అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ సహారా ఎస్టేట్స్లో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది.
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ సహారా ఎస్టేట్స్లో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. యోగా దినోత్సవం సందర్భంగా డా. వీరారెడ్డి యోగా చేస్తు కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరారెడ్డి మార్గమధ్యంలోనే మరణించారని వైద్యులు వెల్లడించారు. దీంతో వీరారెడ్డి నివాస పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. డా. వీరారెడ్డి నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో వైద్యునిగా సేవలందిస్తున్నారు.