది. అయింది. ప్రో-పాకిస్థానీ పావురం?! ఆర్ణబ్ గోస్వామి సంగతి తెలిసిందే. ‘టైమ్స్ నౌ’ న్యూస్ రూమ్‌లో రంకెలేస్తూ, డిబేట్ కి వచ్చినవాళ్ల పీక నొక్కేస్తుంటాడు. అరవడం ఆయన యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్). జూలై 8న కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బర్హన్ వాని ఎన్కౌంటర్ జరిగిన తర్వాత టీవీలన్నీ ఎన్‌కౌంటర్‌పై డిబేట్ పెట్టాయి. ఆర్ణబ్ తన డిబేట్లో జర్నలిస్టుల్ని ఉతికేశారు. భారతదేశంలో ఉంటున్న ప్రో-పాకిస్థానీ జర్నలిస్టు పావురాల్ని జైల్లో పడేసి రెక్కలు కత్తిరించేయాలి అనేశారాయన! ఆ మాట ఎన్డీటీవీలో పనిచేస్తున్న బర్ఖాదత్‌కు తగిలింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్ణబ్ పని చేస్తున్న ఫీల్డులోనే తను పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా మాటల వార్ నడుస్తోంది. ‘‘న్యూస్ రూమ్‌లో కూర్చొని చెత్తను పోగేసుకునే నీలాంటి వ్యక్తికి జనం మధ్య తిరిగి వాస్తవాలను చూస్తుండే జర్నలిస్టులను అనే అర్హత లేదు’’ అని ఆర్ణబ్‌పై విరుచుకుపడ్డారు బర్ఖాదత్. బర్హన్ ఎన్కౌంటర్ విషయంలో బర్ఖా మన సైనికుల్ని తప్పుపట్టే విధంగా మాట్లాడారన్నది ఆర్ణబ్ ఆరోపణ. పోరాటమే ఊపిరి రాజకీయ నాయకులతో యుద్ధం. అధికార యంత్రాంగంతో యుద్ధం. అవినీతి, అక్రమాలపై యుద్ధం. అప్పుడప్పుడు ఆర్ణబ్లాంటి వాళ్లతో యుద్ధం. ఆ యుద్ధంలో ఆమె గెలిచారా లేదా అన్నది కాదు, పోరాడారా లేదా అన్నదే ముఖ్యం. బర్ఖా పోరాట యోధురాలు. ఆమె దేశభక్తిపై అనుమానాలు రేకెత్తించడానికి, ఆమె శీల ప్రతిష్టను భంగపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు బర్ఖా. రెండేళ్ల క్రితం ఆమెపై ఒక రూమర్ వచ్చింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, వాళ్లిద్దరూ కశ్మీర్ ముస్లింలని! బర్ఖా వాటిని పట్టించుకోలేదు. తనతో తను తొలి యుద్ధం! పట్టించుకోకుండా ఉండడానికి కూడా ఒకోసారి పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వస్తుంది! ప్రత్యర్థులను, విరోధులను, పనిలేనివాళ్లను తన మాటలతో, తన నిర్లక్ష్యంతో, తన పరిణతితో తేలిగ్గా మట్టి కరిపించగల బర్ఖా.. బాల్యంలో ఒక్క విషయంలో మాత్రం తనతో తనే తలపడలేకపోయారు! అప్పుడు తనకు పదేళ్లు. పదేళ్లు కూడా ఉన్నాయో లేవో. ఆ సంఘటన మాత్రం బర్ఖాకు బాగా గుర్తుంది. అత్తయ్యలు, మామయ్యలు; పిన్నమ్మలు, బాబాయిలు; బంధువులు, స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు... పంజాబీ ఇళ్లల్లో సందడికి కొదవేముంది? ఆ బంధువుల్లో.. ఓ ‘మంచి మామయ్య’ బర్ఖాను ఒకరోజు ఆడుకుందాం రమ్మని తన గదికి తీసుకెళ్లి మీద చెయ్యి వేశాడు. బ్యాడ్ టచ్కీ, గుడ్ టచ్కీ తేడా తెలియని వయసు. కానీ ఆ టచ్‌లో అసహజత్వం ఉందని మాత్రం బర్ఖాకు అర్థమవుతోంది. మంచి మామయ్య ఏదో డర్టీ పని చేస్తున్నాడు. భయపడిపోయింది. అక్కడి నుంచి పరుగెత్తింది. ఆ తర్వాత ఆ మంచి మామయ్య దగ్గరికి వెళ్లలేదు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. అలాగని ఆ ‘డర్టీ’ నుంచి తనూ బయటికి రాలేదు. తనేదో తప్పు చేసిన ఫీలింగ్! కొన్నేళ్ల పాటు ఆ ఫీలింగ్ బర్ఖాను వెంటాడింది. ఎంతవరకు అంటే... ఇంకో డర్టీ ఫెలో ఆమె జీవితంలోకి ప్రవేశించేంత వరకు. కాలేజ్‌లో... ప్రేమ వయెలెన్స్ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో మూస్ కమ్యూనికేషన్ పీజీ కోర్సులో చేరింది బర్ఖా. అప్పటికామె పరిపూర్ణమైన స్త్రీ. తన జీవితం ఎలా ఉండాలన్న దానిపై ఆమెకు స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒక్కమాటలో... లోకం తెలిసిన పిల్ల. అప్పుడొచ్చాడు కో-స్టూడెంట్ ఒకడు. వచ్చి, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అన్నాడు. అంత లోకాన్ని చూసిన పిల్ల, అన్ని పుస్తకాలను చదివిన పిల్ల.. అతడి ప్రేమలో పడిపోయింది! తర్వాత అతడు బర్ఖాను సాధించడం మొదలు పెట్టాడు. ఓరోజు చెంప పగలగొట్టాడు. చెయ్యి మెలితిప్పాడు. కిందపడేసి, తలను నేలకేసి కొట్టాడు! ఇదంతా కాలేజ్‌లోనే. కాలేజ్‌లో డొమెస్టిక్ వయలెన్స్! ఎలాగో అతడిని వదిలించుకుంది. పీజీ అయ్యాక ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి వెళితే.. అక్కడికి అతడు కూడా వచ్చాడు! కెమెరామెన్‌గా అప్లై చేశాడని తెలిసింది బర్ఖాకు. ‘అతడికి ఉద్యోగం ఇచ్చేపనైతే.. నేనిక్కడ ఉద్యోగం చెయ్యాల్సిన పని లేదు’ అని గట్టిగా చెప్పేసింది బర్ఖా. ఆమె కోసం అతడిని వద్దనుకుంది ఎన్డీటీవీ. ప్రతి ఆడపిల్లా ఒక యోధురాలు ఆడపిల్ల జీవితమే ఒక యుద్ధం అంటారు బర్ఖాదత్. ఆమె ఉద్దేశం.. పరిస్థితులు స్త్రీని యుద్ధ సైనికురాలిగా మార్చేస్తాయని. దేశాలకు యుద్ధాలు రావచ్చు రాకపోవచ్చు. హద్దుల్ని చెరిపేసుకుంటే, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నంలో స్త్రీ.. బాల్యంలో, యవ్వనంలో, ఆ తర్వాత కూడా యుద్ధం చేస్తూనే ఉండాల్సి వస్తుందని చెప్పడానికి బర్ఖా జీవితం ఒక నిదర్శనం. రచనలు బర్ఖాదత్ 2015లో ‘ది అన్‌క్వైట్ లాండ్’ అనే పుస్తకం రాశారు. భారతదేశపు తప్పొప్పులపై రిపోర్టర్‌గా బర్ఖా పరిశీలన, విశ్లేషణల సంకలనం ఈ పుస్తకం. అంతకుముందు 2002 నాటి గుజరాత్ అల్లర్లపై ప్రముఖ ఇండో-అమెరికన్ జర్నలిస్టు రాసిన ‘గుజరాత్: ది మేకింగ్ ఆఫ్ ట్రాజెడీ’ పుస్తకంలో బర్ఖా.. ‘నథింగ్ న్యూ?: ఉమెన్ యాజ్ విక్టిమ్స్’ అనే విమర్శనాత్మక అధ్యాయం రాశారు. విమర్శలు, వివాదాలు 2008లో ముంబై దాడుల ప్రత్యక్ష వార్తాసేకరణకు (లైవ్ కవరేజీకి) వెళ్లినప్పుడు బర్ఖాదత్ అక్కడి తాజ్‌మహల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లలో బస చేసిన కొందరిని ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రత్యక్షసాక్షులుగా టీవీలో చూపించి, వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా రిపోర్టింగ్‌ను సంచలనాత్మకం చెయ్యడం ఆమెపై విమర్శలకు దారితీసింది. పనులు నడిపించడంలో మోరుమోసిన లాబీయిస్టు నీరా రాడియాతో 2జి స్ప్రెక్ట్రమ్ అమ్మకాలకు సంబంధించి సంభాషణ జరిపిన వారిలో బర్ఖా దత్కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించడంతో బర్ఖా దత్ తను నిర్దోషినని నిరూపించుకోవలసి వచ్చింది. బర్ఖాదత్ - బాలీవుడ్ బర్ఖాదత్ స్ఫూర్తితో బాలీవుడ్లో ‘లక్ష్య’, ‘ఫిరాక్’, ‘పీప్లీ లైవ్’, ‘నో వన్ కిల్డ్ జెస్సీకా’ చిత్రాలు వచ్చాయి. మలయాళంలో వచ్చిన ‘కీర్తిచక్ర’ చిత్రంలోని జర్నలిస్ట్ పాత్రకు కూడా బర్ఖానే ప్రేరణ. అవార్డులు: పద్మశ్రీ, అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, ఇండియన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, కామన్వెల్త్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్ అవార్డ్. బర్ఖా దత్ (44), టీవీ జర్నలిస్ట్ జననం : 18 డిసెంబర్ 1971 జన్మస్థలం : న్యూ ఢిల్లీ తల్లిదండ్రులు : ఎస్.పి.దత్ (ఎయిర్ ఇండియా అధికారి){పభాదత్ (హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్) తోబుట్టువు : బహర్ దత్ (చెల్లెలు) (సి.ఎన్.ఎన్.-ఐ.బి.ఎన్. జర్నలిస్ట్) చదువు : ఇంగ్లిష్ లిటరేచర్ (డిగ్రీ) ఢిల్లీ మాస్ కమ్యూనికేషన్ (రెండు పీజీలు) జామియా మిల్లియా, కొలంబియా కెరీర్ ప్రారంభం : ఎన్డీటీవీతో. ప్రస్తుతం : ఎన్డీటీవీలోనే న్యూస్ యాంకర్, కన్సల్టింగ్ ఎడిటర్ ప్రతిష్ట : కార్గిల్ యుద్ధక్షేత్రంలో రిపోర్టింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రాతో ఇంటర్వ్యూ (కశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధక్షేత్రాల రిపోర్టింగ్) వైవాహిక స్థితి : అవివాహిత -
సార్..తప్పుకున్నారు!
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఈ సామెత కందుకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అతికినట్లు సరిపోతుంది. పోలీస్‌శాఖలో ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. బాస్ చెప్పింది వినకుంటే ఆయన నుంచి కక్ష సాధింపు చర్యలు.. వింటే ఆయనపై స్థాయి అధికారుల పనిష్మెంట్లు. ఫలితంగా ఉద్యోగాలు చేయలేక కిందిస్థాయి సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. కందుకూరు అర్బన్ : నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనలో సర్కిల్ స్థాయి అధికారి చేసిన తప్పుకు ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వీరిని వీఆర్‌కు పంపి సదరు అధికారిని సేఫ్ జోన్లో ఉంచారు. వివరాలు.. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటట్లో పీర్ల చావిడికి చెందిన ప్రభుత్వ భూమి ఉంది. రూ. కోట్లు విలువ చేసే ఆ భూమిని ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం కబ్జా చేసి కొందరితో చిన్న చిన్న బడ్డీ బంకులు పెట్టించి వారి నుంచి అద్దెలు వసూలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు. పీర్ల చావిడిలోని కొంత భాగం, మున్సిపాలిటీకి చెందిన మరికొంత భాగంలో ఎస్కే మహ్మద్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి బొంకు పెట్టుకొని జీవనం సాగించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం ఆ బొంకు దగ్ధమైంది. ఆ తర్వాత మహ్మద్ అదే ప్రాంతంలో చిన్నపాటి బొంకు పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకుంటూ కొంతకాలం తర్వాత మరణించాడు. ఆయన తర్వాత పెద్ద కొడుకు హమీద్(వికలాంగుడు) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటివల ఆ బొంకుకు హమీద్ మరమ్మతులు చేయించుకున్నాడు. దీన్ని సహించలేని సదరు ఆక్రమణదారుడు బాబు ఆ బంకు ఉన్న స్థలం తనదని, న్యాయం చేయాలని ఎస్సై వైవీ రమణయ్యను ఆశ్రయించాడు. దీంతో ఆయన స్థలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. అది ప్రభుత్వ భూమి.. అని రెవెన్యూ అధికారులు చెప్పటంతో సివిల్ కేసులు తమకు సంబంధం లేదని ఎస్సై చెప్పారు. విషయం సర్కిల్ స్థాయి అధికారి వద్దకు చేరింది. తన్నుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఈ సందర్భంగా సదరు అధికారి.. బాబు నుంచి ఫిర్యాదు కూడా స్వీకరించకుండా హమీద్, ఆయన తమ్ముడు అబీద్ను స్టేషన్‌కు పిలిపించి స్థలం తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇలా ఏడు సార్లకుపైగా స్టేషన్‌కు పిలిపించుకొని గంటల తరబడి ఉంచారు. నాలుగు రోజల క్రితం హమీద్‌ను తీసుకురావాలని తన సిబ్బందిని సదరు అధికారి అదేశించారు. దీంతో హోంగార్డు వినయ్‌తుల్లా, కానిస్టేబుల్ రమేష్‌లు హమీద్ వద్దకు వెళ్లారు. స్టేషన్‌కు రావాలని కోరగా తాను వికలాంగుడినని, తరచూ స్టేషన్‌కు రాలేనని చెప్పాడు. ఆయన తమ్ముడు అబీద్, రాధకృష్ణ అనే వ్యక్తి కలగజేసుకుని కాసేపటి తర్వాత పెద్దలతో కలిసి స్టేషన్‌కు వస్తామని పోలీసులకు నచ్చజెప్పారు. ఈ మేరకు విషయాన్ని సదరు అధికారికి పోలీసులు ఫోన్లో చేరవేశారు. అక్కడకు చేరుకున్న సర్కిల్ స్థాయి అధికారి అబీద్‌తో పాటు రాధాకృష్ణను కొట్టుకుంటూ తన వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కొట్టేందుకు ప్రయత్నించడంతో అబీద్ పోలీసుస్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు నాయకులు వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం భూమిని అక్రమించిన శ్రీనుకు అండగా నిలిచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా అధికారి స్వయంగా వచ్చి ఇద్దరిని కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడంపై పట్టణ ప్రజల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి. విషయం చినికి చినికి గాలి వానలా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చివరకు కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు వారిని గురువారం వీఆర్‌కు పంపారు. ఏడాది క్రితం ఇదేస్థాయి అధికారి అదేశాల మేరకు పట్టణలోని కేసరిగుంట కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటికి వెళ్లిన సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అధికారుల పొరపాట్లతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బాలయ్య దిగాలు
సాక్షి, అనంతపురం : ‘అనంత’ రాజకీయాలు ఎలాగుంటాయో బాలయ్యకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించానుకున్న బాలకృష్ణ సేఫ్జోన్లో ఉండేందుకు టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడి నాయకుల మధ్య వర్గపోరుతో ఆయనకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. నాలుగు వర్గాలుగా విడిపోయిన నాయకులతో అటు బాలయ్య.. ఇటు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పచార పర్వంలో కూడా బాలయ్యకు అంతంత మాత్రంగానే ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. బాలయ్య ప్రచారంలో అబ్దుల్ ఘని, అంబికా వేర్వేరుగా కన్పిస్తున్నా మిగిలిన వారు దూరం దూరంగా ఉంటున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బాలకృష్ణ శుక్రవారం ప్రచారం ముగించుకుని అదే రాత్రికి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే నియోజకవర్గంలో నాయకత్వ లోపం ఉందని గ్రహించిన ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి హిందూపురంలోనే బసచేసి అసంతృప్తి నేతలు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడారు. శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు ఇంటికి వెళ్లి తన విజయానికి కృషి చేయాలని కోరినట్లు తెలిసింది. వెంకటరాముడు అనారోగ్యం కారణంగా బయట తిరగలేని పరిస్థితి ఉన్నా ఆయనకంటూ ఓ వర్గం ఉంది. దీంతో నాయకులందరినీ కలుపుకుని ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని బాలయ్య కోరినట్లు సమాచారం. అయితే అంతా ఏకతాటిపై నడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా తాను ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉందని, పది రోజుల తర్వాత వస్తానని.. ఆ సమయానికి పార్టీ పరిస్థితి మెరుగయ్యేలా చూడాలని చెప్పి తన బావమరిది ప్రసాద్‌ను హిందూపురంలోనే ఉంచి బాలకృష్ణ హైదరాబాద్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని ఆయన చంద్రబాబుకూ తెలియజేశారు. అయితే స్థానిక నేతలపై నమ్మకం లేక చంద్రబాబు తన దూతగా నారా వారి పల్లె నుంచి శేఖర్ అనే వ్యక్తిని హుటాహుటిన హిందూపురం పంపారు. ఇదిలా ఉండగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప బాలయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తరచూ తన కోపాన్ని అనుచరులు, నేతలపై బాలయ్య ప్రదర్శిస్తుండడమే ఇందుకు కారణమని సమాచారం. ‘ఎంత హీరో అయితే మాత్రం.. మమ్మల్ని పూచికపుల్లలా తీసేస్తారా?’ అంటూ కొంత మంది నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. అందుకే బాలకృష్ణను కలవడానికి కొంత మంది నాయకులు ఇష్టపడడం లేదని సమాచారం. రెండ్రోజుల క్రితం నిమ్మల కిష్టప్ప, అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణపై బాలకృష్ణ అందరి ముందూ చిర్రుబుర్రులాడినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో బాలయ్య ప్రచారానికి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఓ టీడీపీ నేత ధైర్యం చేసి.. ‘సార్.. 30 ఏళ్లుగా మనం ఇక్కడ గెలుస్తున్నా పెద్దగా అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ఈ విషయంపై బాగా చర్చ జరుగుతోంది. మొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ నామినేషన్‌కు జనం విపరీతంగా వచ్చారు. ఈ పరిస్థితిలో వాహనంపై నుంచి కాకుండా పల్లెల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లడుగుదాం’ అని సలహా ఇవ్వగానే బాలయ్య భగ్గుమన్నట్లు తెలిసింది. ‘ఈ ప్రాంతంలో మా నాన్న ఎన్టీఆర్ పేరు చెబితే చాలు ఓట్లు అవే పడతాయి’ అంటూ బాలకృష్ణ అవేశంగా ఊగిపోయారట. తర్వాత పలువురు నేతలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో ఆందోళన చెందిన ఆయన శుక్రవారం రాత్రి, శనివారం నేతల మధ్య సయోధ్య కుదర్చడంపైనే దృష్టి పెట్టారు. అయినా స్థానిక నేతలు ఎవరంతకు వారు వారి వాదనలు వినిపిస్తుండటంతో బాలకృష్ణ తలపట్టుకున్నట్లు సమాచారం. -
టెన్ కమాండ్మెంట్స్
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి. మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి. కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు. ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు. మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్‌గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం. బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి. నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు. రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి! -
తిరుమలెంత భద్రం?