Sagar water level
-
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నల్గొండ : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 514.50 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇన్‌ఫ్లో 22,330 క్యూసెక్కులు కాగా... ఔట్ఫ్లోలో 22,330 నీరు ఉందని వారు వెల్లడించారు. అలాగే శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 873 అడుగులు కాగా... నీటి నిల్వ 155 టీఎంసీలు ఉంది. అయితే ఇన్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ఫ్లోలో 26,501 నీరు ఉంది -
సాగర్ ప్రక్షాళనకు విరామం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లే. సాగర్ ప్రక్షాళన కోసం అధికారులు గత మార్చి నుంచి నీటిని ఖాళీ చేసే చర్యలు ప్రారంభించారు. దాంతో 512.9 మీ. లెవెల్ ఉన్న సాగర్ రిజర్వాయర్ మే నెలాఖరు నాటికి 512 మీటర్ల లెవెల్ వరకు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగర్‌నీటి మట్టం తిరిగి 512.7 మీటర్ల వరకు చేరింది. అంటే దాదాపుగా యథావిధి స్థాయికి చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్) 513.41 మీటర్లు. వర్షాలు కురస్తుండటంతో ఈ ఏడు ప్రక్షాళన పనుల్ని అధికారులు నిలిపివేసినట్లే. ఎప్పటిలాగే వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తూములకు మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారు. వర్షాల్లేని రోజుల్లోనే ఆ పనుల్ని చేస్తూ ఉన్నారు. సాగర్ నుంచి నీటిని అవసరాన్ని బట్టి విడుదల చేసేందుకు రూ.1.02 కోట్లతో అలుగు దిగువభాగం నుంచి నీరు వెళ్లేందుకు అవసరమైన పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే అలుగు కంటే తక్కువ ఎత్తులో నీరున్నా దిగువకు వదలడానికి వీలవుతుంది. రానున్న సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సాగర్‌లోనే ఈ నిమజ్జనాలు పూర్తయ్యాక, వచ్చే నవంబర్- డిసెంబర్లలో తిరిగి సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టి వచ్చే ఏడాది వేసవిలో సాగర్‌ను ఖాళీ చేయాలనేది అధికారుల యోచనగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో..: వేసవిలో సాగర్‌లో నీటినంతా ఖాళీ చేసి అడుగున ఉన్న చెత్తాచెదారాల్ని తొలగించాలని నిరుడు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సాగర్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను సీఎం పరిశీలించి వాటిలో అద్భుతమైన టవర్స్‌ను నిర్మించవచ్చని చెప్పారు. గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ఇందిరాపార్కులో వినాయకసాగర్ పేరిట రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినప్పటికీ, బీజేపీ తదితర పక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రక్షాళనకు రూ. 350 కోట్లు.. సాగర్ ప్రక్షాళనపై అధ్యయనం కోసం దాదాపు రూ. కోటి ఖర్చు కాగలదని అంచనా వేసిన ఆస్ట్రియా ప్రభుత్వం.. రూ. 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వె చ్చిస్తే మిగతా రూ. 80 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అధ్యయనం అనంతరం సాగర్ ప్రక్షాళనకు మొత్తం రూ. 350 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో 80 శాతం నిధుల్ని ఆస్ట్రియా ప్రభుత్వమే అక్కడి ఆర్థికసంస్థల ద్వారా ఇప్పిం చేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ అంశంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 572.70 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇన్‌ఫ్లో 13వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లోలో 18వేల 800 క్యూసెక్కుల నీరు ఉన్నట్టు వారు వెల్లడించారు. -
నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద
హైదరాబాద్: నాగార్జునసాగర్‌కు వరద తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో నిల్, ఔట్‌ఫ్లో 41వేల యూసెక్కుల నీరు ఉంది. నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆరు యూనిట్ల ద్వారా 600 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. -
నాగార్జునసాగర్‌కు నిలిచిపోయిన వరద
నల్గొండ : నాగార్జునసాగర్‌కు వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 579 అడుగులన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఔట్‌ఫ్లో 53 వేల 300 క్యూసెక్కుల నీరు ఉంది.7 జనరేట్లర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
సందిగ్ధంలో సాగర్ రైతాంగం
►ఒక పంటకైనా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ ►541.10 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం మాచర్లటౌన్: సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కుడికాలువ రైతులు సందిగ్ధంలో పడ్డారు. జలాశయ నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి 30 అడుగులు వుండడంతో ఒక పంటకైనా అవకాశం కల్పించాలని రైతాంగం కోరుతోంది. ►పది రోజుల కిందట తాగు నీటి అవసరాల కోసం ప్రభుత్వం కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసింది. ప్రతి రోజు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ►గురువారం నాటికి సాగర్ జలాశయ నీటిమట్టం 541.10 అడుగు లకు చేరింది. అంటేఇది కనిష్ట స్థాయి కన్నా 30 అడుగులు ఎక్కువ. నీటి మట్టం 510 అడుగుల వరకు మాత్రమే ఉంటే కాలువలకు నీరు విడుదల చేసే అవకాశం ఉండదు. ►ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ రోజురోజుకు కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ►ఓ వైపున శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు నిలిచిపోవటంతో జలాశయ నీటిమట్టం గురువారం 875.70 అడుగుల వద్ద ఉంది. ఇది 167 టీఎంసీలకు సమానం. ►సాగర్ రిజర్వాయర్‌లో కూడా 188 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగు నీటి విడుదల నిమిత్తం కుడి కాలువకు 6,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 5,108 క్యూసెక్కులు, కృష్ణాడెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,158 క్యూసెక్కులు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ►సాగర్ నుంచి ఔట్‌ఫ్లోగా 17,266 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా 75 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వల దృష్ట్యా సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఒక పంటకు నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ►ప్రస్తుతానికి వర్షాలు లేక కృష్ణాపరివాహక ప్రాంతంలో ఇన్‌ఫ్లో నిలిచి పోయినా రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండటం, సెప్టెంబరు నెలలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదలపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ►ప్రస్తుతం ఉన్న నిల్వలతో చెరువులు నింపడంతోపాటు, ఒక పంటకు నీళ్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికైనా నీటి విడుదల పై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి వుంది.