sainathreddy
-
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బుక్కరాయసముద్రం ఏఈ గోపాల్‌రెడ్డి - రైతు నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో విద్యుత్‌శాఖ ఏఈగా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌రెడ్డి ధర్మవరం నుంచి బదిలీపై నాలుగేళ్ల క్రితం బుక్కరాయసముద్రం వచ్చాడు. మండల పరిధిలోని నీలారెడ్డిపల్లికి చెందిన సాయినాథ్‌రెడ్డి అనే రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం 2014లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం రూ.52 వేల డీడీ కూడా చెల్లించాడు. 2015 జూన్ 15న ఇతనికి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసింది. అప్పటి నుంచి దాన్ని పొలంలో ఏర్పాటు చేయాలని ఏఈని సాయినాథ్‌రెడ్డి వేడుకుంటున్నాడు. తనకు లంచం ఇవ్వాలని, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వేరొకరికి ఇస్తానని గోపాల్‌రెడ్డి బెదిరించాడు. ఆయనడిగిన రూ.7 వేల లంచం ఇవ్వలేక సాయినాథ్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకే ఏఈకి సోమవారం ఆయన కార్యాలయంలోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఏఈ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి.. ఏఈని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
సప్తగిరికాలనీ, న్యూస్‌లైన్ : సాక్షి, ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్ వరల్డ్ స్కూల్లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది. అక్షరదోషాలు లేకుండా ఆంగ్ల పదాలు రాయడం.. వాటిని ఎలా పలకాలో క్లుప్తంగా వివరించడం.. కొత్త ఆంగ్ల పదాలు విద్యార్థులకు పరిచయం చేయడానికి సాక్షి, ఇండియాస్పెల్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ పరీక్షను దేశమంతటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్లో విజేతలకు జోనల్‌స్థాయిలో పరీక్ష నిర్వహించారు. దీనికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతి, కేటగిరీ-2లో మూడు, నాలుగు, కేటగిరీ-3లో ఐదు నుంచి ఏడు, కేటగిరీ-4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 211 మంది హాజరుకాగా.. ‘సాక్షి’ టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వేశారు. వాటికి అక్షరదోషాలు లేకుండా విద్యార్థులు పదాలు రాశారు. లైవ్ ద్వారా పరీక్ష కావడంతో చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు. పరీక్షను సాక్షి రీజనల్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు పర్యవే క్షించారు. కార్యక్రమంలో సాక్షి డెప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్, ఇండియా స్పెల్‌బీ ప్రతినిధి సాయినాథ్‌రెడ్డి, ఐరిస్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్‌దత్త, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు