నగరంలో దొంగల కలకలం
హైదరాబాద్ సిటీ: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చెలరేగిన దొంగలు నగరంలోని సహారా ఎస్టేట్స్‌లో 10 ఇళ్లు దోచుకున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్స్‌లో జరిగింది. గుర్తుతెలియని దుండగులు కాలనీలో తాళం వేసి ఉన్న 10 ఇళ్లకు రంధ్రాలు చేసి చోరీకి పాల్పడ్డారు.
శుక్రవారం ఇది గమనించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంల సహాయంతో ఆధారాల కోసం గాలిస్తున్నారు. కాగా, తాళం వేసి ఉన్న ఇంటి యజమానులు వస్తేనే ఎంత మొత్తంలో దొంగతనం జరిగిందో తెలుస్తుందని పోలీసులు చెప్పారు.