safety certificate
-
చిరు వ్యాపార సముదాయాలకు.. సేఫ్టీ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. చిరు వ్యాపారస్తులు సుమారు 100 చదరపు గజాల విస్తీర్ణం గల భవనాలకు తప్పనిసరిగా ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ తప్పని సరిచేసి సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. చిన్న చిన్న షాపులు, వ్యాపారం చేసుకునే ఇంటి యజమానులు గానీ.. అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకునే వారు అగ్ని ప్రమాదాల నివారణకు ఎవరికి వారే స్వయంగా ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది. దరఖాస్తు విధానం ఇలా... ♦ వెబ్సైట్ www.ghmc.gov.in ను క్లిక్ చేసి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్‌ను సెలెక్ట్ చేయాలి లేదా https://firesafety. ghmc.gov.in లో లాగిన్ కావాలి. ♦ లింక్ ఓపెన్ చేసిన తర్వాత తమ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే వచ్చిన ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేయాలి. ♦ అగ్ని ఆర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ♦ అర్జీదారుడు ఇంటి ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (టిన్) కలిగి ఉన్న పక్షంలో టిన్ నంబర్‌తో పాటు ఎంపానెల్ ఏజెన్సీ ఎంపికను కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ టిన్ నంబర్‌లేని పక్షంలో షాప్ ఎస్టాబ్లిష్మెంట్, అడ్రస్, సర్కిల్ లేదా జోన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానల్ ఏజేన్సీని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ♦ ఎంపానెల్డ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజెన్సీ తమ షాపు వద్దకు వచ్చి అగ్ని ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ ఏజెన్సీ ఫిట్టింగ్ చేసినట్టు వెబ్సైట్లో నమోదు చేస్తారు. ♦ తదుపరి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్ స్టేటస్ రిపోర్ట్‌లో చూసుకోవచ్చు. ♦ జనరేట్ అయిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని షాప్‌లో డిస్ ప్లే చేసుకోవాలి. -
గూగుల్ కొత్త రూల్స్.. ఇక యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అది తప్పనిసరి!
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది. యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే.. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్! -
మెట్రో.. రెడీ
మెట్రో తొలిదశ ప్రారంభానికి సన్నాహాలు ఉగాదికి ఉషోదయం మార్చి 21న నాగోల్-మెట్టుగూడలో పరుగులు ప్రభుత్వ అనుమతులే తరువాయి కనీస చార్జీలపై త్వరలో స్పష్టత సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు పరుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. మార్చి 21 (ఉగాదిన)న ఇది పట్టాలెక్కనుంది. ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ జారీ చేయనున్న సేఫ్టీ సర్టిఫికెట్, సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారం ఇతర అనుమతులను త్వరలో పొందనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తొలిదశను ప్రారంభిస్తామని తెలిపాయి. ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. రంగులద్దడం, మెట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్నాయి. సిగ్నలింగ్, ట్రాక్, డ్రైవర్ రహిత టెక్నాలజీ వినియోగం, లైటింగ్, రైళ్ల సామర్థ్యం వంటి సాంకేతిక అంశాల్లో ఉప్పల్ మెట్రోడిపోలోని 8 రైళ్లు విజయవంతంగా ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నాయి. మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లోనూ ఈ నెలాఖరులోగా ఎనిమిది మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ 3.2 కి.మీ. పెరిగిన నేపథ్యంలో ఆ రూట్లో వాణిజ్య పరంగా ఎంతవరకు సాధ్యమో తేల్చేందుకు మరో ఆరునెలల్లోగా అధ్యయనం పూర్తి చేయనున్నట్లు ఎల్అండ్టీ వర్గాలు పేర్కొన్నాయి. చార్జీలపై త్వరలో స్పష్టత మెట్రో రైలు కనీస చార్జీ ఎంత ఉండాలన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే టోకుధరల సూచీ, ద్రవ్యోల్బణం ఆధారంగానే కనీస, గరిష్ట చార్జీలు, పార్కింగ్ చార్జీలను నిర్ణయించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేశాయి. 2012లో నిర్ణయించిన చార్జీల కంటే ఒకటి నుంచి రెండు రూపాయల మేర స్వల్పంగా పెరగనున్నట్లు తెలిసింది. కనీస, గరిష్ట చార్జీల్లో పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. ఒకసారి చార్జీలు నిర్ణయించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటిఫికేషన్ జారీ చేస్తుందని సమాచారం. ఇక తొలిదశ ప్రాజెక్టుకు అవసరమైన పార్కిం గ్ స్థలాల అన్వేషణ ప్రారంభించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్,ఉప్పల్ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మెర్రీ గో అరౌండ్ బస్సులపై... ఇక మెట్రో స్టేషన్లలో దిగిన ప్రయాణికులు సమీపంలోని కాలనీలకు చేరుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టనున్న మెర్రీ గో అరౌండ్ బస్సులు, మినీ బస్సులు, బ్యాటరీ ఆధారంగా నడిచే బస్సులు, పెద్ద ఏసీ బస్సులను ఎన్నిటిని నడపాలన్న అంశంపై మార్చి నెలలోనే స్పష్టత రానుంది. ఈ విషయంలో ఆర్టీసీతో చర్చించిన తరవాతనే బస్సులను ప్రవేశపెడతామని మెట్రో వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
సేఫ్టీ సర్టిఫికెట్ జారీయే తరువాయి
న్యూఢిల్లీ: మండి హౌస్-సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో మార్గంలో భద్రతా తనిఖీ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) సెంట్రల్ కమిషనర్ ఆమోదమే ఇక మిగిలిఉంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఈ మార్గంలో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. మూడో దశలో భాగంగా ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాన్ని ఈ నెల పదో తేదీన భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేసిన సంగతి విదితమే. సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చేందుకు మరో వారం రోజుల వ్యవధి పట్టే అవకాశముందని సంబ ంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ సీఎంఆర్ఎస్ నుంచి భద్రతా పత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) వచ్చేదాకా ఈ మార్గంలో సేవలను ప్రారంభించలేమన్నారు. సీఎంఆర్ఎస్ దీనిని లాంఛనంగా ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో సేవలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని నిర్దిష్టంగా ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల పదో తేదీన భద్రతా కమిషనర్‌తోపాటు వారి సిబ్బంది రోజంతా ఈ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. మూడో దశలో భాగంగా మూడు కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో గత ఏడాది డిసెంబర్లో సంబంధిత అధికారులు ప్రయోగాత్మక పరుగు కూడా నిర్వహించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అత్యంత రద్దీగా ఉండే రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై ప్రయాణికుల భారం తగ్గుతుంది. అంతేకాకుండా నోయిడా, వైశాలి దిశగా రాకపోకలు సాగించే ప్రయాణికులు బదర్పూర్-సెంట్రల్ సెక్రటేరియట్ లైన్ స్టేషన్లో ఇంటర్‌ఛేంజ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 70 వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. -
ప్రయాణానికి మెట్రో రెడీ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ‘ముంబై మెట్రో’ రైలుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం సోమవారం సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్లు అధికారులు సంతృప్తివ్యక్తం చేశారు. ఇక భద్రతాపరమైన సామర్థ్యాన్ని సూచించే ధ్రువపత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) జారీ చేయడమే మిగిలిపోయింది. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన దీనిని జారీ చేయనున్నట్లు ఇదివరకే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సేవలు ప్రారంభించేందుకు రైల్వే పరిపాలనా విభాగం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ తరువాత ముంత్రులు లేదా వీఐపీల నుంచి అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. లోకల్ రైళ్లలో నిత్యం రద్దీ, ఉక్కపోతతో సతమతమవుతున్న ముంబైకర్లకు మెట్రో సేవలు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి ఎండల కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబైకర్ల మెట్రో ఏసీ బోగీల్లో సౌకర్యంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెమ్మార్డీయే తొలిసారిగా మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తుండడంతో వీటి కోసం నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెట్రో-1 ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మధ్య నిర్మిస్తున్న 11 కిలోమీటర్లు పొడవైన కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అనేక డెడ్లైన్లు కూడా వాయిదా పడటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో సీఎంఆర్ఎస్ బృందం భద్రతా పరీక్షలు నిర్వహించింది. సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు కాగానే ముహూర్తం ఖరారు చేస్తామని మెట్రో రైల్వే భద్రతా విభాగం కమిషనర్ పి.ఎస్.వాఘేలా చెప్పారు. విమానసేవలకు ఓకే రత్నగిరి-ముంబై ప్రాంతాల మధ్య 1991లో నిలిచిపోయిన విమానసేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ‘ఇండియాపూల్’ కంపెనీ విమానం ద్వారా ఈ రెండు ప్రాంతాలను ఇటీవల సందర్శించింది. ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రభుత్వమూ అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య త్వరలోనే విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఎనిమిది సీట్ల సామర్థ్యమున్న తేలికపాటి విమానాలను నడపాలని యోచిస్తున్నారు. ఈ సేవలను స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నామని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఎంఐడీసీ ఆధ్వర్యంలో 1991 వరకు ముంబై-రత్నగిరి జిల్లా మధ్య విమాన సేవలు నడిచేవి. ఈ చిన్న విమానాలను రత్నగిరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు వినియోగించేవారు. కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిపోయింది. అదేవిధంగా రన్‌వే కూడా విమానాలకు అనుకూలంగా లేదు. దీనికి మరమ్మతులు చేపట్టాలని ఎంఐడీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఎంఐడీసీ 1991లో రత్నగిరి విమానాశ్రయంలో ప్రైవేటు విమానాల ల్యాండింగ్‌ను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం రత్నగిరి జిల్లా వేగంగా విస్తరిస్తోంది. అనేక ప్రాజెక్టులు వచ్చాయి. జాతీయ ర హదారులు, రైల్వే, జలరవాణా ద్వారా రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వాహనాల సంఖ్య భారీగా పెరగడం, ర హదారిపై ప్రమాదకర మలుపులు, రోడ్డు ప్రమాదాలు, విలువైన సమయం వృథా తదితరాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే విమానసేవల ప్రాధాన్యమేమిటో తెలిసి వచ్చిందని ఎంఐడీసీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అందుకే ముంబై-రత్నగిరి మధ్య తేలికపాటి విమానాల సేవలను ప్రారంభిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదేవిధ ంగా కొంకణ్ ప్రాంతం కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి. ఇక్కడికి నిత్యం దేశ, విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. విమానసేవలు ప్రారంభిస్తే కొంకణ్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇంచార్జి మంత్రి ఉదయ్ సామంత్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇండియాపూల్తో చర్చించామని అన్నారు. -
మెట్రో ‘సేఫ్టీ’కి పచ్చజెండా..!
సాక్షి, ముంబై: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు రైల్వే సేఫ్టీ బోర్డు నుంచి ‘సేఫ్టీ సర్టిఫికెట్’ మే ఒకటో తేదీన లభించే అవకాశాలున్నాయి. దీంతో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అధికారులు 12 సార్లు ఇచ్చిన డెడ్లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరి స్థితి నెలకొంది. ఎట్టకేలకు మే ఒకటి మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రైల్వే సేఫ్టీ బోర్డు సిబ్బంది తనఖీలు నిర్వహించి సేఫ్టీ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. దీంతో మెట్రో సేవలకు ముహూర్తం పెట్టేందుకు మార్గం సుగమమైంది. గత ఐదేళ్లుగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య మెట్రో ప్రాజెక్టును ఎమ్మెమ్మార్డీయే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఓటీ పద్ధతిలో చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం రూ.2,356 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పలుమార్లు డెడ్లైన్లు వాయిదా పడినప్పటికీ అంచనావ్యయం మాత్రం పెరగలేదు. ఈ మొత్తంలో రూ.512 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో 133 కోట్లు ఎమ్మెమ్మార్డీయే, రూ.354 కోట్లు రిలయన్స్, రూ.25 కోట్లు మరో సంస్థ వాటా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజె క్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్రాక్, ప్లాట్‌ఫారాలు, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పనులు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉంది. రైల్వే సేఫ్టీ బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహించిన అనంతరం సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ప్రారంభించే రాజకీయ లేదా పదవిలో ఉన్న మంత్రులు, ఇతర ప్రముఖుల అపాయింట్మెంట్ తీసుకుని ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఇదిలాఉండగా ప్రస్తు తం సేవలు అందిస్తున్న, దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టిన మోనో రైలుకు ప్రజల నుంచి అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. మూడు నెలల కాల వ్యవధిలో ఎమ్మెమ్మార్డీయేకు రావల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సిద్ధమవుతోంది. ఈ రైలును ముంబైకర్లు ఎలా ఆదరిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా, ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన ప్పటినుంచి వేర్వేరు చోట్ల మొత్తం ఏడు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోగా 17 మంది కూలీలు తీవ్రం గా గాయపడ్డారు.వారికి నష్టపరిహారం కింద రూ.49.8 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అంతేగాక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెమ్మార్డీయే సైతం రూ.46.50 లక్షలు జరి మానా కూడా చెల్లించాల్సి వచ్చింది. చార్జీలపై తొలగని స్తబ్ధత త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలులో ప్రయాణికులకు చార్జీలు ఎంతమేర నిర్ణయించాలనే అంశంపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత చార్జీలపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చార్జీల విషయంలో ప్రభుత్వం, రిలయన్స్ సంస్థ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రభుత్వం కనీస చార్జీలు రూ.9, గరిష్ట చార్జీలు రూ.24 చొప్పున వసూలు చేయాలని యోచిస్తోంది. కాని రిలయన్స్ సంస్థ కనీస చార్జీలు రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కచ్చితంగా ఎంత మేర వసూలు చేయాలనే దానిపై ఇంతవరకు నిర్ణయం కాలేదు. బెస్ట్ బస్ చార్జీల కంటే మెట్రోకు ఒకటిన్నర రేటు ఎక్కువ కేటాయించాలని ప్రభుత్వం యోచి స్తోంది. కాని ఇంత తక్కువ చార్జీలతో మెట్రోలాంటి అత్యంత ఖరీదైన రవాణా సాధనాల్లో సేవలు అం దించడం సాధ్యం కాదని రిలయన్స్ తేల్చి చెప్పింది. అందుకు కనీస చార్జీలు రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 కేటాయించాల్సిందేనని ప్రతిపాదించింది. కాని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. బెస్ట్ సంస్థను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో బెస్ట్ బస్సుల్లో చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని నిలిపివేస్తే బెస్ట్ బస్సుల్లో కూడా చార్జీలు విపరీతంగా పెరుగుతాయని అభిప్రాయపడింది. కాగా మెట్రోకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లభించదు. దీంతో తక్కువ చార్జీలతో ఖరీ దైన మెట్రో సేవలు అందించడం సాధ్యం కాదని రిలయన్స్ సంస్థ వాదిస్తోంది. దీనిపై ఎన్నికల ఫలి తాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు. -
మెట్రో కారిడార్ సిద్ధం..
సేఫ్టీ సర్టిఫికెట్ రావడమే తరువాయి.. మార్చిలోనే మొదలుపెట్టేందుకు యోచన సేవలు మొదలైతే గంటకు పైగా ప్రయాణ సమయం ఆదా సాక్షి, ముంబై: నగర వాసులు వచ్చే నెల నుంచి మెట్రో రైలు సేవలు పొందనున్నారు. సేఫ్టీ సర్టిఫికెట్ పొందడంలో జాప్యం వల్ల ఈ మెట్రో మొదటి కారిడార్‌ను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లయితే దీని ప్రారంభోత్సవానికి తలనొప్పిగా మారనుంది. ‘రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్’ (ఆర్డీఎస్ఓ) గత వారంలోనే సేఫ్టీ ట్రైల్ రన్‌ను నిర్వహించింది. 11.4 కి.మీ. మేర వర్సోవ-అంధేరి-ఘాట్కోపర్‌ల (వీఏజీ) కారిడార్‌ను వీలైతే ఇదే నెలలో నగర వాసుల కోసం అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే సేఫ్టీ సర్టిఫికెట్ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఆర్‌ఎస్‌డీఓ ప్రయోగాత్మకంగా నడిపిన రైలుపై నివేదికను సమర్పించలేదు. ఈ నివేదికను సమర్పించిన తర్వాత కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) చివరగా సేఫ్టీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. సేఫ్టీ సర్టిఫికెట్ లభించేందుకు కొంత సమయం పట్టనుందన్నారు. అది లభించడమే ఆలస్యం.. మార్చి వరకు మెట్రో కారిడార్‌ను సిద్ధం చేస్తామన్నారు. ఇదిలావుండగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) జాగృతి నగర్లో స్థలాన్ని సేకరించి వీఏజీ కారిడార్ కోసం మరో కొత్త స్టేషన్ కోసం మెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయానికి ఈ స్టేషన్ కూడా సిద్ధమవుతుందన్నారు. గతంలో ఫైర్ బ్రిగేడ్ ఇక్కడ స్టేషన్‌ను మెట్లు లేకుండా నిర్మించడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అధికారులు స్టేషన్ వద్ద హాల్ట్‌ను ఏర్పాటు చేయవద్దని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2,356 కోట్ల వ్యయమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మెట్రో వన్ ప్రాజెక్టు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలను అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. 2010 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని గడువు విధించినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఏడు మార్లు గడువును పొడిగించారు. ఈ 11.4 కి.మీ వర్సావ-ఘాట్కోపర్‌ల మధ్య ప్రయాణం చేయడంతో రద్దీ సమయంలో ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పోల్చితే 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. మెట్రో భద్రత..: అన్ని మెట్రో స్టేషన్లలో దాదాపు 100 ఎల్సీడీలను అమర్చనున్నారు. ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తదితర సమాచారాన్ని వీడియో క్లిప్పింగ్స్, సమాచారం ద్వారా తెలియజేయనున్నారు. భద్రతా కంట్రోలర్‌తోపాటు అన్ని మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లు దాదాపు 95 ఎస్కలేటర్లు కలిగి ఉంటాయి. 45 ఎలివేటర్లు, ప్రయాణికుల సౌకర్యార్థం 100 మెట్ల నిర్మాణాలను చేపట్టారు.